Durga Navaratri 2025: నేటి అలంకారం శ్రీ కాత్యాయనీ దేవి
ABN , Publish Date - Sep 25 , 2025 | 02:32 AM
శరన్నవరాత్రి మహోత్సవాల్లో నాలుగో రోజున శ్రీ కాత్యాయనిదేవిగా విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ దర్శనమిస్తారు. పూర్వం ‘కత’ అనే మహర్షికి దేవీ ఉపాసన వల్ల ఒక కుమారుడు కలిగాడు....
దుర్గా నవరాత్రులు
నేటి అలంకారం శ్రీ కాత్యాయనీ దేవి
ఆశ్వయుజ శుద్ధ చవితి
గురువారం
శరన్నవరాత్రి మహోత్సవాల్లో నాలుగో రోజున శ్రీ కాత్యాయనిదేవిగా విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ దర్శనమిస్తారు. పూర్వం ‘కత’ అనే మహర్షికి దేవీ ఉపాసన వల్ల ఒక కుమారుడు కలిగాడు. చిన్నతనం నుంచే తండ్రి నుంచి భక్తిని అలవరచుకున్న ఆ తపస్వికే ‘కాత్యాయనుడు’ అని పేరు. ఆయన గొప్ప తపశ్శక్తి సంపన్నుడు. దేవి భక్తుడు కావడంతో దేవినే పుత్రికగా పొందాలని తపస్సు చేశాడు. దేవి ప్రసన్నురాలై ఆ మహర్షికి పుత్రికగా జన్మించింది. కాత్యాయనుడి పుత్రిక కనుక ఆమె ‘కాత్యాయనీదేవి’గా ప్రసిద్ధి పొందింది. లోకకంటకులైన రాక్షసులను... ముక్కోటి దేవతలు, త్రిమూర్తులు ప్రసాదించిన శక్తితో కాత్యాయనీదేవి అంతం చేసి, లోకకల్యాణానికి దోహదం చేసింది. ఆమె భక్తుల పాలిట కల్పవల్లి. ఆ తల్లిని ఆరాధించడం వల్ల చతుర్విధ పురుషార్థాలు సిద్ధిస్తాయని, రోగాలు, శోకాలు, భయాలు నశిస్తాయని, ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు భక్తుల ఇళ్ళలో వర్ధిల్లుతాయని పురాణ వచనం.
నైవేద్యం: పొంగలి, పరమాన్నం
అలంకరించే చీర రంగు: ఎరుపు
అర్చించే పూల రంగు: ఎరుపు
పారాయణ: చెయ్యాల్సినవి: కాత్యాయనీ మంత్రం, అష్టోత్తరం
ఈ వార్తలు కూడా చదవండి..
కృష్ణమ్మకు వరద పోటు.. ప్రభుత్వం అలర్ట్
అసెంబ్లీలో ఆమోదం పొందనున్న పలు బిల్లులు
For More AP News And Telugu News