Share News

Gas Cylinder Blast: సిలిండర్ పేలితే.. భారీగా పరిహారం.. ఈ విషయం తెలుసా?

ABN , Publish Date - Sep 25 , 2025 | 10:02 AM

గ్యాస్ బుక్ చేసిన వెంటనే మనకు తెలియకుండానే బీమా చేశామనే విషయం చాలా మందికి తెలియదు. అయితే సిలిండర్ పేలితే.. రూ. 50 బీమా కింద నగదు ఇస్తారన్న విషయం సైతం అత్యధిక మందికి తెలియదు.

Gas Cylinder Blast: సిలిండర్ పేలితే.. భారీగా పరిహారం..  ఈ విషయం తెలుసా?
Gas Cylinder

హైదరాబాద్, సెప్టెంబర్ 25: ప్రస్తుతం గ్యాస్ ప్రమాదాలు తరచుగా జరుగుతున్నాయి. ఈ పేలుడు దాటికి కొన్నిసార్లు ప్రాణ నష్టం.. మరికొన్ని సార్లు తీవ్ర గాయాలుపాలవుతున్నారు. వంట గ్యాస్ విషయంలో.. ఏ మాత్రం అప్రమత్తంగా లేకుంటే కచ్చితంగా ప్రమాదం బారిన పడతామన్నది సుస్పష్టం. అయితే మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా.. ప్రమాదం జరిగితే వినియోగదారులకు గరిష్టంగా రూ. 50 లక్షల వరకు బీమా అందుతుందన్న విషయం చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. అది కూడా మనం ఒక్క రూపాయి చెల్లించకుండానే ఇది సాధ్యమవుతుందన్నది సుస్పష్టం. గ్యాస్ సిలిండర్ మనం బుక్ చేయగానే బీమా సైతం వర్తిస్తుందన్న విషయం చాలా మందికి తెలియదు.


గ్యాస్ సిలిండర్ పేలి ప్రమాదం జరిగిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్, ఎల్‌పీజీ డిస్ట్రిబ్యూటర్, ఏజెన్సీకి సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. వారు వచ్చి ప్రమాద ఘటనపై విచారణ జరుపుతారు. సిలిండర్ పేలడం వల్ల ప్రమాదం జరిగిందని భావిస్తే.. సంబంధిత ఆయిల్ కంపెనీ, బీమా సంస్థకు డిస్ట్రిబ్యూటర్ సమాచారం అందిస్తారు. బీమా పొందేందుకు మరణ ధృవీకరణ పత్రం, పోస్టుమార్టం నివేదిక, చికిత్సకు సంబంధించిన మెడికల్ బిల్లులు, రసీదులు ఇవ్వాల్సి ఉంటుంది. 2019 లోక్‌సభలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ఎల్‌పీజీ పేలుడు బాధితులకు బీమా అందిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.


నగదు ఎంతంటే..

కేవలం ఆస్తి నష్టం జరిగితే రూ. 2 లక్షల బీమా వస్తుంది. ప్రమాదంలో మృతి చెందితే వ్యక్తిగత ప్రమాద బీమా కింద రూ. 6 లక్షలు పొందుతారు. ప్రమాదం బారిన పడి చికిత్స పొందుతున్న ఒక్కో సభ్యుడికి రూ. 2 లక్షలు ఇస్తారు. కుటుంబం మొత్తానికి గరిష్టంగా రూ. 50 లక్షల బీమా అందనుంది.


పేలుడు సంభవించిన వెంటనే..

గ్యాస్ బండ పేలుడు సంభవించిన వెంటనే స్థానిక డిస్ట్రిబ్యూటర్‌కు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. దాంతో పాటు 1906కి ఫోన్ చేసి వివరా లు చెప్పాల్సి ఉంటుంది. డిస్ట్రిబ్యూటర్లు సంబంధిత గ్యాస్ కంపెనీలకు సమాచారం ఇస్తారు. సదరు కంపెనీ ప్రతినిధులు వచ్చి జరిగిన ప్రమాదాన్ని పరిశీలించి. వివరాలు నమోదు చేసుకుంటారు.

ఈ వార్తలు కూడా చదవండి..

సృష్టి ఆసుపత్రి కేసులో ఈడీ ఎంట్రీ

నేటి అలంకారం శ్రీ కాత్యాయనీ దేవి

Read Latest Telangana News And Telugu News

Updated Date - Sep 25 , 2025 | 11:03 AM