Makeup Tips: చిట్కాలతో చమక్కు
ABN, Publish Date - Sep 13 , 2025 | 01:59 AM
మేకప్‌తో అన్ని లోపాలనూ సరిదిద్దడం సాధ్యపడకపోవచ్చు. కానీ వేసుకునే మేకప్‌లో కొన్ని మెలకువలు పాటించగలిగితే, రెట్టింపు ఫలితాన్ని పొందవచ్చు. అదెలాగంటే...
మేకప్
మేకప్‌తో అన్ని లోపాలనూ సరిదిద్దడం సాధ్యపడకపోవచ్చు. కానీ వేసుకునే మేకప్‌లో కొన్ని మెలకువలు పాటించగలిగితే, రెట్టింపు ఫలితాన్ని పొందవచ్చు. అదెలాగంటే...
కనురెప్పలు దట్టంగా:
పలుచని కనురెప్పలు దట్టంగా కనిపించడం కోసం మస్కారా వేసుకుంటాం. అయితే మస్కారాతో వేసుకున్నంత మాత్రాన దట్టంగా కనిపించే పరిస్థితి ఉండదు. ఇలాంటప్పుడు కొద్దిపాటి వెంట్రుకలతో మరింత దట్టంగా కనురెప్పలు కనిపించాలని అనుకుంటే ఒక చిట్కా పాటించాలి. మస్కారా కంటే ముందు కనురెప్పలకు ఐషాడో బ్రష్‌తో ఫేస్ పౌడర్‌ను పట్టించాలి. దీంతో కనురెప్పలకు ల్యాష్ ఫైబర్ మస్కారా ఎఫెక్ట్ కలుగుతుంది. ఈ తర్వాత మస్కారా అప్లై చేస్తే, కనురెప్పలు దట్టంగా కనిపిస్తాయి.
లిప్‌స్టిక్ చెదరకుండా:
కొందరికి నాలుకతో పెదవులు తడుపుకొనే అలవాటు ఉంటుంది. ఇంకొందరికి పెదవులు కొరుక్కొనే అలవాటు ఉంటుంది. దాంతో లిప్‌స్టిక్ చెదిరిపోతుంది కాబట్టి ఎక్కువ సమయం పాటు లిప్‌స్టిక్ చెదిరిపోకుండా ఉండడం కోసం ఒక చిట్కాను ఉపయోగించాలి. అందుకోసం మొదట లిప్ లైనర్‌తో పెదవుల చుట్టూ ఔట్‌లైన్ గీసుకోవాలి. తర్వాత లిక్విడ్ లిప్‌స్టిక్‌తో పెదవులను నింపేయాలి. దీనిపైన అదే షేడ్ క్రీమీ లిప్‌స్టిక్ అప్లై చేయాలి. తర్వాత, బ్రష్‌తో లూజ్ పౌడర్ తీసుకుని, పెదవులపైన టిష్యూ పేపర్‌ను ఉంచి, ఆ పౌడర్‌ను అద్దాలి. దీంతో లిప్‌స్టిక్ మ్యాటిఫై అయిపోయి, పెదవులకు హత్తుకుపోతుంది. ఈ చిట్కాతో లిప్‌స్టిక్ రోజంతా చెదిరిపోకుండా ఉంటుంది.
ముఖం మెరిసేలా:
ఇందుకోసం ప్రత్యేకించి స్ట్రోబింగ్ క్రీమ్ దొరుకుతుంది. ఇది లేని వాళ్లు ఒక చిన్న కిటుకుతో అదే ఫలితాన్ని రాబట్టవచ్చు. అందుకోసం ఒక చిన్న గిన్నెలో లిప్ బామ్ తీసుకుని, రోజ్‌గోల్డ్ షిమ్మరీ ఐషాడో జోడించి బాగా కలపాలి. దీన్ని బేస్ మేకప్ అడుగున అప్లై చేసుకుని, ఆ తర్వాత మేకప్ మొదలుపెట్టాలి. ఇలా చేస్తే, ఈ మిశ్రమం స్ట్రోబింగ్ క్రీమ్‌లా చర్మానికి మెరుపునిస్తుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
భాగ్యనగర వాసులకు బిగ్ అలర్ట్.. మూసీ పరివాహక ప్రాంతాల్లో రెడ్ అలర్ట్
లాకర్ తాళాల కోసం చిత్ర హింసలు పెట్టి..
Read Latest Telangana News and National News
Updated Date - Sep 13 , 2025 | 01:59 AM