ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Smita Surendranath Bluggan: రుచులే ఆమె అభిరుచులు

ABN, Publish Date - Aug 11 , 2025 | 04:49 AM

65 ఏళ్ల వయసు మహిళలెవరైనా విశ్రాంతిగా గడపాలని కోరుకుంటారు. కానీ గోవాకు చెందిన స్మిత సురేంద్రనాథ్‌ బ్లగ్గన్‌, తన చేతి వంటను నలుగురికీ రుచి చూపించే రెస్టారెంట్‌ నడపాలని నిర్ణయించుకున్నారు. ఇంటి రుచులతో...

ప్రయత్నం

65 ఏళ్ల వయసు మహిళలెవరైనా విశ్రాంతిగా గడపాలని కోరుకుంటారు. కానీ గోవాకు చెందిన స్మిత సురేంద్రనాథ్‌ బ్లగ్గన్‌, తన చేతి వంటను నలుగురికీ రుచి చూపించే రెస్టారెంట్‌ నడపాలని నిర్ణయించుకున్నారు. ఇంటి రుచులతో గోవా వాసుల మనసులు గెలుచుకుంటున్న స్మిత ప్రస్థానమిది.

మాది మహారాష్ట్ర. కర్నాటకలోని ధార్వాడ్‌ జిల్లాలో స్థిరపడిన కుటుంబం మాది. నేనొక భోజన ప్రియురాలిని. కాబట్టి సహజంగా వంటల పట్ల ఆసక్తి చిన్న వయసులోనే ఏర్పడింది. పదేళ్లకే గరిట పట్టి, వంటలు వండడం మొదలుపెట్టేశాను. అప్పట్లో నేను వండిన జొన్న రొట్టెలను నాన్న ఎంతో ఇష్టంగా తినడం నాకిప్పటికీ గుర్తే! చదువు పూర్తయి ఉద్యోగంలో స్థిరపడిన తర్వాత ఒక పంజాబీ వ్యక్తితో పెళ్లయింది. దాంతో పంజాబీ వంటకాల పట్ల కూడా అవగాహన పెంచుకున్నాను. అత్తగారు కూడా ఎంతో రుచిగా వండుతారు. ఆమె వండిన చికెన్‌ కర్రీ సువాసన, తిన్న తర్వాత కూడా ఒక రోజంతా వేళ్లకు అంటిపెట్టుకుని ఉండిపోయేది. అలా ఆమె నుంచి పంజాబీ వంటకాలు కూడా నేర్చేసుకున్నాను. స్వతహాగా రుచిగా వండుతాను కాబట్టి పిల్లలు, పిల్లల స్నేహితులు నా వంటకాలను ఎంతో ఇష్టపడి తినేవారు. మా వారు, సురేంద్రనాథ్‌ గ్వారకన్‌ బ్లగ్గన్‌, ఉద్యోగ రీత్యా అసిస్టెంట్‌ ఇంజనీర్‌గా 1986లో గోవాకు ట్రాన్స్‌ఫర్‌ అవడంతో, ఆయనతో పాటు నేను కూడా గోవా చేరుకుని అక్కడే స్థిరపడిపోయాను. అలా గోవా వంటకాలు కూడా నేర్చుకున్నాను. మా వారి స్నేహితులు, బాస్‌లు కూడా నా వంటను తరచూ మెచ్చుకుంటూ ఉండేవారు. దాంతో మావారు రెస్టారెంట్‌ మొదలుపెట్టమని నాతో అంటూ ఉండేవారు. నిజానికి నాక్కూడా ఆ ఆలోచన ఉంది. కానీ అప్పుడు పరిస్థితులు అనుకూలించలేదు. 2020లో కాస్త ఆలస్యంగా నా ఆలోచనకు కార్యరూపం ఇవ్వడం మొదలుపెట్టాను.

వంటకాలన్నీ నా బిడ్డలే!

ఇంటికి దగ్గర్లోనే రెస్టారెంట్‌ కోసం మంచి స్థలం కనిపించింది. పైగా ఆ ప్రదేశం కొలను పక్కనే ఉంది కాబట్టి అందరికీ నచ్చుతుందనే ఉద్దేశంతో వెంటనే కొని, మిగతా పనులన్నీ చకచకా ముగించుకున్నాను. అయితే రెస్టారెంట్‌ నడిచిన కొద్ది రోజులకే లాక్‌డౌన్‌ మొదలైంది. దాంతో అయోమయంలో పడిపోయాను. మున్ముందు పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. అయినా చేసేదేం లేక అప్పటికి ఊరుకున్నాను. లాక్‌డౌన్‌ తర్వాత రెస్టారెంట్‌ నెమ్మదిగా ఊపందుకుంది. దీన్లో పంజాబీ, గోవా, కొంకణి, మహారాష్ట్ర వంటకాలు తయారవుతూ ఉంటాయి. అయితే ప్రతి వంటకం నా ఆధ్వర్యంలోనే తయారవుతుంది. ప్రతి వంటకానికీ అవసమైన మసాలాలన్నీ అప్పటికప్పుడే సిద్ధం చేసుకుంటూ ఉంటాను. నిల్వ ఉన్న వాటిని వాడే అలవాటు నాకు లేదు. అలాగే వంటకాల కోసం అవసరమైన కూరగాయలు, సరుకులను స్వయంగా నేనే కొనుగోలు చేస్తాను. రుచుల విషయంలో ఏమాత్రం రాజీ పడను. కొందరు నాకిష్టమైన వంటకం ఏదని అడుగుతూ ఉంటారు. కన్న బిడ్డల్లో ఎవరంటే ఎక్కువ ఇష్టమంటే ఎలా చెప్పడం? వంటకాలన్నీ నా బిడ్డలే! కాబట్టి అన్నిటినీ సమానంగా ఇష్టపడతాను. అయితే నా రెస్టారెంట్‌లో తయారయ్యే ప్రాన్‌ డేంజర్‌, ఫిష్‌ థాలి, రావ మస్సెల్స్‌, బటర్‌ చికెన్స్‌ వంటకాలు బాగా పేరు పొందాయి.

సవాళ్లనే సోపానాలుగా...

రెస్టారెంట్‌ బ్రహ్మాండంగా నడుస్తుంది కాబట్టి నాకెలాంటి సవాళ్లూ ఎదురు కావు అనుకుంటే పొరపాటు. ఒకసారి ఒక పెద్ద లంచ్‌కు ముందు, మా చెఫ్‌ పని మానేస్తున్నట్టు చెప్పడంతో ఆ భారమంతా నా భుజాల మీద పడింది. కూతురు, కొడుకుల సహాయం తీసుకుని మొత్తానికీ ఆ భారీ భోజన కార్యక్రమాన్ని ముగించేశాను. కొన్ని సార్లు, నీటి సరఫరా సమస్య ఎదురవుతుంది. ఇంకొన్ని సార్లు విద్యుత్‌ ఉండదు. అయితే నేనిలాంటి సవాళ్లను సమస్యలుగా భావించను. ఇలాంటి మసాలాలు, డ్రామాలు లేని జీవితం జీవితమెలా అవుతుంది? ఇలాంటివి ఎదురైనప్పుడు వాటిని సమర్థంగా ఎదుర్కొని విజయం సాధించడంలోనే మజా ఉంటుంది.

ఈ వార్తలు కూడా చదవండి..

జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డిపై చర్యలకు రంగం సిద్ధం..!

ప్రాజెక్ట్‌లను నిర్వీర్యం చేసిన బీఆర్ఎస్

For More Telangana News And Telugu News

Updated Date - Aug 11 , 2025 | 04:49 AM