ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

క్షయ వల్ల పిల్లలు పుట్టరా?

ABN, Publish Date - Mar 13 , 2025 | 12:26 AM

క్షయవ్యాధితో దెబ్బ తినేది ఊపిరితిత్తులే కావచ్చు. కానీ, సత్వరమే చికిత్స తీసుకోకపోతే, ఆ బ్యాక్టీరియా రక్తం ద్వారా శరీరమంతా వ్యాపించి, మూత్రపిండాలు, గర్భసంచి, మెదడు కూడ దెబ్బ తినవచ్చు. వ్యాధి కారణంగా స్త్రీ, పురుషులు....

కౌన్సెలింగ్‌

డాక్టర్‌! మాకు పెళ్లై ఐదేళ్లు. గత మూడేళ్లుగా క్షయ వ్యాధితో బాధపడుతున్నాను. ఈ వ్యాధి సోకిన వాళ్లకు పిల్లలు కలగరని విన్నాను. ఇది ఎంత వరకూ నిజం?

ఓ సోదరి, హైదరాబాద్‌.

క్షయవ్యాధితో దెబ్బ తినేది ఊపిరితిత్తులే కావచ్చు. కానీ, సత్వరమే చికిత్స తీసుకోకపోతే, ఆ బ్యాక్టీరియా రక్తం ద్వారా శరీరమంతా వ్యాపించి, మూత్రపిండాలు, గర్భసంచి, మెదడు కూడ దెబ్బ తినవచ్చు. వ్యాధి కారణంగా స్త్రీ, పురుషులు ఇద్దర్లోనూ సంతాన శక్తి తగ్గిపోవచ్చు. స్త్రీలల్లో క్షయ వ్యాధి గర్భసంచికి సోకినప్పుడు పిండం సరిగా ఏర్పడదు. మగవారిలో వీర్యకణం అండంలోకి ప్రవేశించేంత శక్తివంతంగా ఉండదు. ఈ వ్యాధి లక్షణాలు అంత త్వరగా బయటపడకపోయినా దాని ప్రభావం మాత్రం సంతానోత్పత్తి పైన పడుతుంది.

  • ఎంతో నిదానంగా వ్యాపించే ఈ వ్యాధితో స్త్రీలల్లో రుతుక్రమం తప్పడం, కలయిక సమయంలో నొప్పి కలగడం వంటి ఇబ్బందులు మొదలవుతాయి. మగవారిలో వీర్యకణాల కదలికలు తగ్గడం, హార్మోన్లు సరిగా విడుదల కాకపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. కొందరిలో మంట, దురద ఏర్పడి, అంగస్తంభనకు అంతరాయం ఏర్పడుతుంది.

  • ఒకసారి క్షయ వ్యాధి సోకిన చాలా మంది స్త్రీలు ఇక తల్లిని కాగలనో లేదోనని ఆందోళనపడుతుంటారు. కానీ, లక్షణాలు బయల్పడిన వెంటనే వైద్యులను కలిసి, సరైన చికిత్స తీసుకుంటే గర్భధారణ సాధ్యపడుతుంది. ప్రసవంతో క్షయవ్యాధి బిడ్డకు సంక్రమిస్తుందేమోనని భయపడి, కొందరు తల్లులు బిడ్డకు పాలివ్వడం మానేస్తారు. నిజానికి, క్షయ అనేది తల్లిపాల వల్ల కాదు, తల్లి శ్వాస వ ల్ల వస్తుంది. అందువల్ల ముఖానికి మాస్క్‌ వేసుకుని, నిస్సంకోచంగా బిడ్డకు పాలివ్వవచ్చు.


  • సాధారణంగా సరైన పోషకాహారం తీసుకోనివాళ్లు, వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోయి క్షయ వ్యాఽధికి గురవుతుంటారు. అందువల్ల చికిత్స సమయంలో మందులే సమస్తం అనుకోకుండా, మద్యం, మాంసం, తీపి పదార్థాలు మానేసి, ఐరన్‌, విటమిన్‌- డి అధికంగా ఉండే ఆహార పదార్థాలు విరివిగా తీసుకోవాలి. సరైన పోషకాలు శరీరానికి అందకపోతే, మందులేవీ పనిచేయక శరీరం మరికొన్ని ఇతర ఇన్‌ఫెక్షన్ల బారిన పడవచ్చు. దానివల్ల వ్యాధి నుంచి పూర్తిగా కోలుకోడానికి మరింత సమయం పట్టవచ్చు.

డాక్టర్‌ స్వాతి మోతె,

గైనకాలజిస్ట్‌ అండ్‌ ఐ.వి.ఎఫ్‌ నిపుణురాలు,

హైదరాబాద్‌.

ఈ వార్తలు కూడా చదవండి:

Vijaysai Reddy: ముగిసిన విజయసాయిరెడ్డి సీఐడీ విచారణ.. సంచలన విషయాలు వెల్లడి..

journalist Revathi: మహిళా జర్నలిస్టుకు 14 రోజుల రిమాండ్.. సంచలనం రేపుతున్న ఘటన..

Updated Date - Mar 13 , 2025 | 12:26 AM