ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Bhavitha Mandava rose from being a New York: ఫ్యాషన్‌ ప్రపంచంలో భవిత

ABN, Publish Date - Dec 15 , 2025 | 02:27 AM

కొన్ని కథలు సినిమాలో మాత్రమే సాధ్యమనుకుంటాం. కానీ కొన్నిసార్లు నిజ జీవితంలో అంతకుమించిన అద్భుతాలు జరుగుతాయి. సరిగ్గా అలాంటి ఓ అద్భుతమే హైదరాబాద్‌కు.....

కొన్ని కథలు సినిమాలో మాత్రమే సాధ్యమనుకుంటాం. కానీ కొన్నిసార్లు నిజ జీవితంలో అంతకుమించిన అద్భుతాలు జరుగుతాయి. సరిగ్గా అలాంటి ఓ అద్భుతమే హైదరాబాద్‌కు చెందిన 25 ఏళ్ల భవిత మండవ జీవితంలో జరిగింది. ఏడాది క్రితం న్యూయార్క్‌ సబ్‌వేలో ప్రయాణిస్తున్న ఓ సాధారణ విద్యార్థిని.. ఇప్పుడు ప్రపంచ ప్రఖ్యాత ఫ్యాషన్‌ బ్రాండ్‌ ‘షనెల్‌’షోలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. షనెల్‌ చరిత్రలోనే ఓ ఫ్యాషన్‌ షోను ప్రారంభించిన తొలి భారతీయ మోడల్‌గా చరిత్ర సృష్టించింది. ’

అనుకోని మలుపు

హైదరాబాద్‌లో ఆర్కిటెక్చర్‌ పూర్తి చేసిన భవిత ఉన్నత చదువుల కోసం న్యూయార్క్‌ వెళ్లింది. ఆమెకు మోడలింగ్‌ ప్రపంచంతో ఎలాంటి పరిచయమూ లేదు. ఆ ఆలోచన కూడా లేదు. కానీ విధి మరోలా తలచింది. అక్టోబర్‌ 2024లో ఓ రోజు సబ్‌వే ప్లాట్‌ఫాంపై ఉన్న ఆమెను ఓ టాలెంట్‌ ఏజెంట్‌ గమనించారు. ఆ ఒక్క క్షణం ఆమె జీవితాన్ని మార్చేసింది. అప్పటి వరకు క్లాసులు, పుస్తకాలతో గడిపిన భవిత ప్రపంచంలోని అతిపెద్ద ఫ్యాషన్‌ ర్యాంప్‌లపై నడిచే అవకాశం దక్కించుకుంది.

ఆరంభం నుంచి అగ్రస్థానానికి

భవిత ప్రయాణం ‘బొట్టెగా వెనెటా’ స్ర్పింగ్‌ సమ్మర్‌ 2025 షోతో ప్రారంభమైంది. అప్పటి క్రియేటివ్‌ డైరెక్టర్‌ మాథ్యూ బ్లేజీ ఆమెలోని ప్రతిభను గుర్తించి వరుస అవకాశాలిచ్చారు. ఆ తర్వాత బ్లేజీ ‘షనెల్‌’ బ్రాండ్‌కు మారినప్పుడు తనతోపాటు భవితను కూడా తీసుకెళ్లారు. భవిత కథ తెలిసిన బ్లేజీ ఆమెకు జీవితాంతం గుర్తుండిపోయే గౌరవాన్ని అందించాలనుకున్నారు. ఈ నెల మొదట్లో న్యూయార్క్‌లోని బోవరి సబ్‌వే స్టేషన్‌లో షనెల్‌ మెటియర్స్‌ డి’ఆర్ట్‌ 2025-26 షోను అద్భుతంగా నిర్వహించారు. ఎక్కడైతే భవిత ప్రయాణం మొదలైందో అలాంటి సబ్‌వేలోనే ఆమెను షో ఓపెనర్‌గా నిలబెట్టారు. అంతటితో ఆగకుండా, ఆమెను మొదటిసారి చూసినప్పుడు ఎలాంటి దుస్తుల్లో ఉందో (సాదా బేజ్‌ స్వెటర్‌, డెనిమ్‌ జీన్స్‌) దాదాపు అలాంటి దుస్తులతోనే ర్యాంపుపై నడిపించారు. ఇది తన జీవితంలో మర్చిపోలేని క్షణమని భవిత చెబుతారు.

తల్లిదండ్రుల కన్నీళ్లు

ఈ ఘట్టం తర్వాత భవిత తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఓ వీడియోను పోస్ట్‌ చేశారు. తన కుమార్తె ర్యాంప్‌పై నడుస్తుంటే ఆమె తల్లిదండ్రులు చూసి ఆనందంతో కన్నీళ్లు పెట్టుకోవడం ఆ వీడియోలో ఉంది. కుమార్తెను చూసి ‘భవితా.. భవితా’.. అంటూ ఆమె తల్లి గర్వంగా, భావోద్వేగంగా పలికిన మాటలు కోట్లాదిమంది హృదయాలను హత్తుకున్నాయి. ఈ వీడియో క్షణాల్లోనే వైరలై 1.8 కోట్లకుపైగా వ్యూస్‌తో సోషల్‌ మీడియాను షేక్‌ చేసింది. ఒకవైపు చదువుకుంటూనే భవిత ఈ స్థాయికి చేరడం ఎందరికో స్ఫూర్తినిస్తోంది. సాధారణ ప్రదేశాల్లోనే అసాధారణ ప్రయాణాలు మొదలవుతాయని భవిత కథ నిరూపించింది.

Updated Date - Dec 15 , 2025 | 02:27 AM