Makeup With Glasses: జోడుతో జోరుగా...
ABN, Publish Date - Aug 30 , 2025 | 04:17 AM
ఫ్యాషన్ కోసం పెట్టినా, మందగించిన కంటిచూపు కోసం వాడుకున్నా కళ్లజోడుకూ మేక్‌పకూ పొంతన కుదరదు. కానీ కొన్ని ..
ఫ్యాషన్ కోసం పెట్టినా, మందగించిన కంటిచూపు కోసం వాడుకున్నా కళ్లజోడుకూ మేక్‌పకూ పొంతన కుదరదు. కానీ కొన్ని తెలివైన చిట్కాలు పాటిస్తే, కళ్లజోడుతో కూడా మేక్‌పను మ్యాచ్ చేయవచ్చు. అదెలాగంటే....
ఐబ్రో: జోడు ఫ్రేమ్ కనుబొమలను కప్పేస్తున్నాయి కదా అని కనుబొమలను నిర్లక్ష్యం చేయకూడదు. వాటిని చక్కని ఆకృతిలో కత్తిరించుకుని, బ్రో పెన్సిల్‌తో దిద్దుకోవాలి. ఇలా చేస్తేనే జోడులో నుంచి కనుబొమలు స్పష్టంగా కనిపిస్తాయి
బ్రష్: జోడుతో మేకప్ వేసుకోవడంలో ఇబ్బంది ఉండనే ఉంటుంది కాబట్టి పొడవాటి హ్యాండిల్ కలిగిన మేకప్ బ్రష్‌లకు బదులుగా కురచ బ్రష్‌లు ఎంచుకోవాలి.
ఐలైనర్: కనురెప్పల పైనా, దిగువనా ఐలైనర్ తప్పనిసరిగా అప్లై చేసుకోవాలి. ఇందుకోసం పై కనురెప్పకు జెల్ ఐలైనర్ అప్లై చేసి, దిగువన పౌడర్ ఐలైనర్ ఉపయోగించాలి
ప్రైమర్: ముక్కుకు ఇరువైపులా ప్రైమర్ అప్లై చేసి రూపమివ్వాలి. కళ్లద్దాలు ముక్కు మీదకు జారిపోతూ ఉంటాయి. కాబట్టి ఇలా తరచూ జరగకుండా ఉండడం కోసం, ముక్కు మీద కళ్లజోడు తగిలే ప్రదేశంలో ఐషాడో ప్రైమర్‌ను అద్దుకోవాలి
మస్కారా: కాలం చెల్లిన మస్కారా వేసుకుంటే, అది పొడిపొడిగా జోడు మీద రాలిపడుతూ ఉంటుంది. కాబట్టి తాజా మస్కారా ఎంచుకోవాలి. ఒకసారి మూత తెరిచిన తర్వాత మస్కారాను మూడు నెలలకు మించి వాడుకోకూడదు. అలాగే క్రీమీగా ఉండే వాటర్‌ప్రూఫ్ మస్కారానే ఉపయోగించాలి. ఈ మస్కారాతో కనురెప్పలు జోడుకు అంటుకుపోకుండా ఉంటాయి
భూతద్దం: షార్ట్ సైట్ ఉన్నవాళ్లు జోడు ధరించకుండా మేకప్ వేసుకోలేరు. కాబట్టి జోడు లేకుండా మేకప్ వేసుకోవాలనుకుంటే, భూతద్దం కొనుక్కోవాలి. ఈ అద్దం దగ్గరుంటే, జోడుతో పని లేకుండా మేకప్ వేసుకోవచ్చు
స్ర్పే: కళ్లజోడు ధరించినప్పుడు కళ్ల చుట్టూ ఉండే ప్రదేశంలో తేలికగా చమట పడుతూ ఉంటుంది. కాబట్టి మేకప్ చెక్కుచెదరకుండా ఉండడం కోసం సెట్టింగ్ స్ర్పే ఉపయోగించాలి.
ఈ వార్తలు కూడా చదవండి:
Musi River Effect On Hyderabad: ఉగ్రరూపం దాల్చిన మూసీ.. నగరంలో పలుచోట్ల రాకపోకలు బంద్..
Rain Effect On Roads: భారీ వర్షాలతో 1039 కి.మీ మేర రోడ్లు ధ్వంసం..
Updated Date - Aug 30 , 2025 | 04:17 AM