ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

YSRCP Supports CP Radhakrishnan: ఉపరాష్ట్రపతి ఎన్డీయే అభ్యర్థి రాధాకృష్ణన్‌కు వైసీపీ మద్దతు

ABN, Publish Date - Aug 18 , 2025 | 08:59 PM

వైసీపీకి లోక్‌సభలో నలుగురు ఎంపీలు ఉండగా, రాజ్యసభలో ఏడుగురు ఎంపీలున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇటు బీజేపీ సారథ్యంలోని ఎన్డీయేలో కానీ, విపక్ష 'ఇండియా' కూటమిలో కానీ భాగస్వామిగా లేదు.

Jagan Mohan reddy and CP Radhakrishnan

న్యూఢిల్లీ: ఎన్డీయే (NDA) ఉపరాష్ట్రపతి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ (CP Radhakrishnan)కు మద్దతు ఇవ్వాలని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సారథ్యంలోని వైసీపీ(YCP) పార్టీ నిర్ణయం తీసుకుంది. ఆ పార్టీ ఎంపీ మద్దిల గురుమూర్తి ఈ విషయాన్ని ధ్రువీకరించారు.

వైసీపీకి లోక్‌సభలో నలుగురు ఎంపీలు ఉండగా, రాజ్యసభలో ఏడుగురు ఎంపీలున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇటు బీజేపీ సారథ్యంలోని ఎన్డీయేలో కానీ, విపక్ష 'ఇండియా' కూటమిలో కానీ భాగస్వామిగా లేదు. అయితే 2017లో రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్‌, 2022లో ద్రౌపది ముర్ముకు ఆ పార్టీ మద్దతు తెలిపింది. 2017లో ఉపరాష్ట్రపతి ఎన్నికల సమయంలో ఎన్డీయే అభ్యర్థి ఎం.వెంకయ్య నాయుడు, 2022లో జగ్దీప్ ధన్‌ఖడ్‌కు వైసీపీ మద్దతు ఇచ్చింది.

కాగా, ప్రస్తుత ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్‌ బరిలో ఉండగా, ఎన్డీయేకు లోక్‌సభలో 293 మంది సభ్యులు, రాజ్యసభలో 132 మంది సభ్యుల మద్దతు ఉంది. రాధాకృష్ణన్‌కు కనీసం 425 ఓట్లు వస్తాయని, వైసీపీ మద్దతుతో ఆ సంఖ్య 435 దాటవచ్చని అంచనా వేస్తున్నారు.

ఇవి కూడా చదవండి..

ప్రధాని మోదీతో శుభాంశు శుక్లా భేటీ

మోదీని కలిసిన ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థి రాధాకృష్ణన్

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 18 , 2025 | 09:48 PM