ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Makeup Tips: మెడకూ... చేతులకూ..!

ABN, Publish Date - Dec 13 , 2025 | 04:52 AM

మేక్‌పతో ముఖం వెలిగిపోతూ ఆకర్షణీయంగా మారిపోతుంది. మరి మెడ, చేతులు నిర్జీవంగా ఉంటే, ముఖానికి వేసుకున్న మేకప్‌ ఎబ్బెట్టుగా కనిపిస్తుంది కదా.....

మేక్‌పతో ముఖం వెలిగిపోతూ ఆకర్షణీయంగా మారిపోతుంది. మరి మెడ, చేతులు నిర్జీవంగా ఉంటే, ముఖానికి వేసుకున్న మేకప్‌ ఎబ్బెట్టుగా కనిపిస్తుంది కదా? అందుకే ముఖంతో పాటు మెడ, చేతుల మీద కూడా దృష్టి పెట్టాలి. అందుకోసం...

సిలికాన్‌ ప్రైమర్‌: మెడ, చేతుల మీద ఏర్పడే సన్నని లైన్లు, ముడతలు కనిపించకుండా చేయడం కోసం, మేక్‌పకు ముందు సిలికాన్‌ ప్రైమర్‌ అప్లై చేయాలి. దీంతో చర్మం నునుపుగా మారి గీతలు మటుమాయమవుతాయి. టింటెడ్‌ ప్రైమర్‌తో ఓపెన్‌ పోర్స్‌ను కూడా దాచేయవచ్చు. ఇందుకోసం ప్రైమర్‌ అప్లై చేసి, తడి స్పాంజ్‌తో బ్లెండ్‌ చేయాలి. మెడ, చేతుల మీద డార్కర్‌ ఏరియాలను సరి చేయడం కోసం కన్‌సీలర్‌ కంటే ముందు కలర్‌ కరెక్టర్‌ను కూడా ఉపయోగించవచ్చు.

మాయిశ్చరైజర్‌: మెడ మీద చర్మం పలుచగా ఉంటుంది కాబట్టి తేలికగా పొడిబారిపోతూ ఉంటుంది. కాబట్టి ముఖంతో పాటు తప్పనిసరిగా మెడకూ, చేతులకూ మాయిశ్చరైజర్‌ అప్లై చేస్తూ ఉండాలి. అప్పుడే గీతలు, మచ్చలు, ముడతలు ఏర్పడకుండా ఉంటాయి.

ఫౌండేషన్‌: లిక్విడ్‌ లేదా క్రీమ్‌ ఎలాంటి ఫౌండేషన్‌ను ఎంచుకున్నా, ముఖం, మెడ మీద సమానంగా పరుచుకునేలా తడిపిన స్పాంజీతో అప్లై చేసుకోవాలి. అలాగే, అవసరానికి మించి ఫౌండేషన్‌ ఉపయోగిస్తే, మెడ మీది ముడతల్లో ఇరుక్కుపోయి, ముడతలు స్పష్టంగా కనిపించే ప్రమాదం ఉంటుంది. కాబట్టి తగుమాత్రంగానే ఉపయోగించాలి.

బ్లష్‌: చెక్కిళ్ల మీద అప్లై చేసుకునే బ్లష్‌ను కొద్ది పరిమాణంలో మెడ, చేతుల మీద అప్లై చేసుకోవడం వల్ల, ముఖం, మెడా, చేతులు ఒకే రంగులో కనిపించే అవకాశం ఉంటుంది.

విటమిన్‌ సి సీరమ్‌: విటమిన్‌ సితో కూడిన సీరమ్‌ లేదా మాయిశ్చరైజర్‌ ఉపయోగించడం వల్ల యువి ఎక్స్‌పోజర్‌తో కలిగే ఫ్రీ ర్యాడికల్‌ డ్యామేజీ నుంచి మెడకూ, చేతులకూ రక్షణ దక్కుతుంది. కాబట్టి ఈ జాగ్రత్తలు పాటించాలి.

Updated Date - Dec 13 , 2025 | 04:52 AM