ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Malala Yousafzai Autobiography: మలాలా ఓ ప్రేమ కథ

ABN, Publish Date - Oct 11 , 2025 | 06:00 AM

నోబెల్‌ బహుమతి గ్రహీత మలాలా యూసఫ్జాయి, ప్రేమించిన వ్యక్తిని పెళ్లాడి ఇప్పటికి నాలుగేళ్లు. ఇంత కాలం తర్వాత మలాలా తన వ్యక్తిగత జీవితం గురించి, భర్త యాసర్‌ మాలిక్‌తో తన తొలినాళ్ల అనుబంధం గురించీ ‘ఫైండింగ్‌ మై వే’...

వార్తల్లో వ్యక్తి

నోబెల్‌ బహుమతి గ్రహీత మలాలా యూసఫ్జాయి, ప్రేమించిన వ్యక్తిని పెళ్లాడి ఇప్పటికి నాలుగేళ్లు. ఇంత కాలం తర్వాత మలాలా తన వ్యక్తిగత జీవితం గురించి, భర్త యాసర్‌ మాలిక్‌తో తన తొలినాళ్ల అనుబంధం గురించీ ‘ఫైండింగ్‌ మై వే’ అనే జీవిత చరిత్రలో వివరించింది.

అక్టోబరు 21న విడుదల కాబోతున్న

ఈ పుస్తకంలో మలాలా పంచుకున్న మధురస్మృతులు ఇవే!

ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయంలో చదువుకునే సమయంలో 35 ఏళ్ల యాసర్‌ మాలిక్‌తో గోప్యంగా డేటింగ్‌ చేయడంలో ఎదుర్కొన్న సవాళ్లను మలాలా తన జీవితకథలో వివరించింది. ఆక్స్‌ఫర్డ్‌లో థర్డ్‌ టర్మ్‌ చదువుతున్న సమయంలో, తన జీవితంలోకి యాసర్‌ రాకతో చీకటి మేఘాలన్నీ వీడిపోయాయనీ, కానీ తమది టివిల్లో చూపించే రొమాంటిక్‌ కామెడీ కథ కాదనీ, స్వేచ్ఛాయుతమైన ప్రేమకలాపం అంతకంటే కాదనీ వివరించింది మలాలా. ఒకానొక సందర్భంలో తామిద్దరూ కలిసి బయటకు వెళ్లినప్పుడు ఎదుర్కొన్న ఒక సంఘటనను వివరిస్తూ... ‘‘మేమిద్దరం చెట్టాపట్టాలేసుకుని నడుస్తున్నాం. అకస్మాత్తుగా ఒక మహిళ నన్ను గుర్తుపట్టి వెంటనే ఫోన్‌ బయటకు తీసి నాతో ఫొటో తీసుకునే ప్రయత్నం చేసింది. కానీ మాది రహస్య ప్రేమ. యాసర్‌తో స్నేహం చేస్తున్నానని మా తల్లితండ్రులకు తెలియదు. కాబట్టి నేను రోడ్డు పక్కనే ఉన్న పొద చాటుకు పరిగెత్తాను. యాసర్‌, నా భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమైపోయారు’’ అంటూ పుస్తకంలో రాసుకుంది మలాలా.

సెక్స్‌ బాంబ్‌ అన్నప్పుడు...

ప్రేమించిన వ్యక్తిని కలుసుకోబోయే ఘడియలు ప్రతి ఒక్కరికీ మధురమైనవే! అలా ఒక రోజు యాసర్‌ను కలుసుకోబోతూ, తల్లి ఆమోదం పొందిన సంప్రదాయ సల్వార్‌ కమీజ్‌ దుస్తులు ధరించింది. కానీ మలాలాకు ఆధునిక దుస్తులు ధరించాలనే కోరిక ఉంది. అది ఇంట్లో సాధ్యపడదు కాబట్టి అందుకొక ప్రణాళిక రచించుకుంది. ఆ ప్రణాళికలో భాగంగా యాసర్‌ను హోటల్‌లో కలిసిన తర్వాత, అతన్నుంచి ఐదు నిమిషాలు బ్రేక్‌ తీసుకుని, గులాబీ రంగు స్లీవ్‌లెస్‌ డ్రెస్‌, హైహీల్స్‌తో తిరిగొచ్చింది. ఆ సందర్భం గురించి ప్రస్తావిస్తూ... ‘‘టేబుల్‌ దగ్గరకు తిరిగొస్తున్న నన్ను చూసి యాసర్‌ చిరునవ్వు నవ్వాడు. ఆ చిరునవ్వును నేను అంతకుముందెప్పుడూ చూడలేదు. నా కోసం కుర్చీ లాగి, ‘నువ్వొక సెక్స్‌ బాంబ్‌వి’ అని నా చెవిలో గుసగుసగా చెప్పాడు. ఆ మాట వినగానే సిగ్గును దాచుకోలేక, డిన్నర్‌ న్యాప్కిన్‌లో ముఖం దాచేసుకున్నాను’’ అంటూ మధురమైన జ్ఞాపకాన్ని గుర్తు చేసుకుంది మలాలా.

