ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

SIT Investigation: వంద ఫిర్యాదులొచ్చినా దర్యాప్తు చేస్తాం

ABN, Publish Date - Aug 04 , 2025 | 04:00 AM

మాజీ ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ లైంగిక దాడికి సంబంధించి వంద ఫిర్యాదులు వచ్చినా దర్యాప్తు చేస్తామని..

  • ప్రజ్వల్‌ వివాదంలో ‘సిట్‌’ చీఫ్‌ బిజయ్‌ కుమార్‌ వెల్లడి

బెంగళూరు, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): మాజీ ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ లైంగిక దాడికి సంబంధించి వంద ఫిర్యాదులు వచ్చినా దర్యాప్తు చేస్తామని ‘సిట్‌’ చీఫ్‌ ఏడీజీపీ బిజయ్‌కుమార్‌ సింగ్‌ తెలిపారు. ప్రజ్వల్‌ రేవణ్ణకు ప్రజాప్రతినిధుల కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ఫిర్యాదు చేసిన బాధితురాలు ఏడాదిగా న్యాయం కోసం గట్టిగా నిలబడ్డారన్నారు. కీలకమైన కేసులో శిక్ష పడడం పోలీసు శాఖకు గర్వకారణమన్నారు. బాధితులు ఎంతమంది ఉన్నా.. ఫిర్యాదు చేస్తే దర్యాప్తు చేస్తామన్నారు. హాసన్‌ జిల్లాలో లైంగిక దాడులకు సంబంధించి ఐదు కేసుల్లో సిట్‌ విచారణ చేసిందని, ఇందులో కేఆర్‌ నగర్‌ తాలూకా బాధితురాలికి సంబంధించిన అత్యాచారం కేసులోనే కోర్టు తీర్పు ఇచ్చిందని అన్నారు. మరో రెండు కేసులు విచారణ దశలో ఉన్నాయన్నారు. కాగా.. పెన్‌డ్రైవ్‌ పంపిణీకి సంబంధించి దర్యాప్తు దాదాపు పూర్తయిందని, రెండు వారాల్లో చార్జిషీట్‌ సమర్పిస్తామని చెప్పారు. ఇదిలా ఉండగా, ప్రజ్వల్‌ రేవణ్ణను పరప్పన అగ్రహార జైలుకు తరలించారు. జైలులో అతడికి ప్రత్యేక దుస్తులతోపాటు ఖైదీ నంబరు 15528 కేటాయించారు.

చివరి సి-295 భారత్‌కు చేరింది.. అప్పగింతలు పూర్తి చేసిన స్పెయిన్

తేజస్వి యాదవ్‌కు ఎన్నికల కమిషన్ నోటీసు

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 04 , 2025 | 04:00 AM