ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

మంచి కాలేజీ అయితేనే సరైన ప్లేస్‌మెంట్‌

ABN, Publish Date - Mar 17 , 2025 | 02:05 AM

తెలుగు రాష్ట్రాల్లో ఎంబీఏ లేదా ఎంసీఏ(మాస్టర్‌ ఆఫ్‌ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌/ మాస్టర్‌ ఆఫ్‌ కంప్యూటర్‌ అప్లికేషన్‌) చేయాలంటే ఇంటిగ్రేటెడ్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ రాయాలి. ఈ పరీక్షలో ర్యాంకు సాధిస్తే మంచి కాలేజీలో సీటు...

ఐసెట్‌ ప్రిపరేషన్‌ ప్లాన్‌

తెలుగు రాష్ట్రాల్లో ఎంబీఏ లేదా ఎంసీఏ(మాస్టర్‌ ఆఫ్‌ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌/ మాస్టర్‌ ఆఫ్‌ కంప్యూటర్‌ అప్లికేషన్‌) చేయాలంటే ఇంటిగ్రేటెడ్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ రాయాలి. ఈ పరీక్షలో ర్యాంకు సాధిస్తే మంచి కాలేజీలో సీటు సంపాదించవచ్చు. ఏదో ఒక కాలేజీలో సీటు సులభమే. కానీ ప్లేస్‌మెంట్‌ సరిగ్గా ఉండాలంటే మాత్రం తప్పనిసరిగా మంచి కాలేజీలో చదవాలి. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఐసెట్‌ నోటిఫికేషన్‌ వెలువడింది. ఆంధ్రప్రదేశ్‌లో మే మొదటివారంలో ఎంట్రెన్‌ జరుగుతుండగా, తెలంగాణలో జూన్‌ మొదటి వారంలో నిర్వహిస్తున్నారు. రెండు సెట్‌ల పరీక్షల స్వరూపం ఒక్కటే. మొత్తం ప్రశ్నలు 200 ఉంటాయి. కామన్‌గా మూడు సెక్షన్లు ఉంటాయి. అవి అనలిటికల్‌ ఎబిలిటీ, మేథమెటికల్‌ ఎబిలిటీ, కమ్యూనికేషన్‌ ఎబిలిటీ. కాకపోతే ఒక్కో రాష్ట్రంలో ఈ ప్రశ్నలు ఒకటి ఎక్కువ, ఒకటి తక్కువ ఉండోచ్చు. ఐసెట్‌ ఎంట్రెన్స్‌ రాయాలంటే కనీసం 50 శాతం మార్కులతో గ్రాడ్యుయేన్‌ పూర్తి చేయాలి. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్నవారు కూడా పరీక్ష రాయవచ్చు.


ఎంసీఏలో చేరాలంటే మాత్రం ఇంటర్‌లో మేథ్స్‌ చదివి ఉండాలి. ఐసెట్‌లో 200 ప్రశ్నలకు 150 నిమిషాల్లో సమాధానాలు పూర్తి చేయాలి. అంటే ప్రతీ ప్రశ్నకు 45 సెకన్లు మాత్రమే సమయం ఉంటుందన్నమాట. అనలిటికల్‌, మేథమెటికల్‌ ఎబిలిటీల వంటి సెక్షన్లకు ఈ సమయం సరిపోదు. ఎంత ఎక్కువ ప్రాక్టీసు ఉంటే అంత వేగంగా సమాధానాలు గుర్తించగలుగుతారు. షార్ట్‌కట్‌లు తెలుసుకోవాలి. సమాధానం రాకుంటే సమయం వృథా కాకుండా పరీక్ష చివర్లో ప్రయత్నించాలి. సాధారణంగా 150 నుంచి 170 మధ్య టాప్‌ స్కోర్లు ఉంటాయి. 120 దాటిన వారికి కూడా మంచి కాలేజీల్లో సీట్లు లభించే అవకాశం ఉంటుంది. పలానా కాలేజీలో ఈ స్కోరుకు సీటు పక్కా అని చెప్పడానికి ఉండదు. ప్రతీ సంవత్సరం మారే అవకాశం ఉంటుంది. అందుకే సాధ్యమైనంత మంచి ర్యాంకు తెచ్చుకోవాలి.


నోటిఫికేషన్‌ వివరాలు

  • తెలంగాణ ఇంటిగ్రేటెడ్‌ కామన్‌ ఎంట్రెన్ప్‌ టెస్ట్‌ 2025 (టీజీ ఐసెట్‌) నోటిఫికేషన్‌ విడుదల అయింది. నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ దీనిని నిర్వహిస్తోంది. దరఖాస్తుల దాఖలుకు చివరి తేదీ 2025 మే 3. ప్రవేశ పరీక్ష 2025 జూన్‌ 8, 9వ తేదీన నిర్వహిస్తారు.

  • ఏపీ కామన్‌ ఇంటిగ్రేటెడ్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌(ఏపీఐసెట్‌) కోసం ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈసారి విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ నిర్వహిస్తోంది. 2025 ఏప్రిల్‌ 9 లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రవేశ పరీక్ష 2025 మే 7న జరుగుతుంది.

ఈ వార్తలు కూడా చదవండి:

Diamond Ring Robbery: టాలీవుడ్ హీరోకి షాక్ ఇచ్చిన దొంగలు..

Namrata Shirodkar: మహేశ్ బాబు ఫౌండేషన్ ద్వారా గుండె ఆపరేషన్లు మరింత విస్తృతం: నమ్రత

Updated Date - Mar 17 , 2025 | 02:05 AM