Balakrishna: వైసీపీ హయాంలో చిరంజీవిని అవమానించడం నిజమే: బాలకృష్ణ..
ABN , Publish Date - Sep 25 , 2025 | 04:00 PM
అసెంబ్లీలో ఎమ్మెల్యే బాలకృష్ణ ఫైరయ్యారు. చిరంజీవి గట్టిగా ఆడిగాక జగన్ సినీ ప్రముఖులను కలిశారన్న కామినేని వ్యాఖ్యలతోనూ బాలయ్య ఏకీభవించలేదు. ఆ సైకోని కలిసేందుకు తనకూ ఆహ్వానం వచ్చినా వెళ్లలేదన్న విషయాన్ని..
అమరావతి, సెప్టెంబర్ 25: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఇవాళ (గురువారం) హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ ఫైరయ్యారు. జగన్ హయాంలో సినీ ప్రముఖులకు అవమానం జరిగితే గట్టిగా ఎవ్వరూ అడగలేదన్నారు. జగన్ ప్రభుత్వంలో సినీ ప్రముఖులకు అవమానం జరిగిందంటూ సభలో ఎమ్మెల్యే కామినేని చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి బాలకృష్ణ ఆవేశంగా ప్రసంగించారు. ఆ రోజు సినీ ప్రముఖులను జగన్ కలిసేందుకు ఇష్టపడకపోతే.. చిరంజీవి గట్టిగా అడిగాక జగన్ సినీ ప్రముఖులను కలిశారన్న కామినేని వ్యాఖ్యలతో బాలయ్య ఏకీభవించలేదు.
కామినేని మాటలకు అభ్యంతరం వ్యక్తం చేసిన బాలకృష్ణ.. ఆ రోజు గట్టిగా అడిగిన వారెవ్వరూ లేరని సభకు స్పష్టం చేశారు. ఆ సైకోని కలిసేందుకు తనకు ఆహ్వానం వచ్చినా వెళ్లలేదన్న విషయాన్ని బాలకృష్ణ గుర్తు చేశారు. చిరంజీవిని అవమానించారని అనడం వరకూ వాస్తవమే అని చెప్పిన బాలకృష్ణ.. కూటమి ప్రభుత్వంలోనూ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ తయారు చేసిన లిస్ట్ లో తనది 9వ పేరుగా ముద్రించారన్నారు. 'ఎవడాడు ఇలా రాసిందని ఆ రోజే తాను సినిమాటోగ్రఫ్రీ మంత్రి కందుల దుర్గేష్ ని నిలదీసిన విషయాన్ని బాలకృష్ణ చెప్పుకొచ్చారు. అసెంబ్లీకి స్పష్టత ఇవ్వాలనే తాను ఈ అంశంపై స్పందించానన్న బాలకృష్ణ.. ఏదైనా తప్పు మాట్లాడితే క్షమించండంటూ సభను కోరారు.
ఇవి కూడా చదవండి:
హెచ్-1బీ వీసాదారుల్లో 80 శాతం మాయం.. అమెరికన్లకు ఇదే ఛాన్స్.. నెటిజన్ పోస్టుపై నెట్టింట డిబేట్
యూపీఐ అంటే ఇదీ.. పోయిందనుకున్న ఫోన్ దొరకడంతో సంబరపడ్డ జంట