ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Long Lasting Lipstick Tips: అందమైన పెదవుల కోసం

ABN, Publish Date - Oct 11 , 2025 | 05:23 AM

పెదవులు మీద అద్దుకున్న లిప్‌స్టిక్‌ తరచూ చెరిగిపోతూ ఉంటే అది పెద్ద చికాకే! తరచూ టచప్స్‌ చేసుకుంటూ, లిప్‌స్టిక్‌ మీద ఓ కన్నేసి ఉంచడం కష్టం కాబట్టి ఇదుగో ఈ లిప్‌స్టిక్స్‌ నియమాలను పాటించండి...

మేకప్‌

పెదవులు మీద అద్దుకున్న లిప్‌స్టిక్‌ తరచూ చెరిగిపోతూ ఉంటే అది పెద్ద చికాకే! తరచూ టచప్స్‌ చేసుకుంటూ, లిప్‌స్టిక్‌ మీద ఓ కన్నేసి ఉంచడం కష్టం కాబట్టి ఇదుగో ఈ లిప్‌స్టిక్స్‌ నియమాలను పాటించండి

క్రీమ్స్‌, లిక్విడ్స్‌... ఇలా లిప్‌స్టిక్స్‌ రెండు రూపాల్లో దొరుకుతాయి. ప్రస్తుతం ద్రవరూప లిప్‌స్టిక్స్‌ ట్రెండ్‌ నడుస్తోంది. ఇది ట్రాన్స్‌ఫర్‌ ప్రూఫ్‌ కూడా! ఒకసారి పెదవులకు అద్దుకుంటే చాలు. ఇక రోజంతా దాని గురించి మర్చిపోవచ్చు. లాంగ్‌ వేర్‌ లిప్‌స్టిక్‌లో శాటిన్‌, మ్యాట్‌ రకాలుంటాయి. పెదవుల అంచున ఏదైనా కన్‌సీలింగ్‌ లేదా పౌడర్‌ ఉంటే వాటిని బ్లాటింగ్‌ పేపర్‌తో తొలగించి ఈ లిప్‌స్టిక్‌ వేసుకోవాలి. దీంతో లిప్‌స్టిక్‌ ఎక్కువ సేపు నిలిచి ఉంటుంది. అలాగే లాంగ్‌లాస్టింగ్‌ లిప్‌ పెన్సిల్‌తో అదనపు భద్రత దక్కుతుంది. దీనికి తోడు పెదవుల అంచున ట్రాన్స్‌స్క్యులెంట్‌ పౌడర్‌ అద్దుకుంటే, లిప్‌స్టిక్‌ పెదవులకే కట్టుబడి, అంచులు దాటకుండా ఉంటుంది. లిప్‌స్టిక్‌ చెదరకుండా ఉండడం కోసం పాటించవలసిన ఇంకొన్ని నియమాలు ఏవంటే...

  • లిప్‌స్టిక్‌ వేసుకునే ముందు, పెదవులను స్క్రబ్‌ చేసుకోవాలి. గులాబీ రేకులు, పాలు కలిపి, ముద్ద చేసి పెదవులకు పూసుకుని, ఆరిన తర్వాత వేలితో మృదువుగా రుద్దుతూ మృతకణాలను వదిలించుకోవాలి

  • పెదవులకు లిప్‌ బామ్‌ లాంటివి పూసుకుంటే, వాటిని పూర్తిగా వదిలించుకోవాలి

  • నాణ్యమైన లిప్‌ లైనర్‌ పెన్సిల్‌తో పెదవులను అందంగా తీర్చిదిద్దుకోవాలి

  • లిప్‌లైనర్‌ లిప్‌స్టిక్‌ కంటే రెండు రెట్లు ముదురు రంగులో ఉండేలా చూసుకోవాలి

  • పెదవుల అంచుల నుంచి మొదలుపెట్టి మధ్య వైపుకు లిప్‌స్టిక్‌ బ్రష్‌ను కదిలించాలి

  • లిప్‌ లైనర్‌, లిప్‌స్టిక్‌ కలిసిపోయేలా ఉండాలే తప్ప, వేర్వేరుగా కనిపించకూడదు

  • లిప్‌స్టిక్‌ వేసుకున్న తర్వాత, బ్లాటింగ్‌ పేపర్‌తో అదనపు లిప్‌స్టిక్‌ తొలగించుకోవాలి

ఈ వార్తలు కూడా చదవండి..

పారిశ్రామికవేత్తలని జగన్ అండ్ కో బెదిరిస్తున్నారు.. ఎంపీ రమేశ్ ఫైర్

హైదరాబాద్ కేంద్రంగా డ్రగ్స్ రాకెట్.. సంచలన విషయాలు వెలుగులోకి..

Updated Date - Oct 11 , 2025 | 05:23 AM