ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Anju Modi Interview: ఆ దుస్తులకే ప్రాధాన్యం ఎక్కువ

ABN, Publish Date - Nov 16 , 2025 | 05:57 AM

మన దేశంలోని ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్లలో అంజూ మోడీ ఒకరు. ‘సైరా నరసింహారెడ్డి, రామ్‌లీల, బాజీరావు మస్తానీ’ వంటి హిట్‌ చిత్రాలకు కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా పని చేసిన ఆమె... ఫ్యాషన్‌ ప్రపంచంలో...

మన దేశంలోని ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్లలో అంజూ మోడీ ఒకరు. ‘సైరా నరసింహారెడ్డి, రామ్‌లీల, బాజీరావు మస్తానీ’ వంటి హిట్‌ చిత్రాలకు కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా పని చేసిన ఆమె... ఫ్యాషన్‌ ప్రపంచంలో వస్తున్న మార్పుల గురించి తన అభిప్రాయాలను ‘నవ్య’తో పంచుకున్నారు.

ప్రస్తుతం మన దేశ ఫ్యాషన్‌ రంగంలో ఎలాంటి మార్పులు వస్తున్నాయి?

ఫ్యాషన్‌ రంగం చాలా వేగంగా మారిపోతోంది. కొత్త తరం... ఇండో-వెస్ట్రన్‌ లుక్‌లకు ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తోంది. దీనికి కూడా ఒక కారణం ఉంది. ప్రస్తుత తరం అమ్మాయిలలో చాలామందికి చీరలు ఎలా కట్టుకోవాలో తెలియదు. దాంతో వారు రెడీమేడ్‌ చీరల వైపు మొగ్గు చూపుతున్నారు. అలాగే... సంప్రదాయానికి ఆధునికతను మేళవించి కొత్త కొత్త డిజైన్లు అందుబాటులోకి వస్తున్నాయి. ఇక నా విషయానికి వస్తే, నేను జైపోర్‌ బ్రాండ్‌తో కలిసి డిజైన్‌ చేస్తున్నా. వారు మార్కెటింగ్‌, ప్రొడక్షన్‌ చూసుకుంటారు. నేను పరిశోధనలు, డిజైనింగ్‌ విభాగాలు చూసుకుంటున్నాను. దీనివల్ల ఒక పెద్ద ప్రయోజనం ఉంది. నేను డిజైన్‌ చేసిన బట్టలు సమాజంలో అన్ని వర్గాలవారికీ చేరతాయి. ఫలితంగా వస్త్రశ్రేణులకు డిమాండ్‌ పెరుగుతుంది. డిమాండ్‌ పెరిగితే నేత పనివారికి మరింత ఉపాధి దొరుకుతుంది. నేసే ప్రతి వస్త్రానికీ ఒక ఆత్మ ఉంటుంది. అది డిజైనింగ్‌ రూపంలో అందరికీ కనిపిస్తూ ఉంటుంది. అందువల్ల మనం ధరించే బట్టలు మన ఆత్మను ప్రతిబింబిస్తాయి.

రోజూ ఆఫీసులకు వెళ్లే అమ్మాయిలకు ఎలాంటి దుస్తులు నప్పుతాయి?

గతంతో పోలిస్తే ఇప్పుడు ఆఫీసుల్లో పని చేసే అమ్మాయిల సంఖ్య గణనీయంగా పెరిగింది. వారు వేసుకొనే బట్టలు అందంగా ఉండాలి. అదే సమయంలో సౌకర్యవంతంగా కూడా ఉండాలి. వారి కదిలికలకు అడ్డుపడకూడదు. ఉదాహరణకు చాలామంది మధ్యతరగతి మహిళలు ఆఫీసులకు బస్సు, బైక్‌ల మీద వెళుతుంటారు. అలాంటివారు చురుకుగా కదలాలి. వారు వేసుకొనే దుస్తులు ఆ కదలికలకు తగినట్లుగా ఉండాలి. దాంతోపాటుగా ఆధునికత కూడా ప్రతిబింబించాలి. అందుకే ఈమధ్య ఎక్కువమంది షార్ట్‌ కుర్తీలు, ట్రౌజర్లు, స్కార్ఫ్స్‌ల వంటివి ధరిస్తున్నారు. ఇక పండగలు వస్తే సంప్రదాయబద్దమైన లెహంగాలు, చీరలు కట్టుకుంటున్నారు.

మీరు టాలీవుడ్‌, బాలీవుడ్‌లలో చాలా సినిమాలకు డిజైనర్‌గా పని చేశారు. మీకు బాగా నచ్చిన నటి ఎవరు?

సినిమాలో... పాత్రలు, సన్నివేశాల ఆధారంగా దుస్తులను డిజైన్‌ చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు ‘రామ్‌లీల’ తీసుకుందాం. అందులో దీపిక ఒక అందమైన చలాకీ అమ్మాయిగా నటించింది. ఆమెలో అణువణువూ ఉత్సాహం ఉంటుంది. ఆమెకు డిజైన్‌ చేసే సమయంలో... ఆ పాత్ర ఎలాంటి దుస్తులు ధరిస్తుందనే ఆలోచనే ఉంటుంది. ‘బాజీరావ్‌ మస్తానీ’ చిత్రంలో దీపిక మస్తానీగా నటించింది. ఈ సినిమాలో ఆమె పర్షియాకు చెందిన ఒక ముస్లిం మహిళ. అందువల్ల ఆమెకు డిజైన్‌ చేసే దుస్తులు కూడా ఆమె పుట్టి పెరిగిన సంస్కృతిని ప్రతిబింబించేలా ఉండాలి. అవి కథలో సహజంగా అమరిపోవాలి.

