Health Benefits of Eating Guava: రేగు పండ్లు తింటే..!
ABN, Publish Date - Dec 11 , 2025 | 05:38 AM
చలికాలంలోతోపాటే రేగు పండ్లు కూడా వచ్చేశాయి. తరచూ వీటిని తినడం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు. రేగు పండ్లు అందించే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే...
చలికాలంలోతోపాటే రేగు పండ్లు కూడా వచ్చేశాయి. తరచూ వీటిని తినడం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు. రేగు పండ్లు అందించే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే...
రేగు పండ్లను తినడం వల్ల ఎముకలు, కండరాలు బలోపేతమవుతాయి. కీళ్ల నొప్పులు, వాపులు తగ్గుతాయి. శరీరంలో రక్త ప్రసరణ వ్యవస్థ మెరుగుపడుతుంది. రక్తహీనత తగ్గుతుంది. రక్తంలో కొలెస్ట్రాల్, చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. గుండె జబ్బులు రావు.
పండిన రేగు పండ్లు తింటూ ఉంటే జీర్ణాశయ సమస్యలు తీరుతాయి. పేగులు శుభ్రపడతాయి. కడుపులో మంట, మలబద్దకం, అజీర్తి దరిచేరవు. జీవక్రియలు మెరుగుపడతాయి.
రేగు పండ్లను తీసుకోవడం వల్ల వాతావరణ మార్పులతో ఏర్పడే అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. జలుబు, గొంతు నొప్పి, నిద్ర లేమితో బాధపడేవారికి ఇవి మంచి ఔషధంలా పనిచేస్తాయి.
చర్మ సంరక్షణకు కూడా రేగు పండ్లు తోడ్పడతాయి. రోజుకు నాలుగైదు రేగుపండ్లు తినడం వల్ల చర్మానికి తగినంత తేమ అందుతుంది. ముడుతలు, మొటిమలు, మచ్చలు తగ్గి చర్మం ఛాయగా మెరుస్తుంది.
రేగు పండ్లు.. శరీరంలో క్యాన్సర్ కారకాలను నిరోధిస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి. రోజూ రేగు పండ్లు తినడం వల్ల కాలేయం పనితీరు మెరుగుపడుతుంది. శరీరంలో పేరుకున్న వ్యర్థ పదార్థాలన్నీ విసర్జితమవుతాయి. ఊపిరితిత్తుల్లో పేరుకున్న కఫం తొలగిపోతుంది.
Updated Date - Dec 11 , 2025 | 07:04 AM