ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Uthana Ekadashi: కార్తికం... ఇద్దరికీ ఇష్టమే

ABN, Publish Date - Oct 31 , 2025 | 04:51 AM

ఎప్పటినుంచో ఒక మాట ప్రసిద్ధిలోకి వచ్చింది... శివుడికి ఇష్టమైన మాసం కార్తికం, విష్ణువుకు ప్రీతికరమైనది మార్గశిరం అని.పైపై దృష్టితో చూసేవాళ్ళు అన్న మాటలు ఇవి.వాస్తవానికి ఇది శివకేశవులు ఇద్దరికీ సంబంధించిన మాసం. ఎందుకంటే వారిద్దరికీ ఎలాంటి భేదం లేదు, ఉండదు.....

ఎప్పటినుంచో ఒక మాట ప్రసిద్ధిలోకి వచ్చింది... శివుడికి ఇష్టమైన మాసం కార్తికం, విష్ణువుకు ప్రీతికరమైనది మార్గశిరం అని.పైపై దృష్టితో చూసేవాళ్ళు అన్న మాటలు ఇవి.వాస్తవానికి ఇది శివకేశవులు ఇద్దరికీ సంబంధించిన మాసం. ఎందుకంటే వారిద్దరికీ ఎలాంటి భేదం లేదు, ఉండదు.

కార్తిక మాసంలో మొట్టమొదటి రోజున ‘గోక్రీడనం’ అనే ఉత్సవం జరుగుతుంది. ఆ రోజున యజమానులు తమ ఆవులను ఏ చెరువు దగ్గరకో తీసుకువెళ్తారు. ఎండుగడ్డితో వాటిని చక్కగా తోమి, స్నానాలు చేయిస్తారు. పసుపు కుంకుమలతో అలంకరించి, మెడలో పూలమాలలు వేసి, పృష్టభాగం మీద కూడా పసుపు కుంకుమలను అద్దుతారు. వాటికి ప్రదక్షిణలు చేస్తారు. శ్రీమహావిష్ణువు కూడా కృష్ణావతారంలో గోపాలకునిగా ఉంటూ... గోవులకు ఎనలేని సేవ చేశాడు. ఒక మడుగును ఆక్రమించుకున్న కాళీయుడు అనే పెను సర్పాన్ని పారద్రోలాడు. ఆ మడుగును గోవుల స్నానపానాదులకు వీలుగా మార్చాడు. అందుకే కార్తిక మాసంలోని ఎనిమిదో రోజున ‘గోష్ఠాష్టమి’ లేదా ‘గోపాష్టమి’ అనే పేరుతో ఉత్సవం నిర్వహిస్తారు. శివునికి ప్రీతిపాత్రమని అనుకొనే ఈ మాసంలో... ఏకాదశి తిథినాడు యోగ నిద్రనుంచి శ్రీహరి మేలుకుంటాడు. ‘ఉత్థాన ఏకాదశి’ ఉత్సవాన్ని చేయించుకుంటాడు. ఆ మరునాడు... ‘క్షీరాబ్ధి ద్వాదశి’ పేరిట తన మామగారి ఇల్లు అయిన పాల సముద్రంలో, శేషునిపై పరుండి... తనవారందరికీ దర్శనం ఇస్తున్నాడు. మరో రెండు రోజుల తరువాత... ‘వైకుంఠ చతుర్దశి’ రోజున... మొత్తం దేవలోకంలోని వారందరికీ తన దర్శనాన్ని అనుగ్రహిస్తున్నాడు.

ఇల్లరికపు అల్లుళ్ళు

శివకేశవులు ఇద్దరూ శంఖాలను ధరిస్తారు (వనమాలీ గదీ శార్ఙ్గీ శంఖీ...), ఒకరు నిరంతరం శరీరం నిండా పాముల్ని ధరించి కనిపిస్తూ ఉంటే, మరొకరు ఆదిశేషుడు అనే పెద్ద సర్పాన్ని శయ్యగా చేసుకొని పవళిస్తూ... అక్కడి నుంచే దర్శనం ఇస్తూ ఉంటాడు. శివుడు తన మామగారి ఇల్లయిన హిమాలయంపై తన నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటే, శ్రీమహాలక్ష్మి పుట్టినిల్లయిన పాలసముద్రాన్ని తన నివాసంగా శ్రీహరి మార్చుకున్నాడు. ఇద్దరూ ఉండేది మామగార్ల ఇళ్ళలోనే... అంటే ఇల్లరికమే! శివుడు ‘పినాకం’ అనే వింటిని ధరిస్తే (పినాకపాణి), శ్రీహరి ‘శార్ఙ్గ’మనే వింటిని (శార్ఙ్గధన్వా) ధరించి ఉంటాడు. శివుడు తన జటాజూటాన్ని పాదాలవరకూ ధరించి ఉంటే... రామావతారంలో శ్రీహరి దండకారణ్యానికి వెళ్ళే సందర్భంలో జటలను పెంచి, చివరి వరకూ అలాగే ఉన్నాడు (చీర అజిన జటాధారీ). శివుడు ఏనుగు చర్మాన్ని రాత్రివేళ, పులి చర్మాన్ని పగటిపూటా ధరిస్తాడు. శ్రీహరి రామావతారంలో పూర్తిగా ముతక నార వస్త్రాలను (వసనం చర్మ చ) ధరించాడు. శివుడు తన అర్ధ భాగాన్ని భార్యకు ఇచ్చి ‘అర్ధనారీశ్వరుడు’ అని అనిపించుకంటే, శ్రీహరి తన వక్షస్థలాన్ని లక్ష్మీ దేవికి స్థానంగా ఇచ్చాడు. ఆమె నిరంతరం అక్కడ కూర్చోగా, కూర్చోగా ఆ ప్రదేశంలో ఒక ఆనవాలు ఏర్పడింది అదే ‘శ్రీ-వత్స-అంకం’. అందుకే ఆయనను ‘శ్రీవత్సాంకుడు’ అని కీర్తిస్తారు.

ఒకటే పేరు...

వారు వేరువేరుగా రాక్షసులను వధించారు. ఇద్దరూ కలిసి త్రిపురుడనే రాక్షసుణ్ణి చంపడం కోసం... ఒకరు (శివుడు) ధనువు కాగా, మరొకరు (శ్రీహరి) దానిలో తొడిగే బాణం అయ్యారు. ఆ ఇరువురికీ తోడుగా అగ్నిదేవుడు ఆ బాణం చివర ఉండే ములికిగా మారాడు. అగ్నిదేవుడు వారిద్దరికీ కుడికన్నే కదా! శివకేశవులకు భేదమే ఉన్నట్టయితే... వారిద్దరికీ కలిపి ఒకే పేరు ఉండడం కుదురుతుందా? హరికీ, హరుడికీ కలిపి ఉన్న పేరు ‘వృషాకపి’ (హర విష్ణూ వృషాకపీ). సరే... వారిద్దరూ అన్యోన్యంగా కనిపించవచ్చేమో కానీ... విభేదాలే ఉంటే వారి భార్యలు కలిసి మెలసి ఉండడం సాధ్యమేనా? కాదు కదా! ఆ ఇద్దరికీ (లక్ష్మీ పార్వతులకు) కలిపి ‘వృషకపాయి’ అనే పేరు ఉంది. ఇలా ఇద్దరి మధ్యా ఎన్నో కనిపిస్తాయి. ఇక శివకేశవ భేదం ఎక్కడుంది?

-డాక్టర్‌ మైలవరపు శ్రీనివాసరావు

9866700425

Updated Date - Oct 31 , 2025 | 04:51 AM