ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

శుద్ధి చేసిన చిరుతిండ్లతో క్యాన్సర్‌

ABN, Publish Date - Aug 19 , 2025 | 04:14 AM

అంతర్జాతీయ క్యాన్సర్‌ పరిశోధన ఏజెన్సీ ఐఎఆర్‌సి, శుద్ధి చేసిన మాంసాన్ని గ్రూప్‌ 1 క్యాన్సర్‌ కారకంగా గుర్తించింది.

అంతర్జాతీయ క్యాన్సర్‌ పరిశోధన ఏజెన్సీ ఐఎఆర్‌సి, శుద్ధి చేసిన మాంసాన్ని గ్రూప్‌ 1 క్యాన్సర్‌ కారకంగా గుర్తించింది. దీని తర్వాతి స్థానం చక్కెరదే! ఏదో ఒక చిరుతిండి తినాలనే కోరికతో మనం అందుకునే ప్యాకేజ్డ్‌ ఫుడ్స్‌ క్యాన్సర్‌ కారకాలుగా మారుతున్నాయి. ఆ పదార్థాలు వాటిలోని విషపూరితాల గురించి తెలుసుకుందాం!

అదనపు చక్కెర స్థూలకాయంతో పాటు, రొమ్ము, కాలేయం, పెద్దపేగు క్యాన్సర్లకు దారి తీస్తుంది. అలాగే ఇన్సులిన్‌ రెసిస్టెన్స్‌కు దారి తీసి, తీవ్రమైన ఇన్‌ఫ్లమేషన్‌ను పెంచుతుంది. శుద్ధి చేసిన పదార్థాలను ఎక్కువగా తిన్న వాళ్లలో క్యాన్సర్‌ ముప్పు ప్రత్యేకించి రొమ్ము క్యాన్సర్‌ ముప్పు మరింత ఎక్కువనే ఒక పరిశోధనాత్మక వ్యాసం బ్రిటిష్‌ మెడికల్‌ జోర్నల్‌లో తాజాగ ప్రచురితమైంది. శుద్ధి చేసిన పదార్థాల్లో కొవ్వు, చక్కెర, ఉప్పులు ఎక్కువగా ఉండడంతో పాటు పీచు, కీలకమైన పోషకాలు ఎంతో తక్కువగా ఉంటాయి. శుద్ధి చేసిన పదార్థాల అసహజ నిర్మాణాలు శక్తిని ఖర్చు చేసేకునే సాధారణ తత్వాన్ని కుంటుపరిచి, ఆక్సిడేటివ్‌ స్ట్రెస్‌కు గురి చేస్తాయనీ, ఫలితంగా క్యాన్సర్‌ సోకుతుందనీ వెద్యులు అంటున్నారు. ప్రొటీన్‌ బార్స్‌, గ్రనోలా బార్స్‌, తీయని పెరుగు లాంటి వాటిని మనం ఆరోగ్యకరమైన చిరుతిండ్లుగా పరిగణిస్తూ ఉంటాం. కానీ వీటన్నిట్లో చక్కెరలు, నూనెలు, రసాయనాలు దాగి ఉంటాయి. సేంద్రీయమైనవి, సహజసిద్ధమైనవిగా ప్రచారంలో ఉన్న ఉత్పత్తుల్లో సైతం క్యాన్సర్‌ కారకాలు ఉంటాయి కాబట్టి వాటికి కూడూ దూరంగా ఉండడం మేలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అయితే శుద్ధి చేసిన చిరుతిండ్లను ఇష్టపడేవారు పొట్టు తీయని, శుద్ధి చేయని నట్స్‌, పాప్‌కార్న్‌ లేదా ఇంట్లో తయారుచేసిన చిరుతిండ్లను ఎంచుకోవచ్చు. అలాగే కొనే ప్రతి చిరుతిండి ప్యాకెట్‌ లేబుల్‌ను పరిశీలిస్తూ, కృత్రిమ రుచులు, రంగులు, అత్యధిక చక్కెరలు, హైడ్రోజినేటెడ్‌ కొవ్వులున్న వాటి జోలికి వెళ్లకుండా ఉండాలి.

Updated Date - Aug 19 , 2025 | 04:14 AM