ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Bridging Science and Spirituality సైన్స్‌, ఆధ్యాత్మికత

ABN, Publish Date - Dec 26 , 2025 | 06:23 AM

సైన్స్‌ ఆధ్యాత్మికత ఈ రెండింటి మధ్య ఎలాంటి సంబంధం ఉంది? కొన్ని శతాబ్దాలుగా ఈ ప్రశ్నపై చర్చ జరుగుతూనే ఉంది. చాలామంది ఈ రెండూ ...

సైన్స్‌- ఆధ్యాత్మికత ఈ రెండింటి మధ్య ఎలాంటి సంబంధం ఉంది? కొన్ని శతాబ్దాలుగా ఈ ప్రశ్నపై చర్చ జరుగుతూనే ఉంది. చాలామంది ఈ రెండూ పూర్తి విరుద్ధమైన భావనలని అనుకుంటూ ఉంటారు. ఈ భావనలకు మద్దతు ఇచ్చే వారి మధ్య వాడి వేడి చర్చలు జరగడం కూడా మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. ఒక కార్డియాలజి్‌స్టగా- గుండె పనితీరు, శరీరంలోని వివిధ భాగాలతో దానికి ఉన్న సంక్లిష్టమైన సంబంధం గురించి నాకు తెలుసు. అదే సమయంలో ‘హార్ట్‌ఫుల్‌నెస్‌’ అభ్యాసిగా మానవ గమనంలో ఆధ్యాత్మిక ప్రయాణం ఎలా సాగుతుందో కూడా తెలుసు.

మన చుట్టూ ఉన్న ప్రకృతి గురించి, దాని వెనకున్న లాజిక్‌ గురించి తెలుసుకోవడానికి సైన్స్‌ ప్రయత్నిస్తుంది. ఆ లాజిక్‌ ఆధారంగా కొన్ని సిద్ధాంతాలను ప్రతిపాదిస్తుంది. ఆ సిద్ధాంతాలు అందరి విషయంలోనూ నిజమైనప్పుడే మాత్రమే వాటిని సైన్స్‌ గుర్తిస్తుంది. అయితే ప్రముఖ శాస్త్రవేత్త ఐన్‌స్టీన్‌ అన్నట్లు- ‘‘లాజిక్‌ మనల్ని ‘ఏ’ నుంచి ‘బి’ వరకూ తీసుకువెళుతుంది. కానీ మనలోని ఊహా... ప్రపంచంలో ఎక్కడికైనా తీసుకువెళ్తుంది’’. ఆకాశంలో పక్షులు ఎగురుతున్నప్పుడు- అవి ఎలా ఎగురుతున్నాయో తెలుసుకోవడం ద్వారా మానవుడు విమానాలు కనిపెట్టగలిగాడు. అంటే పక్షులు ఎలా ఎగరగలుగుతున్నాయో తెలుసుకోవడం సైన్స్‌. దీని వెనుక పరిశీలన ఉంది. ఊహా శక్తి ఉంది.. ఆ పనిని పక్షులు పదే పదే చేస్తున్నాయి కాబట్టి మనం కూడా చేయవచ్చనే ఆశావాహ ఽఽధక్పఽథం ఉంది.

ప్రధాన వైరుధ్యం అదే...

వీటన్నింటిలోను ముఖ్యమైనది పరిశీలన. సైన్స్‌ ఈ పరిశీలన నుంచే పుడుతుంది. అక్కడే ఆగిపోతుంది. ఈ పరిశీలన మన ఇంద్రియాల వల్ల జరుగుతుంది. ఇప్పుడు ఆధ్యాత్మికతను కూడా ఈ దృష్టి నుంచే పరిశీలిద్దాం. మనమందరం ఏదో ఒక మతంలో పుట్టి ఉంటాం. ఆ మతానికి చెందిన ఆచార వ్యవహారాలను పాటిస్తూ ఉంటాం. అయితే సైన్స్‌ కోణం నుంచి చూసినప్పుడు - చాలా ఆచార వ్యవహారాలను పాటించడానికి వెనుక ఉన్న కారణాలు మనకు తెలీదు. వాటి వల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయో కూడా తెలీదు. సైన్స్‌కు, ఆధ్యాత్మికతకు వచ్చే ప్రధానమైన వైరుద్ధ్యం ఇదే! దీనివల్లే చాలామంది సైన్స్‌, ఆధ్యాత్మికతల మధ్య తేడా ఉందనుకుంటారు. అవి వేరు వేరనే భావన కలుగుతుంది.

