ఇంటి పనీ వర్కవుట్ అవుతుంది
ABN, Publish Date - Jul 02 , 2025 | 03:48 AM
మనం ఇంట్లో రకరకాల పనులు చేస్తూ ఉంటాం. ప్రతి పనికీ కొన్ని క్యాలరీలు ఖర్చవుతూ ఉంటాయి. రోజూ శ్రద్దగా ఇంటి పనులు చేస్తూ సులువుగా బరువు తగ్గవచ్చు అంటున్నారు...
మనం ఇంట్లో రకరకాల పనులు చేస్తూ ఉంటాం. ప్రతి పనికీ కొన్ని క్యాలరీలు ఖర్చవుతూ ఉంటాయి. రోజూ శ్రద్దగా ఇంటి పనులు చేస్తూ సులువుగా బరువు తగ్గవచ్చు అంటున్నారు నిపుణులు. ఆ వివరాలు...
పనులన్నింటిలోకి సులువైనది ఇల్లు ఊడవడం. కొద్దిగా వంగి మెల్లగా నడుస్తూ చీపురుతో ఇల్లు ఊడవడం అలాగే తడిగుడ్డతో ఇల్లు, ఫర్నిచర్ తుడవడం వల్ల తెలియకుండానే శారీరక శ్రమ చేసినట్లవుతుంది. తేలికపాటి వ్యాయామం చేసిన ఫలితం దక్కుతుంది.
నిలబడి వంట చేయడం, కూరగాయలు తరగడం, వంట సామాగ్రి కోసం అటూ ఇటూ తిరగడం వల్ల కూడా అధికంగానే క్యాలరీలు ఖర్చవుతాయి. వంట పాత్రలను రుద్ది కడిగినా శరీరం శ్రమ పడుతుంది. ఈ పనులన్నీ బరువు తగ్గడానికి తోడ్పడతాయి.
ఇంట్లో పంపు కింద బకెట్లో నీళ్లు పట్టి బట్టలు నానబెట్టి ఉతికితే శరీరానికి వ్యాయామం చేసినట్లే అవుతుంది. నేలమీద పీటపై కూర్చుని వంగి బట్టలకు సబ్బురాసి బ్రష్‌తో రుద్దుతూ ఉతకడం వల్ల వెన్నెముక, నడుము భాగాలకు శ్రమ కలుగుతుంది. బట్టలను నీళ్లలో ముంచి తీయడం, వాటినుంచి నీళ్లను పిండడం, నిటారుగా నిలబడి బట్టలు ఆరేయడం వల్ల అధికంగా క్యాలరీలు ఖర్చవుతాయి.
నిలబడి దుస్తులు ఇస్త్రీ చేయడం కూడా మంచి వర్కౌటే. దీనివల్ల కళ్లు, చేతులు, మెడ భాగాలకు పని పెరిగి శక్తి వినియోగమవుతుంది.
తోటపని చేయడం వల్ల కూడా క్యాలరీలు ఖర్చవుతాయి.
ఇవి కూడా చదవండి:
వైఎస్ జగన్‌కు సోమిరెడ్డి వార్నింగ్
బీఆర్ఎస్ పునరుజ్జీవనం కోసం తాపత్రయపడుతోంది: సీఎం రేవంత్ రెడ్డి..
సినీ నటి పాకీజాకు పవన్ కల్యాణ్ ఆర్థిక సాయం
For More AP News and Telugu News
Updated Date - Jul 02 , 2025 | 03:48 AM