Share News

Heavy Rain Alert In Coastal Andhra: మళ్లీ భారీ వర్షాలు

ABN , Publish Date - Sep 25 , 2025 | 03:33 PM

రానున్న వారం రోజుల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఉన్నతాధికారి వెల్లడించారు.

Heavy Rain Alert In Coastal Andhra: మళ్లీ భారీ వర్షాలు
Heavy Rains alert in coastal andhra

విశాఖపట్నం, సెప్టెంబర్ 25: రానున్న వారం రోజుల్లో కోస్తా ఆంధ్రాలో పలు చోట్ల తేలికపాటి నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తుఫాన్ హెచ్చరిక కేంద్రం ఉన్నతాధికారి జగన్నాథ్ కుమార్ వెల్లడించారు. గురువారం విశాఖపట్నంలో ఆయన మాట్లాడుతూ.. దక్షిణ ఒడిశా నుంచి ఉత్తర కోస్తా వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందన్నారు. ఇది ఉత్తర, మధ్య బంగాళాఖాత పరిసర ప్రాంతాలకు అనుకొని ఉందని తెలిపారు. రానున్న 12 గంటల్లో ఇది అల్పపీడనంగా మారే అవకాశం ఉందని చెప్పారు.

ఈ అల్పపీడనం శుక్రవారానికి మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇది శనివారం.. దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తా మధ్య తీరం దాటే అవకాశం ఉందని వివరించారు. ఈ నేపథ్యంలో వర్షాలు పడే అవకాశముందని తెలిపారు. ఈ సమయంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయన్నారు. ఆ క్రమంలో సముద్రంలోకి వేటకు వెళ్లొద్దంటూ మత్స్యకారులను ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు.


మరో వైపు రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లోని నదులు భారీ వర్షాలు, వరద నీరు పోటెత్తడంతో పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ యా ప్రాంతాల్లో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. ఇక విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ వద్ద సైతం కృష్ణమ్మ వరద ఉధృతి కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో నదీ సమీపంలోని స్నాన ఘాట్ల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.


ఇంకోవైపు తెలంగాణలోని ఉత్తర, తూర్పు జిల్లాల్లో నేడు, రేపు భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. శనివారం ఉత్తర, తూర్పు, మధ్య తెలంగాణ జిల్లాలకు భారీ వర్ష సూచన ఉందని పేర్కొంది. ఈ రోజు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది.

ఈ వార్తలు కూడా చదవండి..

రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. ఉద్యోగులకు దసరా కానుక

సృష్టి ఆసుపత్రి కేసులో ఈడీ ఎంట్రీ

Read Latest Telangana News And Telugu News

Updated Date - Sep 25 , 2025 | 03:35 PM