ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఇవి తినిపించాలి

ABN, Publish Date - Jun 19 , 2025 | 01:41 AM

పసిపిల్లలకు ఆరోనెల రాగానే అన్నప్రాసన చేసి ఘనాహారాన్ని తినిపించడం మొదలుపెడతారు. అప్పటివరకూ తల్లిపాలు మాత్రమే తాగుతారు కాబట్టి పిల్లల జీర్ణాశయం సున్నితంగా పనిచేస్తూ...

పసిపిల్లలకు ఆరోనెల రాగానే అన్నప్రాసన చేసి ఘనాహారాన్ని తినిపించడం మొదలుపెడతారు. అప్పటివరకూ తల్లిపాలు మాత్రమే తాగుతారు కాబట్టి పిల్లల జీర్ణాశయం సున్నితంగా పనిచేస్తూ ఉంటుంది. ఇది అన్ని రకాల ఆహారపదార్థాలను జీర్ణం చేయలేదు. అందుకే త్వరగా జీర్ణమయ్యే తేలికపాటి ఆహారాన్ని మాత్రమే ఈ పిల్లలకు తినిపించాలి. ఆ వివరాలు...

  • బాగా పండిన అరటి పండు గుజ్జును తినిపించవచ్చు. ఇందులో పొటాషియం, పీచుపదార్థాలు అధికంగా ఉంటాయి. ఇవి పిల్లల్లో మలబద్దకం సమస్యను నివారిస్తాయి. యాపిల్‌, బొప్పాయి పండ్లను కూడా గుజ్జులా చేసి పెట్టవచ్చు.

  • పచ్చి బఠానీలను కుక్కర్లో ఉడికించి మెత్తగా మెదిపి కొద్దికొద్దిగా తినిపించాలి. ఇందులో ఎ, సి విటమిన్లతోపాటు ప్రోటీన్లు, ఐరన్‌, కాల్షియం లాంటి పోషకాలు ఉంటాయి. ఇవి పిల్లల ఎదుగుదలకు తోడ్పడతాయి.

  • చిలగడ దుంపలను బాగా కడిగి ఉడికించి తొక్క తీసి వ్రేళ్లతో మెత్తగా చిదిమి తినిపించవచ్చు. ఇందులో అధికంగా గ్లూకోజ్‌ ఉంటుంది. ఇది పిల్లలకు శక్తిని అందిస్తుంది.

  • అవకాడోను కూడా మెత్తగా చేసి తినిపించడం మంచిది. ఇందులో ఆరోగ్యకరమైన క్రొవ్వులు అధికంగా ఉంటాయి. ఇవి పిల్లల మెదడు పనితీరుని మెరుగుపరుస్తాయి.

  • రకరకాల కూరగాయలను మెత్తగా ఉడికించి పెట్టవచ్చు. టమాటా రసం, ఉడికించిన కందిపప్పు మీద తేరిన నీరు లాంటివి తాగించవచ్చు. మెత్తగా వండిన అన్నం, క్వినోవాలతోపాటు బొంబాయిరవ్వ ఉప్మా, ఇడ్లీ లాంటివాటిని మెల్లగా అలవాటు చేయాలి.

  • క్యారెట్‌కు తొక్క తీసి ఉడికించి తినిపించాలి. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు పిల్లలకు రోగ నిరోధక శక్తిని అందిస్తాయి. కళ్ల ఆరోగ్యాన్ని కాపాడతాయి.

  • మధ్యాహ్న సమయాల్లో రాగిజావ, పెసరపప్పు రసం పెట్టవచ్చు. వీటిలోని ప్రోటీన్లు, ఐరన్‌, కాల్షియం, పీచుపదార్థాలు, ఇతర విటమిన్లు కలిసి పిల్లలు ఆరోగ్యంగా ఎదిగేందుకు సహకరిస్తాయి.

ఈ వార్తలు కూడా చదవండి..

హీరో ఫిన్‌కార్ప్‌ రూ 260 కోట్ల సమీకరణ

మీ పర్సనల్ లోన్ ఇలా తీర్చుకోండి.. మీ ఖర్చులు తగ్గించుకోండి..

For National News And Telugu News

Updated Date - Jun 19 , 2025 | 01:41 AM