K Kavitha: అమ్మకు దూరం.. కన్నీటి పర్యంతం
ABN , Publish Date - Sep 03 , 2025 | 01:54 PM
బీఆర్ఎస్ ఉంటే ఎంత.. లేకుంటే ఎంత అని తాను అనలేదని కవిత పేర్కొన్నారు. కేసీఆర్‌కు నష్టం చేసే పార్టీ ఉంటే ఎంత.. లేకుంటే ఎంత అని అన్నారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 03: రెండు దశాబ్దాల పాటు పార్టీ కోసం కష్టపడి పని చేస్తే.. చివరకు తనకు సస్పెన్షన్ దక్కిందంటూ ఎమ్మెల్సీ కవిత ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం హైదరాబాద్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఆమె విలేకర్లతో మాట్లాడుతూ.. వివరణ కూడా కోరకుండా తనపై సస్పెన్షన్ వేటు వేశారన్నారు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్న సమయంలో తాను పార్టీ కోసం, తెలంగాణ కోసం మాత్రమే కష్టపడ్డానని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేసుకున్నారు. అమ్మకు కూడా దూరంగా ఉండాల్సి రావడం బాధగా ఉందన్నారు. అయితే తాను ఏ పార్టీలో చేరాలని అనుకోవడం లేదని స్పష్టం చేశారు. తనకు ఏ పార్టీతో పని లేదని కుండ బద్దలు కొట్టారు. జాగృతి కార్యకర్తలు, అభిమానులతో మాట్లాడిన తర్వాతే భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తానన్నారు. బీఆర్ఎస్ పార్టీని హస్తగతం చేసుకోవాలనే కుట్ర జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
నేను అలా అనలేదు..
బీఆర్ఎస్ ఉంటే ఎంత.. లేకుంటే ఎంత అని తాను అనలేదని ఎమ్మెల్సీ కవిత క్లారిటీ ఇచ్చారు. కేసీఆర్‌కు నష్టం చేసే పార్టీ ఉంటే ఎంత.. లేకుంటే ఎంత అని అన్నట్లు వివరణ ఇచ్చారు. సోషల్ మీడియాలో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన శరీరం బీఆర్ఎస్ అయితే.. తన ఆత్మ జాగృతి అని అభివర్ణించారు. తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా తాను పని చేశానన్నారు.
నేను ఏం చేయలేదా?
బీఆర్ఎస్‌లో తన భాగస్వామ్యం ఏం లేదా? అంటూ సందేహం వ్యక్తం చేశారు. హరీష్‌రావు, సంతోష్‌రావు భాగస్వామ్యం మాత్రమే ఉందా? అని అడిగారు. తన విషయంలో రెండు గ్యాంగులు జరగనిది జరిగినట్టుగా ప్రచారం చేశాయని మండిపడ్డారు. కేసీఆర్ దగ్గరకు వెళ్తే గన్‌మెన్లు తనను అడ్డుకున్నట్టు రాయించారన్నారు. లేఖ లీక్ చేసిన వ్యక్తులపై ఎందుకు చర్యలు తీసుకోలేదంటూ బీఆర్ఎస్ అగ్రనేతలను ఆమె ప్రశ్నించారు. పార్టీ తనపై సస్పెన్షన్ వేటు వేయడంతో.. తన పుట్టింటికి వెళ్లే పరిస్థితి లేదని.. తానకు అమ్మ అంటే చాలా ఇష్టమన్నారు. ఆమెను కలవలేక పోతున్నట్లు కవిత ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అతడి ద్వారానే సెటిల్‌మెంట్లు చేసేన సంతోష్
బీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్సీ పదవికీ కవిత రాజీనామా..
For More TG News And Telugu News