ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Uttarakhand: రోడ్డుపైనే హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్

ABN, Publish Date - Jun 07 , 2025 | 03:47 PM

కేదార్‌నాథ్ వెళ్తున్న హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో పైలట్ వెంటనే అప్రమత్తమై ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసినట్టు ఉత్తరాఖండ్ ఏడీజీ (శాంతిభద్రతలు) వి.మురుగేశన్ తెలిపారు. పైలట్ సహా హెలికాప్టర్‌లోని ఎవరూ గాయపడలేదని చెప్పారు.

డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌ (Uttarakhand)లోని రుద్రప్రయాగ జిల్లా గుప్త్‌కాశీ ప్రాంతంలో శనివారంనాడు అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఒక ప్రైవేటు హెలికాప్టర్‌ రోడ్డు మధ్యలోనే అత్యవసరంగా ల్యాండింగ్ అయింది. హెలికాప్టర్ టెయిల్ భాగం అక్కడే నిలిపి ఉంచిన కారును ఢీకొంది. అయితే ఈ ఘటనలో ఎవరికీ ప్రాణాపాయం జరగలేదు.


కేదార్‌నాథ్ వెళ్తున్న హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో పైలట్ వెంటనే అప్రమత్తమై ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసినట్టు ఉత్తరాఖండ్ ఏడీజీ (శాంతిభద్రతలు) వి.మురుగేశన్ తెలిపారు. పైలట్ సహా హెలికాప్టర్‌లోని ఎవరూ గాయపడలేదని చెప్పారు. హెలికాప్టర్ టెయిల్ భాగం ఢీకొనడంతో అక్కడే నిలిపి ఉంచిన కారు దెబ్బతింది. ఎమర్జెన్సీ ల్యాండింగ్ సమాచారం అందగానే మెడికల్, ఎమర్జెన్సీ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుంది.


క్రిస్టల్ ఏవియేషన్ ప్రైవేటు లిమిటెడ్‌కు చెందిన హెలికాప్టర్ సిర్సి నుంచి కేదార్‌నాథ్‌కు వెళ్తుండగా సాంకేతక లోపం తలెత్తిందని మురేగేషన్ తెలిపారు. దీంతో ముందు జాగ్రత్తగా సమీపంలోని హెలిప్యాడ్‌కు బదులుగా రోడ్డుపైనే ఎమర్జెన్సీ ల్యాండింగ్ జరిగినట్టు చెప్పారు. డీజీసీఏకు సమాచారం ఇచ్చామని, తక్కిన హెలికాప్టర్ సర్వీసులు యథాప్రకారం నడుస్తున్నాయని తెలిపారు.


దీనికి ముందు, ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లాలో మే 8న ప్రైవేటుహెలికాఫ్టర్ ఒకటి భాగీరధి నదికి సమీపంలో కుప్పకూలింది. 200 కిలోమీటర్ల లోతైన లోయలోకి జారిపడటంతో ఆరుగురు మృతి చెందారు. ఇద్దరు ప్రయాణికులు గాయపడ్డారు. మృతుల్లో నలుగురు ముంబై, ఇద్దరు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారున్నారు.


ఇవి కూడా చదవండి...

బీజేపీ కూటమిలోకి పీఎంకే, డీఎండీకే

కాళ్లబేరానికి పాకిస్థాన్..

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 07 , 2025 | 03:50 PM