చల్లనీళ్ల స్నానం వీళ్లకు చేటు
ABN, Publish Date - Jun 17 , 2025 | 12:16 AM
చల్లనీళ్ల స్నానంతో వాపులు, నొప్పులు తగ్గుతాయి. చర్మపు దురదలు అదుపులోకొస్తాయి. కానీ చల్లనీళ్ల స్నానం అందరికీ ప్రయోజనాలను అందించదు. ప్రత్యేకించి కొందరికి చల్లనీళ్ల స్నానంతో చేటు కలుగుతుంది. ..
పారాహుషార్
చల్లనీళ్ల స్నానంతో వాపులు, నొప్పులు తగ్గుతాయి. చర్మపు దురదలు అదుపులోకొస్తాయి. కానీ చల్లనీళ్ల స్నానం అందరికీ ప్రయోజనాలను అందించదు. ప్రత్యేకించి కొందరికి చల్లనీళ్ల స్నానంతో చేటు కలుగుతుంది. వాళ్లెవరంటే...
చల్లనీళ్ల స్నానంతో రక్తనాళాలు సంకోచిస్తాయి. దాంతో రక్తపోటు, గుండె కొట్టుకునే వేగం పెరుగుతాయి. కాబట్టి కొరొనరీ ఆర్టెరీ డిసీజ్, లేదా గుండె వైఫల్యం లాంటి గుండె జబ్బులున్నవాళ్లు చల్లనీళ్లతో స్నానం చేస్తే గుండె పోటు లేదా స్ట్రోక్‌కు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గుండెపోటు చరిత్ర కలిగిన వ్యక్తులు, లేదా సెరెబ్రోవ్యాస్క్యులర్ వ్యాధి ఉన్న రోగులు కూడా చల్లనీళ్లకు దూరంగా ఉండాలి. నీటి ఉష్ణోగ్రతల్లో అకస్మాత్తుగా చోటుచేసుకునే వ్యత్యాసాలతో రక్తపోటు పెరుగుతుంది. కాబట్టి గుండెపోటు చరిత్ర కలిగిన వ్యక్తులు చల్లనీళ్లకు దూరంగా ఉండాలి. చేయి, కాలి వేళ్లలోని రక్తనాళాలు కుంచించుకుపోయే రేనాడ్స్ జబ్బు ఉన్న వ్యక్తులు చల్లనీళ్లతో స్నానం చేస్తే, విపరీతమైన బాధ, మొద్దుబారిపోవడం, అసౌకర్యాలకు లోనయ్యే అవకాశాలుంటాయి.
కాబట్టి ఈ కోవకు చెందిన వాళ్లు కూడా చల్లనీళ్లకు దూరంగా ఉండాలి. సహజంగానే పెద్దలకు హృద్రోగ ముప్పు ఎక్కువ. పైగా శరీర ఉష్ణోగ్రతలను క్రమబద్ధీకరించే సామర్థ్యం కూడా పెద్దల్లో తక్కువగా ఉంటుంది. కాబట్టి చల్లనీళ్ల స్నానంతో వాళ్ల శరీరాలు షాక్‌కు గురయ్యే అవకాశాలుంటాయి. దాంతో గుండె సమస్యలు తలెత్తుతాయి లేదా కళ్లు తిరిగి పడిపోవడం లాంటి ప్రమాదాలు కూడా జరుగుతాయి.
ఈ వార్తలు కూడా చదవండి
గోడలు దూకేందుకు బీజేపీ నేతల యత్నం.. జీహెచ్‌ఎంసీ వద్ద టెన్షన్ టెన్షన్
కొండపల్లి మున్సిపాలిటీ టీడీపీ కైవసం
Read Latest Telangana News And Telugu News
Updated Date - Jun 17 , 2025 | 12:16 AM