‘సైరా నరసింహారెడ్డి’ చిత్రానికి డిజైన్‌ చేసినప్పుడు మీ అనుభవాలు చెప్పండి..?

బ్రిటిష్‌ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసిన ఒక రాజు కథ ఇది. ఆ చిత్రంలో నేను... అమితాబ్‌, చిరంజీవి, నయనతార, తమన్నాలకు డిజైనింగ్‌ చేశాను. దీనిలో అమితాబ్‌ గురు వెంకన్న పాత్ర చేశారు. 18వ శతాబ్దంలో రాజ గురువులు ఎలాంటి దుస్తులు ధరించేవారనే విషయంపై పరిశోధన చేసి శాలువాలు మొదలైన వాటితో దుస్తులు డిజైన్‌ చేశాను. ఇక నయనతారకు నేను డిజైన్‌ చేసిన డ్రస్సు అత్యంత క్లిష్టమైనది. నా పరిశోధనలలో ఆ సమయంలో కొందరు అమ్మాయిలు చీరను మామూలుగా కట్టుకోకుండా భిన్నంగా కట్టుకొనేవారిని తేలింది. అది మరాఠివారు కట్టుకొనే పద్ధతికి భిన్నమైనది. మరాఠీ పద్ధతిలో చీర కట్టి, ఎడమ చేతి మీదకు కొంగు వచ్చేలా చేస్తారు. షూటింగ్‌ సమయంలో ఆ చీర కట్టడానికి నాలుగు గంటలు పట్టేది. కానీ ఆ చీరకట్టు చాలా అందంగా వచ్చింది.

మీరు డిజైన్‌ చేసేటప్పుడు దక్షిణ భారతం... ఉత్తర భారత దేశానికి చెందిన వ్యక్తులనే విషయం స్పురణకు వస్తుందా?

లేదు. నాకు కేవలం పాత్రలు మాత్రమే గుర్తుంటాయి. నేను కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు తిరిగాను. అనేకమంది చేనేత కార్మికులను కలిశాను. 24 రకాల చేనేత నైపుణ్యాలను గమనించాను. ఇవన్నీ మనకు ఉన్న వారసత్వ సంపద. దీనిలో ఉత్తర భారతదేశం... దక్షిణ భారత దేశం అనే తేడానే లేదు. ఉదాహరణకు నేను నా దుస్తుల డిజైనింగ్‌లో వెంకటగిరి, గద్వాల్‌, నారాయణపేట... ఇలా పలు రకాల చేనేతలు ఉపయోగిస్తూ ఉంటాను.

‘సైరా నరసింహారెడ్డి’లో చిరంజీవి చాలా క్లిష్టమైన పాత్రను అద్భుతంగా పోషించారు. ఆయన చాలా ఆలోచనాపరుడు. ఒక విషయాన్ని అనేక కోణాల నుంచి ఆలోచిస్తారు.

గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. దేశంలోనే అగ్రనటుల్లో ఒకరైనా... కించిత్తు గర్వం కూడా ఉండదు. ఆయనకు దుస్తులు డిజైన్‌ చేయటం ఒక మరపురాని అనుభవం.

అబ్బాయిలకు అమ్మాయిలకు ఉన్నన్ని రకాల డిజైన్లు ఉండవు. ఈ విషయంలో వారు దురదృష్టవంతులనే చెప్పాలి. ఇంట్లో కూడా అమ్మాయిల బట్టలు పెట్టుకోవటానికి పది అల్మారాలు ఉంటే.. అబ్బాయిలకు ఒక అల్మారా ఉంటుంది. మామూలు రోజుల్లో ట్రౌజర్స్‌, షర్ట్స్‌ వేసుకుంటే... ప్రత్యేక సందర్భాల్లో సూట్స్‌ తప్ప వారికి ప్రత్యామ్నాయాలు ఏమీ ఉండవు. నాలుగు షర్టులు, నాలుగు ట్రౌజర్స్‌ ఉంటే చాలనే ఆలోచనా ధోరణే ఉంటుంది. పండగల్లో కుర్తాలు, బంద్‌గాలాల లాంటివి మాత్రమే ఉంటాయి. ఈ మధ్య అబ్బాయిలు కూడా పింక్‌ లాంటి రంగుల షర్టులు ధరిస్తున్నారు. ఇది ఒక మార్పు అనే చెప్పాలి.

ఇవి కూడా చదవండి..

బిహార్ గెలుపును సాకారం చేసిన MY ఫార్ములా

ఓటమితో విచారం, విజయంతో అహంకారం ఉండదు.. తొలిసారి స్పందించిన ఆర్జేడీ

మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి.

Updated Date - Nov 16 , 2025 | 05:57 AM