Diamond Ring Robbery: టాలీవుడ్ హీరోకి షాక్ ఇచ్చిన దొంగలు..
ABN , Publish Date - Mar 16 , 2025 | 08:09 PM
ఆదివారం తెల్లవారుజామున యువ హీరో విశ్వక్ సేన్ ఇంట్లో భారీ చోటు జరిగింది. గుట్టుచప్పుడు కాకుండా ఇంట్లోకి ప్రవేశించిన దుండగలు విలువైన వస్తువును కాజేశారు.

హైదరాబాద్: సినీ హీరో విశ్వక్ సేన్ ఇంట్లో దొంగతనం(Robbery in Vishwak Sen House) టాలీవుడ్(Tollywood)ను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. ఇవాళ (సోమవారం) తెల్లవారుజామున గుర్తుతెలియని దుండగులు విశ్వక్ సేన్ ఇంట్లోకి ప్రవేశించి రూ.2 లక్షల విలువైన డైమండ్ రింగ్(Diamond Ring) చోరీ చేశారు. ఘటనపై యంగ్ హీరో తండ్రి రాజు(Vishwak Sen Father Raju) పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుర్తుతెలియని వ్యక్తి తెల్లవారుజాము సమయంలో తమ ఇంటి ఎదుట బైక్ పార్క్ చేసినట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో రాజు పేర్కొన్నారు.
అయితే డైమండ్ రింగ్ పోయిన విషయాన్ని తాము ఆలస్యంగా గుర్తించామని తెలిపారు. నిందితులను పట్టుకుని తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా, ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విశ్వక్ సేన్ ఇంటికి చేరుకున్నారు. క్లూస్ టీమ్‌ను రంగంలోకి దింపి వేలిముద్రలు సేకరిస్తున్నారు. అలాగే సీసీ ఫుటేజ్‌ను సైతం పరిశీలిస్తున్నారు. మరోవైపు తెలిసిన వ్యక్తులే దొంగతనానికి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు. అయితే తన అభిమాన హీరో విశ్వక్ సేన్ ఇంట్లో దొంగలు పడడంపై అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఎంపీ ఇంట్లోనూ..
కాగా, బీజేపీ ఎంపీ డీకే అరుణ ఇంట్లోకి సైతం శనివారం అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగుడు ప్రవేశించాడు. శనివారం తెల్లవారుజామున 03:30 గంటల సమయంలో ముసుగు, గ్లౌజులు ధరించిన దుండగుడు.. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఎంపీకి ఇంట్లోకి ప్రవేశించాడు. వంటగది కిటికీ నుంచి ప్రవేశించిన కేటుగాడు.. ముందుగా కిచెన్, హాలులోని సీసీటీవీ కెమెరాలను ఆఫ్ చేశాడు. అనంతరం అన్ని గదులు తిరుగుతూ దాదాపు గంటన్నరపాటు ఇంట్లోనే ఉన్నాడు. అన్ని డ్రాలు, అల్మారాలు తెరిచి వస్తువులు బయటికి విసిరేశాడు. చివరికి ఏమీ దొంగిలించకుండానే వెళ్లిపోయాడు. ఉదయాన్నే పరిస్థితి గమనించిన పనివాళ్లు ఎంపీకి సమాచారం అందించారు. కాగా, తనకు సెక్యూరిటీ పెంచాలంటూ సీఎం రేవంత్ రెడ్డికి ఎంపీ అరుణ విజ్ఞప్తి చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Robin Hood Movie Team: పుష్ప-3పై ఇంట్రెస్టింగ్ అప్టేట్ ఇచ్చిన రాబిన్ హుడ్ నిర్మాత రవిశంకర్..
Namrata Shirodkar: మహేశ్ బాబు ఫౌండేషన్ ద్వారా గుండె ఆపరేషన్లు మరింత విస్తృతం: నమ్రత