ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Kalyani Priyadarshan Superwoman: మన తెరపై సూపర్‌ఉమన్‌

ABN, Publish Date - Sep 04 , 2025 | 03:13 AM

ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్‌ తనయగా వెండితెరకు పరిచయమైనా... తనదైన నటనతో అలరిస్తున్న నటి కల్యాణి ప్రియదర్శన్‌. తెలుగులో ‘హలో’ అంటూ మొదలైన ఆమె కెరీర్‌... హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా జెట్‌ స్పీడ్‌తో...

సెలబ్‌ టాక్‌

ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్‌ తనయగా వెండితెరకు పరిచయమైనా... తనదైన నటనతో అలరిస్తున్న నటి కల్యాణి ప్రియదర్శన్‌. తెలుగులో ‘హలో’ అంటూ మొదలైన ఆమె కెరీర్‌... హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా జెట్‌ స్పీడ్‌తో దూసుకుపోతోంది. ఇటీవల విడుదలైన ‘లోక చాప్టర్‌ 1: చంద్ర’... ఆమెను మరో స్థాయిలో నిలబెట్టింది. అందులో ‘చంద్ర’గా నటించిన కల్యాణి... భారతీయ చిత్ర పరిశ్రమలో సూపర్‌ఉమన్‌ పాత్ర పోషించిన మొట్టమొదటి హీరోయిన్‌గా చరిత్ర సృష్టించారు. ఈ సందర్భంగా తన అనుభవాలు పంచుకున్నారు. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే...

నేను ‘లోక చాప్టర్‌ 1: చంద్ర’ ప్రాజెక్ట్‌లోకి రావడానికి రెండు మూడేళ్ల ముందు నుంచే సినిమాటోగ్రాఫర్‌ నిమిష్‌ రవితో కలిసి దర్శకుడు డోమినిక్‌ అరుణ్‌ దీనిపై పని చేశారు. తొలుత చిన్న బడ్జెట్‌ చిత్రంగా అనుకున్నారు. కానీ నిర్మాతగా దుల్కర్‌ సల్మాన్‌ ప్రాజెక్ట్‌ను మరో కోణంలో చూశారు. దీన్ని కేవలం స్త్రీ ప్రధానమైన చిత్రంగానే పరిమితం చేయవద్దని, కథ పరిధిని మరింత విస్తరించవచ్చని సూచించారు. వీటన్నిటి నేపథ్యంలో సినిమాలో నా పాత్ర... ‘చంద్ర’ ప్రయాణం మొదట అనుకున్నదాని కంటే చాలా పెద్దదిగా మారింది. ఆ క్షణమే గట్టిగా నిర్ణయించుకున్నా... ‘చంద్ర’గా మెప్పించడం కోసం శక్తి వంచన లేకుండా కృషి చేయాలని.

కష్టమే... కానీ...

నేను చేసిన అత్యంత కష్టతరమైన ప్రాజెక్ట్‌ల్లో ఇది ఒకటి. ఎక్కువగా రాత్రి వేళల్లో షూటింగ్‌ చేశాం. అదికూడా నెలల తరబడి చిత్రీకరణ సాగింది. కానీ ప్రతి క్షణం ఆస్వాదించాను. యాక్షన్‌ సన్నివేశాలను మూడు వారాలపాటు ఏకధాటిగా చేయాల్సి వచ్చింది. స్టంట్స్‌, ఫైట్స్‌. షూటింగ్‌ అవ్వగానే ట్రైనింగ్‌. తీవ్ర స్థాయిలో సాగింది. అయితే నేను ఈ ప్రాజెక్ట్‌లోకి వచ్చినప్పుడే స్టంట్స్‌ ట్రైనింగ్‌ మొదలుపెట్టాను. గతంలో ఎప్పుడూ ఇలాంటివి చేయలేదు. నాకు పూర్తిగా కొత్త. చిన్నప్పుడు అథ్లెటిక్స్‌ లాంటి వాటిలో కూడా ప్రవేశం లేదు. ఈ శిక్షణ నన్ను పూర్తిగా మార్చేసింది. హద్దులు చెరిపేసి, నాలోని శక్తిని మేల్కొలిపింది. వెనక్కి తిరిగి చూసుకొంటే... ఆ రోజులు ఎంత కష్టంగా అనిపించాయో... అంతకంటే ఎక్కువగా, జీవితకాలం గుర్తుండిపోయే మధుర జ్ఞాపకాలను అందించాయి.

కొత్త ద్వారాలు తెరుచుకున్నాయి...

సాధారణంగా మహిళ ప్రధాన పాత్రలుగా సాగే చిత్రాలపై సందేహాలు, సంకోచాలు ఉంటాయి. కానీ ఈ సినిమాతో అలాంటి కథలకు కొత్త ద్వారాలు తెరుచుకున్నాయని భావిస్తున్నా. నాకు తెలిసి మనందరం సరైన కథ, కథకుల కోసం ఎదురు చూస్తున్నాం. దుల్కర్‌ సల్మాన్‌ లాంటివారు ఇలాంటి కథలకు అండగా నిలిస్తే... అవి పూర్తి స్థాయిలో అలరించగలవని అనుకొంటున్నా. మహిళలే కాకుండా... మగవారు కూడా చిత్ర విజయాన్ని గొప్పగా చెబుతున్నారు. మంచి కథ ఉంటే ఆదరించడానికి ప్రేక్షకులు ఎప్పుడూ సిద్ధమే. మనమే వారిని తక్కువ అంచనా వేస్తున్నాం.

నాన్న నేర్పిన పాఠం...

నటిగా నా ఈ ప్రయాణం అందంగా, నిలకడగా సాగుతోందంటే అందుకు ప్రధాన కారణం నాన్న నేర్పిన పాఠాలే. కీర్తి కంటే కళకు విలువ ఇవ్వాలని చిన్నప్పటి నుంచీ చెప్పేవారు. అలాగే నాకు ప్రేరణనిచ్చే, ప్రభావితం చేసే కథల కోసం వేచివుండే అవకాశం లభించడం నిజంగా నా అదృష్టం. ఇలాంటి వెసులుబాటు అందరికీ ఉండదు. ఈ అవకాశాన్ని ఒక బాధ్యతగా భావించి, నాకు సవాలు విసిరే పాత్రలను ఎంచుకోవడానికి ప్రాధాన్యం ఇస్తాను. కష్టపడి పనిచేసే తత్వం, ఓర్పు, భగవంతుడి ఆశీస్సుల ఫలితం విజయవంతమైన నా ఈ ప్రయాణం. ప్రతి చిత్రం నుంచీ ఏదోఒకటి నేర్చుకొంటాను. కొందరు ముందుకు నెట్టారు. మరికొందరు ఆగి ఆలోచించేలా చేశారు. ఇక నా రాబోయే ప్రాజెక్టుల్లో... రవి మోహన్‌ సర్‌తో ‘జెనీ’ విడుదలకు సిద్ధంగా ఉంది. కార్తి సర్‌తో ‘మార్షల్‌’ చేస్తున్నా. రెండూ భిన్నమైన కథలు, విభిన్న పాత్రలు.

ఇవి కూడా చదవండి

బీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్సీ పదవికీ కవిత రాజీనామా..

వేరే పార్టీలో చేరికపై క్లారిటీ ఇచ్చిన కల్వకుంట్ల కవిత

Updated Date - Sep 04 , 2025 | 03:13 AM