Double Chin Remedies: డబుల్ చిన్ తగ్గేదెలా
ABN, Publish Date - Aug 11 , 2025 | 04:41 AM
డబుల్ చిన్ అనేది ముఖం కింద మెడ భాగంలో ఏర్పడుతూ ఉంటుంది. దీనివల్ల ముఖం అందంగా కనిపించదు. చర్మం కింద కొవ్వులు పేరుకోవడం, ఊబకాయం, వయసు పెరగడం, జన్యుపరమైన కారణాల వల్ల ఈ సమస్య...
డబుల్ చిన్ అనేది ముఖం కింద మెడ భాగంలో ఏర్పడుతూ ఉంటుంది. దీనివల్ల ముఖం అందంగా కనిపించదు. చర్మం కింద కొవ్వులు పేరుకోవడం, ఊబకాయం, వయసు పెరగడం, జన్యుపరమైన కారణాల వల్ల ఈ సమస్య వస్తూ ఉంటుంది. చిన్న చిట్కాలతో డబుల్ చిన్‌ను మాయం చేయవచ్చంటున్నారు నిపుణులు...
డబుల్ చిన్ ఉన్నవారు ఆహారాన్ని బాగా నమిలి తినాలి. దీనివల్ల ముఖంలోని కండరాలకు వ్యాయామం చేసినట్లవుతుంది. చర్మం కింద పేరుకున్న అదనపు కొవ్వులు కరిగిపోతాయి. క్రమంగా ముఖాకృతి మామూలుగా మారుతుంది. తరచూ చూయింగ్ గమ్ నమలడం వల్ల కూడా ప్రయోజనం లభిస్తుంది.
ఒక గిన్నెలో గుడ్డు తెల్ల సొన, ఒక చెంచా పాలు, ఒక చెంచా నిమ్మరసం, కొద్దిగా తేనె వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని డబుల్ చిన్ మీద రాసి ఆరనివ్వాలి. అరగంట తరవాత గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తూ ఉంటే డబుల్ చిన్ తగ్గుతుంది.
మెడను గుండ్రంగా తిప్పడం, పైకి కిందికి కదిలించడం లాంటి చిన్న చిన్న వ్యాయామాలు చేసినా ఫలితం ఉంటుంది.
రోజూ కాఫీ, టీలకు బదులు తేనె కలిపిన గ్రీన్ టీ తాగడం అలవాటు చేసుకోవాలి. దీనివల్ల శరీరంలో జీవక్రియలు వేగవంతమవుతాయి. చెడు కొవ్వులు కరిగి సమస్య తీరుతుంది.
అధిక క్యాలరీలు ఉన్న ఆహారాన్ని తినకూడదు. ఇ విటమిన్ అధికంగా లభించే ఆకు కూరలు, పాల ఉత్పత్తులు, పప్పు దినుసులు, స్వీట్ కార్న్, సోయా బీన్స్, యాపిల్, బ్రౌన్ రైస్ తరచూ తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డిపై చర్యలకు రంగం సిద్ధం..!
ప్రాజెక్ట్‌లను నిర్వీర్యం చేసిన బీఆర్ఎస్
For More Telangana News And Telugu News
Updated Date - Aug 11 , 2025 | 04:41 AM