రెండూ ముఖ్యమే...

నాకు కూడా గతంలో ఈ తరహా ఆలోచనలే ఉండేవి. నేను మా మాస్టర్‌, ‘హార్డ్‌ఫుల్‌నెస్‌’ గ్లోబల్‌ గైడ్‌ కమలేష్‌ జి. పాటిల్‌ను కలిసినప్పుడు- ధ్యానం ద్వారా ఆధ్యాత్మికత అనేది ఒక సైన్స్‌ ప్రయోగం లాంటిదని ఆయన చెప్పారు. సైన్స్‌ ప్రయోగాలు ల్యాబ్‌లలో జరుగుతాయి. ఈ ఆధ్యాత్మిక ప్రయోగాలు మన హృదయం మీద మనకు మనం చేసుకొనేవి... అదే తేడా! ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి. సైన్స్‌కు సంబంధించిన పరిశీలన పద్ధతులు, విశ్లేషణలు, పరిశోధనలను ఆధ్యాత్మికత మార్గంలో ప్రయోగించడం వల్ల ఫలితం ఉండదు. ఎందుకంటే బాహ్య ప్రపంచంలో మన చుట్టూ జరిగే క్రియలను మన ఇంద్రియాలు పసిగడుతూ ఉంటాయి. అదే ఒక

వ్యక్తి అంతర్ముఖుడైనప్పుడు జరిగే ప్రయాణం వేరుగా ఉంటుంది. ఈ ప్రయాణాన్ని మన ఇంద్రియాలు పూర్తిగా పసిగట్టలేవు. అది కేవలం అనుభవైకవేద్యం మాత్రమే. ఈ అంతర్ముఖ ప్రయాణం ప్రారంభమై, అది కొనసాగుతున్నప్పుడు- మనలోని సందేహాలు, అపోహలు, అనుమానాలు... అన్నీ తొలగిపోతాయి. స్పష్టత వస్తుంది. అంటే ఆధ్యాత్మికతలో ఆలోచన వల్ల పరిశీలన ప్రారంభమవుతుంది. సైన్స్‌లో పరిశీలన వల్ల లాజిక్‌ ఉత్తేజితమవుతుంది. ఒక వ్యక్తికి ఈ రెండూ తప్పనిసరిగా ఉండాలి. లేకపోతే తీవ్రమైన పరిణామాలు ఏర్పడతాయి. ఉదాహరణకు గ్లిజరిల్‌ ట్రైనైట్రేట్‌ (జీటీఎన్‌)ని హృద్రోగుల్లో నొప్పిని తగ్గించడానికి వాడతాం. కానీ దాన్ని పేలుడు పదార్థాలలో కూడా వాడతారు. దేనికి వాడాలో నిర్ధారించాల్సి వచ్చినప్పుడు లాజిక్‌ కన్నా అంతర్ముఖులమైనప్పుడు కలిగే స్పష్టత ముఖ్యం. అప్పుడే మానవాళికి మేలు చేసే విషయాలలో మాత్రమే దాన్ని వాడగలుగుతాం. మనకు సైన్స్‌, ఆధ్యాత్మికత- రెండూ ముఖ్యమే! ఆధ్యాత్మికంగా ఎదిగిన వ్యక్తి దగ్గర సైన్స్‌ ఉంటే... అది మానవాళికి ఎంతో ఉపయోగపడుతుంది.

Updated Date - Dec 26 , 2025 | 06:23 AM