Durga Navaratri 2025: నేటి అలంకారం శ్రీ మహాలక్ష్మీ దేవి
ABN, Publish Date - Sep 26 , 2025 | 03:22 AM
శరన్నవరాత్రి మహోత్సవాల్లో అయిదో రోజున శ్రీ మహాలక్ష్మీ దేవిగా విజయవాడ కనకదుర్గమ్మ దర్శనమిస్తారు. మంగళప్రదమైన దేవత మహాలక్ష్మీదేవి. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అనే రూపాల్ని ధరించి...
దుర్గా నవరాత్రులు
నేటి అలంకారం
శ్రీ మహాలక్ష్మీ దేవి
ఆశ్వయుజ శుద్ధ చవితి, శుక్రవారం
శరన్నవరాత్రి మహోత్సవాల్లో అయిదో రోజున శ్రీ మహాలక్ష్మీ దేవిగా విజయవాడ కనకదుర్గమ్మ దర్శనమిస్తారు. మంగళప్రదమైన దేవత మహాలక్ష్మీదేవి. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అనే రూపాల్ని ధరించి, ఆదిపరాశక్తి దుష్ట రాక్షస సంహారం చేసిందనీ, క్షీరాబ్ది పుత్రికగా అవతరించిన లక్ష్మీదేవి డోలాసురుడనే రాక్షసుడ్ని సంహరించిందని పురాణాలు చెబుతున్నాయి. రెండు చేతుల్లో కమలాలు ధరించి, అభయ, వరద హస్త ముద్రలను ప్రదర్శిస్తూ... గజరాజు సేవిస్తుండగా శ్రీమహాలక్ష్మి భక్తులను అనుగ్రహిస్తుందని పెద్దలు చెబుతుంటారు. ఆమెను పూజించడం వల్ల దరిద్రం, దుఃఖాలు తొలగిపోయి సకల శుభాలు కలుగుతాయన్నది భక్తుల నమ్మిక. లోక స్థితికారిణిగా ధన, ధాన్య, ధైర్య, విజయ, విద్య, సౌభాగ్య, సంతాన, గజలక్ష్ములుగా వరాలు ప్రసాదించే అష్టలక్ష్మి సమష్టి రూపమైన అమృత స్వరూపిణి మహాలక్ష్మీదేవిగా దుర్గమ్మను దర్శించుకోవడం సంపత్ప్రదం. అమ్మవారిని మహాలక్ష్మి రూపంలో అర్చిస్తే ధన , కనక, వస్తు, వాహన ప్రాప్తి కలుగుతుందనీ, సుఖ సంతోషాలు చేకూరుతాయనీ విశ్వాసం.
నైవేద్యం : రవ్వకేసరి, గారెలు, చిత్రాన్నం, పాయసం
అలంకరించే చీర రంగు : ఎరుపు
అర్చించే పూల రంగు: తామర పుష్పాలు
పారాయణ: చెయ్యాల్సినవి: లక్ష్మీ స్తోత్రాలు
శ్రీసత్యగౌర చంద్రదాస ప్రభూజీ
అధ్యక్షులు, హరే కృష్ణ మూవ్‌మెంట్,
హైదరాబాద్, 9640086664
Also Read:
ఎవరైనా ఆడబిడ్డల జోలికి వచ్చారో.. సీఎం డెడ్లీ వార్నింగ్
వైసీపీ హయాంలో చిరంజీవిని అవమానించారంటూ బాలయ్య ఫైర్..
Updated Date - Sep 26 , 2025 | 03:22 AM