Benefits of Pittapafada Leaves: కలుపు మొక్కే కదా అని వదిలేయవద్దు
ABN, Publish Date - Sep 13 , 2025 | 02:09 AM
కలుపు మొక్కలను పొలాల నుంచి పీకి పారేస్తూ ఉంటాం. కానీ మనం కలుపు మొక్కలుగా భావించే వాటిలో కొన్నింటికి అపూర్వమైన ఔషధ గుణాలు ఉంటాయి. అలాంటి వాటిలో పిత్తపాఫడ మొక్క ఒకటి. వరి, గోధుమ చేలలో...
భోజన కుతూహలం
కలుపు మొక్కలను పొలాల నుంచి పీకి పారేస్తూ ఉంటాం. కానీ మనం కలుపు మొక్కలుగా భావించే వాటిలో కొన్నింటికి అపూర్వమైన ఔషధ గుణాలు ఉంటాయి. అలాంటి వాటిలో పిత్తపాఫడ మొక్క ఒకటి. వరి, గోధుమ చేలలో పెరిగే ఈ మొక్క గురించి కొందరు రైతులకు తెలుసు. అందుకే వారు చిన్న చిన్న ఆరోగ్య సమస్యల పరిష్కారానికి ఈ మొక్కను వాడతారు. ఈ మొక్క ఆకులు చిరు చేదుగా ఉంటాయి. భోజన కుతూహలంలోని 12వ అధ్యాయంలో ఈ ఆకుల గురించి వర్ణనతో పాటుగా వీటిని ఏ విధంగా వాడాలనే విషయం కూడా ఉంది. ఇక ఈ ఆకులకు ఉన్న ఔషధ గుణాలేమిటో తెలుసుకుందాం.
ఈ మొక్క పిత్త, కఫ దోషాలను నివారిస్తుంది. వేడి, పైత్యం వల్ల వచ్చే జ్వరాలను నివారిస్తుంది.
ఈ మొక్క ఆకులను ఎండబెట్టి వాటితో టీ కాచుకొని తాగితే వెంటనే చెమటలు పట్టి జ్వరం తగ్గుతుంది.
కొందరికి ప్రతి రోజూ రాత్రి అరికాళ్లలో మంటలు వస్తూ ఉంటాయి. వారికి ఈ మొక్క ఆకులు మంచి ఔషధంలా పనిచేస్తాయి.
ఈ మొక్క ఆకులు అజీర్తిని తగ్గిస్తాయి. గ్యాస్ బాధకు ఇవి మంచి విరుగుడు.
ఈ ఆకులు చర్మవ్యాధులను తగ్గిస్తాయి. అలర్జీల వల్ల చర్మంపై కలిగే దురదను నివారిస్తాయి. ఈ ఆకుల రసాన్ని రాస్తే చర్మం మృదువుగా మారుతుంది.
ఈ ఆకులతో షడంగ పానీయం తయారుచేస్తారు. మంచి నీటిని తీసుకొని దానిలో పిత్తపాఫడ ఆకులను వేసి బాగా మరిగించాలి. మామూలు నీళ్ల బదులుగా వీటిని తాగితే శరీరంలోని రకరకాల దోషాలు తొలగిపోతాయి. రోగనిరోధక శక్తి కూడా బాగా పెరుగుతుంది.
ఈ ఆకులకు బైల్ అనే పిత్తస్రావాన్ని పెంచే శక్తి ఉంది. పిత్తస్రావం పెరిగితే కామెర్లు తగ్గుతాయి. కాలేయంలో వాపు ఉన్నా తగ్గుతుంది. చికెన్‌గున్యా, డెంగ్యూ వంటి జ్వరాల వచ్చినప్పుడు కూడా వీటిని తాగుతారు.
గంగరాజు అరుణాదేవి
ఈ వార్తలు కూడా చదవండి..
భాగ్యనగర వాసులకు బిగ్ అలర్ట్.. మూసీ పరివాహక ప్రాంతాల్లో రెడ్ అలర్ట్
లాకర్ తాళాల కోసం చిత్ర హింసలు పెట్టి..
Read Latest Telangana News and National News
Updated Date - Sep 13 , 2025 | 09:14 AM