ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Transforming Passion: కళామాధురి

ABN, Publish Date - Nov 03 , 2025 | 06:24 AM

బాల్యం నుంచి హస్తకళలపై ఉన్న ఆసక్తిని ఎన్ని అవరోధాలు ఎదురైనా......

బాల్యం నుంచి హస్తకళలపై ఉన్న ఆసక్తిని ఎన్ని అవరోధాలు ఎదురైనా

మాధురి నేమా విడిచిపెట్టలేదు. బ్యాంకు ఉద్యోగాన్ని కూడా వదిలేసి తన కళాభిరుచిని కొనసాగిస్తున్నారు. ఎన్నో బహుమతులు, అవార్డులు గెలుచుకున్న ఆమె... మహిళలకు, విద్యార్థులకు శిక్షణ కోసం సొంత సంస్థను స్థాపించారు. ఆమె తన కళా ప్రయాణం గురించి ‘నవ్య’తో పంచుకున్న విశేషాలివి...

చిన్నప్పటి నుండి నాకు హస్తకళలంటే చాలా ఇష్టం. మా నాన్నగారు వ్యవసాయ శాఖలో సైంటిస్ట్‌. ఆయన రచయితగా, వ్యాఖ్యాతగా కూడా పేరుపొందారు. మా తల్లిదండ్రులు కళల పట్ల మక్కువ కలిగేలా నన్ను, నా తోబుట్టువులను ఎంతగానో ప్రోత్సహించేవారు. పేపర్లతో బొమ్మలు చేయడం, చిత్రలేఖనం, రంగోలి, పెయింటింగ్స్‌లలో ఎక్కడ పోటీలు జరిగినా పంపించేవారు. అలానాకు కళలపై ఆసక్తి పెరిగింది. మాది మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని సెహోర్‌. వ్యవసాయ విశ్వవిద్యాలయంలో పట్టా పొందాను. పెళ్లయిన తరువాత... 2013లో ఉద్యోగ రీత్యా హైదరాబాద్‌కు వచ్చాను. నా భర్త సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి. నేను బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో అధికారిణిగా పని చేశాను. ఆ సమయంలో పిల్లల పెంపకం, ఉద్యోగ బాధ్యతల కారణంగా నా కళాభిరుచిని కొనసాగించడానికి సమయం దొరికేది కాదు. ఈ నేపథ్యంలో... నా భర్త అనుమతితో ఉద్యోగాన్ని వదిలేశాను. నా కళకు మరింత పదును పెట్టాను.

పర్యావరణ హితంగా...

కార్డుబోర్డుతో రకరకాల బొమ్మల తయారీ, వాడిన పేపర్‌తో చూడచక్కని ఆకృతుల రూపకల్పన, డాట్‌ పెయింటింగ్‌, లిప్పన్‌ ఆర్ట్‌, రంగోలీ డిజైనింగ్‌, వాల్‌ పెయింటింగ్స్‌, స్కెచ్‌ ఆర్ట్‌, మెహందీ డిజైన్లు, ఎంబ్రాయిడరీ. స్ట్రింగ్‌ ఆర్ట్‌, రెడీమేడ్‌ రంగోలీ, ఉడెన్‌ మ్యాట్‌ రంగోలీ, క్లే ఆర్ట్‌... ఇలా అనేక అంశాల్లో నాకు నైపుణ్యం ఉంది. ఉద్యోగాన్ని విడిచిపెట్టిన తరువాత.. ఇంట్లోనే కాగితం, కార్డు బోర్డులో బొమ్మలు తయారుచేసి, వాటితో ప్రదర్శనలు నిర్వహించాను. వాటిని కొనుగోలు చేయడానికి చాలామంది పోటీ పడేవారు. మరోవైపు జిల్లా, రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని అనేక బహుమతులను గెలుచుకున్నాను, అవార్డులు కూడా అందుకున్నాను. చాలామంది తమ కోసం గిఫ్ట్‌లను, రకరకాల బొమ్మలను తయారు చేసి ఇవ్వాలని, మెహందీ పెట్టాలని కోరుతూ నా దగ్గరకు వస్తూ ఉంటారు. నేను తయారు చేసే బొమ్మల్లో ప్లాస్టిక్‌ ఉపయోగించను. తద్వారా పర్యావరణానికి హాని కలుగకుండా జాగ్రత్తలు తీసుకుంటాను. నాకు తెలిసిన కళను నాలోనే దాచిపెట్టుకోకూడదని నా ఉద్దేశం అందుకే... వేసవి సెలవుల్లో, ఇతర సెలవు దినాల్లో విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నాను. వారితో పాటు మహిళలకు కూడా శిక్షణ ఇవ్వడానికి ఇటీవలే ‘మాధురీస్‌ ఆర్ట్‌ స్పేస్‌’ పేరిట ఒక సంస్థను ఏర్పాటు చేశాను. తద్వారా శిక్షకురాలిగా కూడా గుర్తింపు పొందుతున్నాను. కళాకారులను తయారు చేసి, వారికి గుర్తింపు లభించేలా చేయడం, తద్వారా కళలను పరిరక్షించడం నా లక్ష్యం.’’

ఫ వెనగంటి లక్ష్మణ్‌ యాదవ్‌

Updated Date - Nov 03 , 2025 | 06:24 AM