తల్లితండ్రులు వ్యతిరేకించినా...

ప్రేమ సంగతి పెద్దల దృష్టికి తీసుకువెళ్లి, వాళ్ల అంగీకారం పొందడమన్నది ఏ అమ్మాయికైనా ఒక గండంగానే ఉంటుంది. మలాలా కూడా అదే పరిస్థితిని ఎదుర్కొంది. ఆ సందర్భం గురించి వివరిస్తూ... ‘‘నాన్న నా మాటెప్పుడూ కాదనరు. కాబట్టే ఈ విషయాన్ని ముందుగా నాన్నకే చెప్పాలనుకున్నాను. ‘నాకు అతనంటే ఇష్టం నాన్నా. నాకు అతనంటే ఎంతో ప్రేమ’ అని చెప్పి, ఈ విషయం అమ్మతో చెప్పకండి అని కూడా అభ్యర్థించాను. కానీ నాన్న ఏమాత్రం ఆలస్యం చేయకుండా అమ్మకు కాల్‌ చేసి, చెప్పేశారు. అవతలి వైపు అమ్మ గొంతు నాకు స్పష్టంగా వినిపిస్తోంది. ‘నేనిది ఒప్పుకోను. అసలతను పష్తో మాట్లాడగలుగుతాడా? మలాలా, పష్తూన్‌ వ్యక్తినే పెళ్లాడాలి’ అంటూ అమ్మ గట్టిగా అరుస్తోంది. పరిస్థితి ఇంత తీవ్రంగా మారిపోతుందని నేను ఊహించలేదు. వెంటనే మాలిక్‌కు ఫోన్‌ చేసి విషయం చెప్పాను. నా తల్లితండ్రులు అపవాదు గురించి కంగారుపడ్డారు. అతన్ని కలవడం మానేయమని నన్ను ఆదేశించారు. కానీ నేనది చేయలేను. కానీ తల్లితండ్రుల కారణంగా మా అనుబంధం ఆందోళనకరంగా మారిపోవడం నాకు నచ్చలేదు. దాంతో ఆక్స్‌ఫర్డ్‌ చదువు పూర్తయ్యేవరకూ, కొంత కాలం పాటు ప్రేమ వ్యవహారాన్ని పక్కన పెట్టేద్దామని మాలిక్‌ను అడిగాను. అందుకతను... ‘ప్రేమ భావాలు అలా ఆగేవి కావు. కానీ నేనందుకు ప్రయత్నిస్తాను’ అని సమాధానమిచ్చాడు. కానీ అది మా ఇద్దరికీ సాధ్యపడే పని కాదని తెలుసు’’ అంటూ ప్రేమలో ఎదుర్కొన్న సవాళ్ల గురించి వివరించింది మలాలా. ఇన్ని సవాళ్లు ఎదురైనా వాళ్లు అవరోధాలన్నిటినీ అధిగమించి, అంతిమంగా 2021, నవంబరులో ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హ్యామ్‌లో పెళ్లితో ఒక్కటయ్యారు.

ఈ వార్తలు కూడా చదవండి..

పారిశ్రామికవేత్తలని జగన్ అండ్ కో బెదిరిస్తున్నారు.. ఎంపీ రమేశ్ ఫైర్

హైదరాబాద్ కేంద్రంగా డ్రగ్స్ రాకెట్.. సంచలన విషయాలు వెలుగులోకి..

Updated Date - Oct 11 , 2025 | 06:00 AM