Stress Management: ఒత్తిడిని చిత్తు చేసేలా
ABN, Publish Date - Jul 17 , 2025 | 05:07 AM
ఒత్తిడి కారణంగా జీర్ణసంబంధ వ్యాధి, ఐబిడికి గురైన అనుజా.. స్ట్రెస్ స్ట్రాటజిస్ట్‌గా మారి ఎంతో మందికి ఒత్తిడిని దూరం చేస్తున్నారు. ఆ ప్రయాణం ఆమె మాటల్లోనే...
వినూత్నం
కొన్ని సంఘటనలు జీవితాన్ని అనుకోని మలుపులు తిప్పుతాయి. ఆ పరిస్థితులకు కొందరు కుంగిపోతే.. మరికొందరు ధైర్యంగా ఎదుర్కొని ఇతరులకు మార్గదర్శులుగా మారతారు. అలాంటి వ్యక్తే మహారాష్ట్రకు చెందిన ఫిజియోథెరపిస్ట్, అనుజా లునియా.
ఒత్తిడి కారణంగా జీర్ణసంబంధ వ్యాధి, ఐబిడికి గురైన అనుజా.. స్ట్రెస్ స్ట్రాటజిస్ట్‌గా మారి ఎంతో మందికి ఒత్తిడిని దూరం చేస్తున్నారు. ఆ ప్రయాణం ఆమె మాటల్లోనే...
‘‘మాది మహారాష్ట్రలోని థానే ! అమ్మానాన్న ఇద్దరూ డాక్టర్లు. వాళ్లను చూస్తూ పెరగడం వలన నేనూ డాక్టర్‌ను అవ్వాలనుకున్నా! అనుకున్నట్లే ఫిజియోథెరపి్‌స్టను అయ్యాను. సంతోషంగా వృత్తి జీవితం ప్రారంభించాను. అంతా ఆనందంగా సాగిపోతున్న సమయంలో జీవితం అనుకోని మలుపు తిరిగింది. ఇన్‌ఫ్లమేటరీ బోవెల్ డిసీజ్(ఐబిడి) బారిన పడ్డాను. ఎన్నో మందులు వాడాను. కానీ వాటి ఫలితం తాత్కాలికమే! జీవనశైలి మారితేనే ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుందని అనిపించింది. ఈ ఆలోచనకు కార్యరూపం ఇవ్వడంతో పరిస్థితిలో మార్పు కనిపించింది. దాంతో ఓవైపు ఆరోగ్యాన్ని కాపాడుకుంటూనే మరోపక్క కెరీర్ మీద దృష్టి సారించా. మళ్లీ జీవితం సాధారణ స్థితికి వచ్చింది. కొత్త జీవితం మొదలైనట్టు అనిపించింది. కానీ ఆ సంతోషం ఎన్నో రోజులు నిలవలేదు. కొన్నాళ్లకే ఐబీడీ తిరబెట్టింది. ఏమీ తినకలేక పోయేదాన్ని. తీవ్రమైన కడుపు నొప్పి, నీరసంతో బాధపడ్డాను. దాదాపు 16 కిలోల బరువు కోల్పోయాను. యోగా, ధ్యానం ప్రయత్నించినా కోలుకోలేకపోయా! అప్పుడే ఈ సమస్యకు ప్రధాన కారణం ఒత్తిడేనని గుర్తించాను. ఎంతో పరిశోధన చేసి ఒత్తిడిని తగ్గించుకునేందుకు ఓ ప్రణాళికను సిద్ధం చేసుకుని పాటించాను. ఆ సమయంలో మా అమ్మానాన్నలు కొండంత అండగా నిలిచారు. దాంతో ఒత్తిడిని, నా అనారోగ్యాన్ని కూడా జయించగలిగాను.
ఒత్తిడితో చాలా ప్రమాదం
ఈ రోజుల్లో ఒత్తిడి ఓ సాధారణ సమస్యగా మారిపోయింది. కానీ ఒత్తిడి.. మధుమేహం, హైపర్ టెన్షన్, పీసీఔస్ వంటి అనేక అనేక రోగాలకు మూలం. నాడీ వ్యవస్థను ఒత్తిడి తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. మా అమ్మానాన్నలు వైద్య వృత్తిలో ఉండడం వలన ఒత్తిడి నియంత్రణలో ఎంతో సహకారం అందించారు. కానీ అందరికీ అలాంటి పరిస్థితులు ఉండవు. అందుకే నాలా ఒత్తిడి వల్ల ఎవరూ ఇబ్బంది పడకూడదని ‘రిలాక్స్... ప్లే... థ్రైవ్’ అనే పుస్తకం రాశాను. ఇందులో ఒత్తిడిని నియంత్రించడానికి యాక్టివిటీస్, పజిల్స్ వంటివి ఉంటాయి. అలాగే ఇందులోని క్యూఆర్ కోడ్‌ల ద్వారా గైడెడ్ ఆడియో, వీడియో కంటెంట్ అందుబాటులో ఉంటుంది. ఒత్తిడి వ్యక్తిగత సమస్య మాత్రమే కాదు సామాజిక సమస్య. మన దేశంలో 77 శాతం జనాభా ఒత్తిడితో బాధపడుతోంది. అందుకే ఒత్తిడి నియంత్రణపై అనేక వర్క్‌షా్‌పలు నిర్వహిస్తున్నా! కొవిడ్ సమయంలో కార్పోరేట్ కంపెనీల్లో వర్క్‌షా్‌పలు నిర్వహించా! ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 125 పైగా వర్క్‌షా్‌పలు నిర్వహించాను. భారత దేశాన్ని ప్రపంచంలోనే ఒత్తిడి తక్కువ ఉన్న దేశంగా మార్చాలన్నదే నా లక్ష్యం.’’
ఒత్తిడి వ్యక్తిగత సమస్య మాత్రమే కాదు సామాజిక సమస్య. మన దేశంలో 77 శాతం జనాభా ఒత్తిడితో బాధపడుతోంది. అందుకే ఒత్తిడి నియంత్రణపై అనేక వర్క్‌షా్‌పలు నిర్వహిస్తున్నా! ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 125 పైగా వర్క్‌షా్‌పలు నిర్వహించాను. భారత దేశాన్ని ప్రపంచంలోనే ఒత్తిడి తక్కువ ఉన్న దేశంగా మార్చాలన్నదే నా లక్ష్యం.’’
ఈ వార్తలు కూడా చదవండి..
ముగిసిన సీఎంల భేటీ.. మంత్రి నిమ్మల కీలక వ్యాఖ్యలు
సీఆర్ పాటిల్ అధ్యక్షతన సమావేశం.. హాజరైన తెలుగు రాష్ట్రాల సీఎంలు
Read Latest AP News And Telugu News
Updated Date - Jul 17 , 2025 | 05:07 AM