Coffee: కాఫీ తాగొచ్చా?
ABN, Publish Date - Mar 18 , 2025 | 04:04 AM
అదనపు కాఫీతో ఇనుము శోషణ, ఎముకల సాంద్రతలు తగ్గడంతో పాటు నిద్రలేమి కూడా వేధిస్తుంది. అయితే కొందరికి కాఫీతో ఇంతకు మించిన చేటు కూడా జరుగుతుంది. ఆ కోవకు చెందిన వాళ్లు ఎవరంటే...
ఆందోళన, నిద్రలేమిలతో బాధపడుతున్న వాళ్లలో కాఫీతో ఆ సమస్యలు మరింత తీవ్రమవుతాయి. కాబట్టి ఈ సమస్యలున్న వాళ్లు కాఫీని రోజుకు రెండు కప్పులకే పరిమితం చేయాలి
కాఫీ తాత్కాలికంగా రక్తపోటును పెంచుతుంది. కాబట్టి అధిక రక్తపోటు సమస్య ఉన్నవాళ్లు కాఫీకి దూరంగా ఉండడమే మేలు
మితిమీరిన కాఫీ, గర్భంలో పెరిగే పిండం ఎదుగుదలను ప్రభావితం చేస్తుంది. కాబట్టి గర్భిణులు కాఫీ తాగడం తగ్గించడం మంచిది
హృద్రోగుల్లో కాఫీలోని కెఫీన్ వల్ల గుండె లయలో హెచ్చుతగ్గులు, గుండెదడ లాంటి లక్షణాలు పెరుగుతాయి. కాబట్టి ఈ కోవకు చెందినవారు కాఫీని వీలైనంతగా తగ్గించాలి
జీర్ణ సమస్యలను ఎదుర్కొంటున్నవాళ్లు కాఫీ జోలికి వెళ్లకపోవడమే మేలు.
ఏ కాఫీ మేలు?
కొందరు బ్లాక్ కాఫీ ఇష్టపడతారు. ఇంకొందరు పాలు, చక్కెర కలిపి తయారుచేసిన కాఫీని ఇష్టంగా తాగుతారు. ఈ రెండింట్లో ఏది ఎక్కువ ఆరోగ్యకరం? బ్లాక్ కాఫీలో క్యాలరీలు తక్కువ, యాంటీఆక్సిడెంట్లు ఎక్కువ. కాబట్టి బరువు అదుపులో ఉంచుకోవాలనుకునేవారు బ్లాక్ కాఫీని ఎంచుకోవడం మంచిది. పాలతో తయారుచేసిన కాఫీలో క్యాల్షియం, ప్రొటీన్ అదనంగా ఉంటాయి. అలాగే కాఫీ అసిడిటీ నుంచి రక్షణ పొందాలంటే పాలు కలిపిన కాఫీనే ఎంచుకోవాలి. ఉదయం 9:30 నుంచి 11:30 మధ్య కాఫీ తాగాలి. కాఫీ తాగడానికి అనువైన సమయమిది. కార్టిసాల్ హార్మోన్ మోతాదులు తగ్గే ఈ సమయంలో కాఫీతో కొంత శక్తిని పుంజుకోవచ్చు. నిద్రలేమి సమస్య వేధించకుండా ఉండాలంటే మధ్యాహ్నం 3 గంటల నుంచి కాఫీ జోలికి వెళ్లకూడదు.
ఇవి కూడా చదవండి...
Nishanth Dongari: ఇంధన నిల్వ విభాగంలో సరికొత్త ఉత్పత్తుల ఆవిష్కర్ణకు రంగం సిద్ధం
YSR Kadapa District: కేబినెట్‌లో కీలక నిర్ణయం.. వైఎస్ఆర్ జిల్లా పేరు మార్పు
PM Modi: మోదీ వ్యాఖ్యలపై స్పందించిన చైనా
CM Revanth Reddy: కేబినెట్ నుంచి మంత్రులను తొలగిస్తేనేనా..
Tirumala: శ్రీవారి దర్శనానికి తిరుపతి వెళ్తున్నారా .. టేక్ కేర్
CM Revanth Reddy: అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ బిల్లు.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
Droupadi Murmu: రాష్ట్రపతి భవన్‌లో విందు.. హాజరైన ఏపీ ఎంపీలు
CM ChandraBabu: అందుకే ఈ డాక్యుమెంట్ రూపొందించాం
Raghurama serious: సభ్యులపై డిప్యూటీ స్పీకర్ సీరియస్
Updated Date - Mar 18 , 2025 | 04:04 AM