Share News

kavitha Resign: బీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్సీ పదవికీ కవిత రాజీనామా..

ABN , Publish Date - Sep 03 , 2025 | 01:13 PM

బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు కల్వకుంట్ల కవిత ప్రకటించారు.

kavitha Resign: బీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్సీ పదవికీ కవిత రాజీనామా..
K kavitha Resign

హైదరాబాద్, సెప్టెంబర్ 03: బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. పార్టీ అధినేత కేసీఆర్ తనపై సస్పెన్షన్ వేటు వేయడంతో.. తన నిజాయితీని నిరూపించుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె వివరించారు. బుధవారం హైదరాబాద్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో కవిత మాట్లాడారు. తన ఆత్మాభిమానం కాపాడుకునేందుకు తాను ఈ పదవికి, పార్టీకి రాజీనామా చేసినట్లు తెలిపారు. తాను చేసిన వ్యాఖ్యల వల్ల ఏదో జరిగిపోయినట్లు దుష్టచతుష్టయం ఏదో ప్రచారం చేస్తుందంటూ కవిత మండిపడ్డారు. తన విషయంలో రెండు గ్యాంగులు జరగనిది జరిగినట్లుగా ప్రచారం చేశారని మండిపడ్డారు. కేసీఆర్ వద్దకు వెళ్లితే.. తనను గన్‌మెన్లు అడ్డుకున్నట్లు రాయించారన్నారు.


ఆరడుగు బుల్లెట్ ఈ రోజు తనను గాయపరిచిందన్నారు. సంతోష్ రావు.. చేసిన పనులతో కేటీఆర్‌కు చెడ్డ పేరు వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. హరీష్, సంతోష్ మూఠాలు.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతో కుమ్మక్కయ్యాయన్నారు. హరీష్ రావును పక్కన పెట్టుకుని.. నిజాలు మాట్లాడిన తనను బయటకు పంపాంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ వార్తలు కూడా చదవండి..

అతడి ద్వారానే సెటిల్‌మెంట్లు చేసేన సంతోష్

అమ్మకు దూరం.. కన్నీటి పర్యంతం

For More TG News And Telugu News

Updated Date - Sep 03 , 2025 | 02:35 PM