Papaya Benefits: ఔషధాల గని
ABN, Publish Date - Nov 03 , 2025 | 06:18 AM
బొప్పాయి పండు రోగనిరోధకశక్తిని పెంచడంలో ఔషధంలా పని చేస్తుంది. మన రోజువారీ ఆహారంలో దీన్ని చేర్చుకొంటే పలు వైరస్‌ల నుంచి కాపాడుతుందని నిపుణులు చెబుతున్నారు.
బొప్పాయి పండు రోగనిరోధకశక్తిని పెంచడంలో ఔషధంలా పని చేస్తుంది. మన రోజువారీ ఆహారంలో దీన్ని చేర్చుకొంటే పలు వైరస్‌ల నుంచి కాపాడుతుందని నిపుణులు చెబుతున్నారు.
పోషకాలు, ఫైబర్
బొప్పాయిలో అనేక పోషకాలు, ఫైబర్‌లతో పాటు... ఫోలేట్, బీ6, క్యాల్షియం, మెగ్నీషియం, విటమిన్ ఏ, సీ, బీ1, బీ3, ఇ, కె, పొటాషియం ఉన్నాయి. బొప్పాయిలోని యాంటీఆక్సిడెంట్లు, యాంటీఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు క్యాన్సర్ కారకాలను అడ్డుకొంటాయి. బొప్పాయి ఆకుల్లో కూడా చాలా ఔషధ గుణాలున్నాయి. డెంగ్యూ పేషెంట్లలో ప్లేట్‌లెట్ల కౌంట్ పెంచడంలో ఇవి బాగా పని చేస్తాయంటారు. బొప్పాయిని చాలా ఔషధాల్లో ఉపయోగిస్తారు.
ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షణ
బొప్పాయిలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజ లవణాలు విరివిగా ఉండడం వల్ల రోగనిరోధకశక్తి పెరిగి, వైరస్‌లు, ఇన్‌ఫెక్షన్ల నుంచి కాపాడతాయి. ఇందులోని సీ, ఇ విటమిన్లు, బీటాకారోటిన్ లాంటి యాంటీఆక్సిడెంట్లు ఊపిరితిత్తులు, ముక్కు రంధ్రాలల్లో శ్వాససంబంధిత సమస్యలను తగ్గిస్తాయి. జ్వరం, గొంతు మంట, నొప్పి, జలుబువల్ల కలిగే ఇబ్బందుల నుంచి ఉపశమనం లభిస్తుంది.
మధుమేహం తగ్గించడంలో...
పాటాషియం సమృద్ధిగా ఉండటంవల్ల హైబీపీని నియంత్రణలో ఉంచుతుంది. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు మధుమేహాన్ని తగ్గించడంలో దోహదపడతాయి. బొప్పాయిలో కేలరీలు తక్కువ. కనుక తింటే బరువు పెరుగుతామనే భయం అక్కర్లేదు.
గుండెను ఆరోగ్యంగా...
ఈ పండులోని సీ, ఇ విటమిన్లతో పాటు బీటా కెరోటిన్ వంటి యాంటీఆక్సిడెంట్లు శరీరంలో కొవ్వు తగ్గించి, గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో దోహదపడతాయి. రక్తనాళాలను శుభ్రం చేసి, రక్తప్రసరణను మెరుగుపరుస్తాయి.
Updated Date - Nov 03 , 2025 | 06:18 AM