‘కొమెడెక్’, పీఎం ఇంటర్న్‌షిప్ స్కీమ్
ABN, Publish Date - Mar 17 , 2025 | 01:44 AM
కర్నాటకలోని ఇంజనీరింగ్ కాలేజీల అడ్మిషన్లకు ఉద్దేశించిన కొమెడెక్ యూజీసెట్-2025కి (కన్సార్టియం ఆఫ్ మెడికల్, ఇంజనీరింగ్, డెంటల్ కాలేజెస్ ఆఫ్ కర్నాటక) దరఖాస్తు దాఖలు గడువును పొడిగించారు.
గడువు పెంపు
‘కొమెడెక్’
కర్నాటకలోని ఇంజనీరింగ్ కాలేజీల అడ్మిషన్లకు ఉద్దేశించిన కొమెడెక్ యూజీసెట్-2025కి (కన్సార్టియం ఆఫ్ మెడికల్, ఇంజనీరింగ్, డెంటల్ కాలేజెస్ ఆఫ్ కర్నాటక) దరఖాస్తు దాఖలు గడువును పొడిగించారు. జాతీయ స్థాయిలో వివిధ ప్రాంతాల్లో నిర్వహించే ఈ పరీక్షను ప్రతీ సంవత్సరం తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు విద్యార్థులు రాస్తుంటారు. ఆసక్తి గల అభ్యర్థులు జ్ట్టిఞట://ఛిౌఝ్ఛఛీజు.ౌటజ/ వెబ్‌సైట్‌లో పూర్తి వివరాలు పొందవచ్చు. దరఖాస్తుల దాఖలుకు చివరి తేదీ 2025 మార్చి 20 తేదీ వరకు పెంచారు. కరెక్షన్ విండో ఏప్రిల్ 11 నుంచి 14 వరకు ఓపెన్‌గా ఉంటుంది. ఏప్రిల్ 30వ తేదీ నుంచి మే 10వ తేదీ వరకు హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకకోవచ్చు. ఎంట్రెన్స్ పరీక్ష మే10న జరుగుతుంది. ఫలితాలు మే 24న వెల్లడిస్తారు.
పీఎం ఇంటర్న్‌షిప్ స్కీమ్
ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ స్కీమ్ దరఖాస్తు దాఖలు గడువును 2025 మార్చి 31 వరకు పొడిగించారు. ఈ మేరకు కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ వివరాలను తెలిపింది. తొలుత ఈ గడువు 2025 మార్చి 12 వరకు ఉంది. ఆసక్తి గల అభ్యర్థులు ఞఝజీుఽ్ట్ఛటుఽటజిజీఞ.ఝఛ్చి.జౌఠి.జీుఽ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ స్కీమ్ ద్వారా భారతదేశంలోని టాప్ 500 కంపెనీల్లో ఇంటర్న్‌షిప్ చేసే అవకాశం లభిస్తుంది. ఇందులో ఆయిల్ అండ్ గ్యాస్, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్, ట్రావెల్ - హాస్పిటాలిటీ, మాన్యుఫ్యాక్చరింగ్ అండ్ కన్‌స్ట్రక్షన్ తదితర రంగాలు ఉన్నాయి. రిలయన్స్, టీసీఎస్, హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్, మారుతీ సుజుకీ, ఎల్ అండ్ టీ, టెక్ మహీంద్ర, బజాజ్ ఫైనాన్స్, మహీంద్ర అండ్ మహీంద్ర మొదలైన దిగ్గజ కంపెనీల్లో ఇంటర్న్‌షిప్ చేసే అవకాశం లభిస్తుంది. పదో తరగతి అర్హత ఉన్నవారు మొదలుకుని గ్రాడ్యుయేషన్ వరకు అందరూ ఈ పోర్టల్‌లో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి:
Diamond Ring Robbery: టాలీవుడ్ హీరోకి షాక్ ఇచ్చిన దొంగలు..
Namrata Shirodkar: మహేశ్ బాబు ఫౌండేషన్ ద్వారా గుండె ఆపరేషన్లు మరింత విస్తృతం: నమ్రత
Updated Date - Mar 17 , 2025 | 01:44 AM