ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Hair Dye: హెయిర్‌ డై వేసుకోవచ్చా?

ABN, Publish Date - Nov 13 , 2025 | 06:16 AM

డాక్టర్‌ నేను చాలా కాలంగా హెయిర్‌ డై వాడుతున్నాను. అయితే రంగు వేసుకున్న ప్రతిసారీ, ముఖం మీద దద్దుర్లు వస్తున్నాయి. దీన్ని హెయిర్‌డై రియాక్షన్‌గా భావించాలా? ఈ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలి...

డాక్టర్‌! నేను చాలా కాలంగా హెయిర్‌ డై వాడుతున్నాను. అయితే రంగు వేసుకున్న ప్రతిసారీ, ముఖం మీద దద్దుర్లు వస్తున్నాయి. దీన్ని హెయిర్‌డై రియాక్షన్‌గా భావించాలా? ఈ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలి?

- ఓ సోదరి, హైదరాబాద్‌

తలకు వేసుకునే రంగు విషయంలో మనకెన్నో అనుమానాలుంటాయి. హెయిర్‌ డైను ఎంచుకునేటప్పుడు, ఏ రంగు సురక్షితం, ఏ రంగు ఎక్కువ కాలం మన్నుతుంది? దేంతో దుష్ప్రభావాలు తక్కువగా ఉంటాయి? లాంటి అంశాలను మనం పరిగణనలోకి తీసుకుంటూ ఉంటాం. అయితే ఎన్ని జాగ్రత్తలు పాటించినా పదే పదే ఉపయోగించే హెయిర్‌ డైలతో కొన్ని దుష్ప్రభాలను ఎదుర్కోక తప్పదు. కాలక్రమేణా హెయిర్‌ డైలలో అనేక మార్పులు కూడా చోటుచేసుకుంటున్నాయి. అయినప్పటికీ వీటిలో ఉండే ఫార్మల్‌డిహైడ్‌ వల్ల ముఖం మీద దద్గుర్లు, తలలో పుండ్లు లాంటి రియాక్షన్లు కనిపిస్తూ ఉంటాయి. తరచూ హెయిర్‌ డైలను వాడే వారిలో ఈ సమస్య ఎక్కువ. అయితే ఈ దుష్ప్రభావాలకు గురి కాకుండా ఉండాలనుకుంటే, కొత్తగా అందుబాటులోకొస్తున్న వృక్షాధారిత హెయిర్‌ డైలను ఎంచుకోవడం మంచిది. రసాయనాలతో తయారయ్యే హెయిర్‌ డైలతో పోలిస్తే, వృక్షాధారిత హెయిర్‌ డైలు సురక్షితమైనవి. వీటితో దుష్ప్రభావాలకు తావు కూడా ఉండదు.

- డాక్టర్‌ స్వప్న ప్రియ, డెర్మటాలజిస్ట్‌,కాస్మో స్యూర్‌, హైదరాబాద్‌

Updated Date - Nov 13 , 2025 | 06:16 AM