Share News

Dasara Gift: రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. ఉద్యోగులకు దసరా కానుక

ABN , Publish Date - Sep 25 , 2025 | 12:43 PM

దసరా నవరాత్రులు ప్రారంభమైనాయి. అలాంటి వేళ రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.

Dasara Gift: రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. ఉద్యోగులకు దసరా కానుక
TG CM Revanth reddy

హైదరాబాద్, సెప్టెంబర్ 25: దసరా నవరాత్రుల వేళ రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. పలువురు ఉద్యోగులకు దసరా కానుక ప్రకటించింది. అందులో భాగంగా రాష్ట్రంలో భూ భారతి ఫీల్డ్ టెక్నికల్ స్టాఫ్‌కు కాంట్రాక్ట్ ఉద్యోగులుగా ప్రభుత్వం గుర్తించింది. దీంతో 708 మంది ఎఫ్‌టీఎస్‌లను టీజీటీఎస్‌ కాంట్రాక్టు ఉద్యోగులుగా మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.


అలాగే ఆ యా ఉద్యోగుల జీతాలు పెంచుతూ గురువారం ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కాంట్రాక్ట్ ఉద్యోగులు అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు కొనగాల మహేష్ స్పందిస్తూ.. సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.

ఈ వార్తలు కూడా చదవండి..

అసెంబ్లీకి ఎమ్మెల్యేలు గైర్హజరు.. సీఎం సీరియస్

సిలిండర్ పేలితే.. భారీగా పరిహారం.. ఈ విషయం తెలుసా?

Read Latest Telangana News And Telugu News

Updated Date - Sep 25 , 2025 | 01:24 PM