Dr Namrata In Srushti hospital Case: సృష్టి ఆసుపత్రి కేసులో ఈడీ ఎంట్రీ
ABN , Publish Date - Sep 25 , 2025 | 10:38 AM
సరోగసి పేరుతో సృష్టి ఆసుపత్రి వేదికగా డాక్టర్ నమత్ర భారీగా నగదు వసూలు చేసినట్లు విచారణలో వెల్లడైంది. ఈ ఆసుపత్రి వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎంట్రీ ఇచ్చింది. అందులోభాగంగా ఆమెను ఈడీ ప్రశ్నించనుంది.
హైదరాబాద్, సెప్టెంబర్ 25: సరోగసి పేరుతో సృష్టి ఆసుపత్రి వేదికగా డాక్టర్ నమత్ర భారీగా నగదు వసూలు చేసినట్లు విచారణలో వెల్లడైంది. ఈ కేసు వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎంట్రీ ఇచ్చింది. అందులోభాగంగా ఆమెను మరికొద్ది రోజుల్లో ఈడీ ప్రశ్నించనుంది.
పిల్లలు లేని దంపతులనే లక్ష్యంగా చేసుకుని డాక్టర్ నమ్రత రూ. లక్షల్లో నగదు వసూలు చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. అబార్షన్ కోసం ఆసుపత్రికి వచ్చే గర్బిణీలకు నగదు ఆశ చూపి ప్రసవం తర్వాత వారి పిల్లల్ని డాక్టర్ నమ్రత కోనుగోలు చేసేవారు. అనంతరం సరోగసి ద్వారా పుట్టిన బిడ్డగా పిల్లలు లేని దంపతులను నమ్మించి పెద్ద ఎత్తున నగదు వసూలు చేశారు. ఇదే విషయాన్ని పోలీసులు తన నివేదికలో స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో డాక్టర్ నమత్ర జన్మించారు. విశాఖపట్నంలోని ఆంధ్ర మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్.. జేజేఎం మెడికల్ కాలేజీలో ఎండీ గైనకాలజీని ఆమె పూర్తి చేశారు. అనంతరం విజయవాలో తన వైద్య వృత్తిని ప్రారంభించారు. అలా ఫెర్టిలిటీ సెంటర్‌ను స్థాపించారు. ఆ తర్వాత హైదరాబాద్‌కు మారిన ఆమె.. సికింద్రాబాద్‌తోపాటు విశాఖపట్నంలో సైతం ఈ కొత్త ఫెర్టిలిటీ సెంటర్లు ఏర్పాటు చేశారు. అయితే డాక్టర్ నమత్ర.. ఏజెంట్ల సాయంతో గర్భస్రావం చేయించుకోవాలని ఆసుపత్రులకు వచ్చే పేద మహిలను లక్ష్యంగా చేసుకుని.. ఈ దందా కొనసాగించారు.
అలా మహిళలకు నగదు ఆశ చూపించి.. వారి గర్భాలను కొనసాగించేలా ఒప్పందాలు సైతం చేసుకున్నారు. దీంతో సంతానం లేని దంపతులకు ఆ మహిళల గర్బాన్ని సరోగసీగా చెప్పి.. వారి నుంచి రూ. 20 నుంచి 30 లక్షల వరకు వసూల్ చేశారు. ఇలా కోట్లాది రూపాయిలు సంపాదించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. దీంతో ఈడీ సైతం ఈ కేసులో ఎంట్రీ అయింది. అంతేకాకుండా.. ఈ కేసులో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈడీ ఎంట్రీతో ఈ కేసులో మరిన్ని సంచలన విషయాలు బహిర్గతం అవుతాయనే ఒక చర్చ సైతం సాగుతోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
సిలిండర్ పేలితే.. భారీగా పరిహారం.. ఈ విషయం తెలుసా?
నేటి అలంకారం శ్రీ కాత్యాయనీ దేవి
Read Latest Telangana News And Telugu News