Jewelry Tips: టీనేజర్ల నగలు
ABN, Publish Date - Dec 24 , 2025 | 06:21 AM
వేడుకల్లో 16 నుంచి 20 ఏళ్ల లోపు అమ్మాయిలదే సరదా అంతా! ఎలాంటి వేడుకలో అయినా, అలంకరణలో ముందుండాలి అన్న తీరులో అలంకరించుకుంటారు ఈ ఈడు అమ్మాయిలు. అలాంటి ఆడపిల్లల కోసమే ఈ జ్యువెలరీ టిప్స్!....
వేడుకల్లో 16 నుంచి 20 ఏళ్ల లోపు అమ్మాయిలదే సరదా అంతా! ఎలాంటి వేడుకలో అయినా, అలంకరణలో ముందుండాలి అన్న తీరులో అలంకరించుకుంటారు ఈ ఈడు అమ్మాయిలు. అలాంటి ఆడపిల్లల కోసమే ఈ జ్యువెలరీ టిప్స్!
చోకర్ అందాలు!
నలుగురి దృష్టి ఆకట్టుకునే వెరైటీ జ్యువెలరీ ధరించాలని ఈ ఈడు పిల్లలు ఉబలాటపడతారు. అందుకోసం మరెక్కడా దొరనంత అపురూపంగా కనిపించే ప్రత్యేకమైన డిజైన్లు, కొత్త రకం నగలు ఎంచుకోవాలి. ఈ కోవకు చెందిన నగ...‘చోకర్’! మెడకు దగ్గరగా ఉండే ఈ చోకర్ పోల్కి రకం అయి ఉండాలి. మెడకు హత్తుకునేలా ఉండాలి. వదులుగా, జారుతున్నట్టుగా ఉండకూడదు.
తెలుపుకే తొలి ప్రాధాన్యం!
ఎన్ని జాతి రాళ్లు ఉన్నా, తెలుపుకు ఉండే ఆకర్షణ అంతా ఇంతా కాదు. ఎక్కువ శాతం వేడుకలు రాత్రి వేళ జరుగుతూ ఉంటాయి కాబట్టి చీకట్లో ధగధగా మెరిసే వజ్రాలకే తొలి ప్రాధాన్యం! డైమండ్ లేదా పోల్కి, వైట్ కుందన్ నగలను ఎంచుకోవాలి.
పొడవాటి ‘ఇయర్ రింగ్స్’
ఈ ఈడు పిల్లలు అనుసరించవలసిన మరో జ్యువెలరీ ఫ్యాషన్ పెద్ద ఇయర్ రింగ్స్! ఇవి భుజాలను తాకేంత పొడవుగా, భారీగా ఉండాలి. పోల్కీ, సెజాట్స్ లేదా మోజనైట్...ఇలా ఏ కోవకి చెందినవైనా టీనేజ్ ఆడపిల్లలకు సూటవుతాయి.
Updated Date - Dec 24 , 2025 | 06:21 AM