Indian Air Force recruitment 2025: వాయుసేనలో అగ్నివీర్
ABN, Publish Date - Aug 11 , 2025 | 02:00 AM
భారత వాయుసేనలో ‘అగ్నివీర్ వాయు’ నియామకాల కోసం అవివాహితులైన పురుషుల నుంచి దరఖాస్తులను కోరుతున్నారు. అగ్నివీర్‌గా ఉన్న నాలుగు సంవత్సరాలు వివాహం చేసుకోరాదు. అభ్యర్థి శరీరం మీద ఎలాంటి టాటూలు ఉండకూడదు. ఇది...
జాబ్ కార్నర్
భారత వాయుసేనలో ‘అగ్నివీర్ వాయు’ నియామకాల కోసం అవివాహితులైన పురుషుల నుంచి దరఖాస్తులను కోరుతున్నారు. అగ్నివీర్‌గా ఉన్న నాలుగు సంవత్సరాలు వివాహం చేసుకోరాదు. అభ్యర్థి శరీరం మీద ఎలాంటి టాటూలు ఉండకూడదు. ఇది క్రీడా కోటాకు సంబంధించిన నోటిఫికేషన్. రిక్రూట్‌మెంట్ ట్రయల్స్ సెప్టెంబర్ 8 నుంచి 10 వరకు జరుగుతాయి.
అర్హత: మేథ్స్, ఫిజిక్స్‌లతో ఇంటర్ చదివి, కనీసం 50 శాతం మార్కులతో పాసై ఉండాలి. లేదా ఇంజనీరింగ్‌లో డిప్లొమా ఉండాలి. నాన్ సైన్స్ విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు(పూర్తి వివరాల కోసం వెబ్‌సైట్ చూడవచ్చు). వీటితోపాటు నిర్ణీత శారీరక ప్రమాణలు, స్పోర్ట్స్ అచీవ్‌మెంట్స్ ఉండాలి.
వయస్సు: 2025 జనవరి 1 నుంచి 2008 జూలై1 తేదీ మధ్యలో జన్మించి ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక: డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, స్పోర్ట్స్ నైపుణ్య పరీక్షలు(క్రీడా విభాగాల ప్రకారం), మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాలు చూస్తారు.
ట్రయల్స్ వేదిక: తేజస్ క్యాంపస్, ఎయిర్ ఫోర్స్ స్టేషన్, న్యూఢిల్లీ, లోక్ కల్యాణ్ మార్గ్, న్యూఢిల్లీ
చివరి తేదీ: 2025 ఆగస్ట్ 20 వెబ్‌సైట్: agnipathvayu.cdac.in/AV/
ఈ వార్తలు కూడా చదవండి..
జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డిపై చర్యలకు రంగం సిద్ధం..!
ప్రాజెక్ట్‌లను నిర్వీర్యం చేసిన బీఆర్ఎస్
For More Telangana News And Telugu News
Updated Date - Aug 11 , 2025 | 02:00 AM