ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Oral Cleanliness Prevention Tips: నోటి బ్యాక్టీరియాతో గుండెపోటు

ABN, Publish Date - Sep 30 , 2025 | 03:08 AM

నోట్లో నివసించే బ్యాక్టీరియా దంతాలను దెబ్బతీయడమే కాకుండా గుండెపోటు ముప్పును కూడా పెంచుతుందని ఒక అధ్యయనంలో వెల్లడైంది. వివరాల్లోకి వెళ్తే...

అధ్యయనం

నోట్లో నివసించే బ్యాక్టీరియా దంతాలను దెబ్బతీయడమే కాకుండా గుండెపోటు ముప్పును కూడా పెంచుతుందని ఒక అధ్యయనంలో వెల్లడైంది. వివరాల్లోకి వెళ్తే...

ఫిన్‌ల్యాండ్‌లోని ట్యాంపిర్‌ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు, గుండెజబ్బులతో బాధపడే రోగులతో పాటు అకస్మాత్తుగా గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయిన రోగుల గుండె రక్తనాళాల్లోని పూడికలను సేకరించి పరీక్షించినప్పుడు, 40ు పూడికల్లో నోటి బ్యాక్టీరియాకు చెందిన జన్యు ఆనవాళ్లు కనిపించాయి. ఇవన్నీ స్ట్రెప్టోకైకై సమూహానికి చెందిన బ్యాక్టీరియాలనీ, వ్యాధినిరోధకశక్తిలోకి చొరబడలేని కొన్ని సూక్ష్మజీవులు గుండె రక్తనాళాల్లోని పూడికల్లో పేరుకుపోయి, పూడికలను చెదరగొట్టి గుండెపోట్లకు కారణమవుతూ ఉంటాయని పరిశోధకులు అంటున్నారు. నోటి పరిశుభ్రత, గుండె ఆరోగ్యానికీ మధ్య ఉన్న దీర్ఘకాలపు అనుబంధానికి సంబంధించిన ఆధారాలకు ఈ అధ్యయనం బలం చేకూరుస్తోంది. ఇతర ఇన్‌ఫెక్షన్లు, పోషకాహారలోపాలు, ఒత్తిడల వల్ల ప్రేరేపితమయ్యే నిద్రాణ స్థితిలోని బ్యాక్టీరియా కాలనీలు రక్తనాళల్లోని పూడికలను ఛిద్రం చేసి, రక్తప్రవాహానికి అడ్డుపడేలా దోహదపడుతూ ఉంటాయి. అయితే బ్యాక్టీరియా నోటి నుంచి గుండె రక్తనాళాల్లోకి ఎలా చేరుకోగలుగుతోందనే దానికి సంబంధించి మరింత పరిశోధన చేపట్టవలసిన అవసరం ఉంది. అయితే అప్పటివరకూ గుండె ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుకోవడం కోసం నోటి పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలనీ, రోజుకు రెండుసార్లు దంతాలను శుభ్రపరుచుకోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

పాపం ఈ అమ్మాయి.. రోడ్డుపై గుంత ప్రాణం తీసింది..

దేశంలోని విస్కీ అమ్మకాల్లో 58శాతం దక్షిణ భారతంలోనే

Updated Date - Sep 30 , 2025 | 03:08 AM