Ahmedabad Flight Accident: విమాన ప్రమాదంపై స్పందించిన ట్రంప్.. ఏమన్నారంటే..
ABN, Publish Date - Jun 13 , 2025 | 07:46 AM
Ahmedabad Flight Accident: గురువారం మధ్యాహ్నం అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదంలో మొత్తం 241 మంది చనిపోయినట్లు ఎయిర్ ఇండియా వెల్లడించింది. విమానంలో ఉన్న అందరూ చనిపోగా.. ఒకడు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు.
అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. 240మందికి పైగా చనిపోవటంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిన్న సాయంత్రం జరిగిన మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘విమాన ప్రమాదం చాలా భయానకంగా జరిగింది. నేను వాళ్లకు ఇది వరకే చెప్పాను. మా సాయం అవసరం అయితే.. తప్పకుండా వెంటనే చేస్తాం’ అని అన్నారు. ట్రంప్‌తోపాటు పలు దేశాలకు చెందిన దేశాధినేతలు కూడా అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై స్పందించారు.
యునైటెడ్ కింగ్‌డమ్ ప్రధాన మంత్రి కైర్ స్టామర్ ట్విటర్ వేదికగా స్పందిస్తూ.. ‘అహ్మదాబాద్ సిటీలో జరిగిన విమాన ప్రమాదం దిగ్భ్రాంతికి గురి చేసింది. సంఘటనకు సంబంధించి అప్‌డేట్లు తెలుసుకుంటూ ఉన్నాను. ఈ విషాదకర సమయంలో నా ఆలోచనలన్నీ.. ప్రయాణికులు, వారి కుటుంబసభ్యులతోటే ఉన్నాయి’ అని పోస్టు పెట్టారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ట్విటర్ వేదికగా స్పందిస్తూ.. ‘ఇండియాలోని అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదం గురించి తెలిసి బాధేసింది. ఈ బాధాకర సమయంలో ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు.. భారత ప్రధాని నరేంద్ర మోదీకి సానుభూతి తెలియజేస్తున్నాను’ అని పోస్టు పెట్టారు.
ఒక్కడే బతికాడు..
గురువారం మధ్యాహ్నం అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదంలో మొత్తం 241 మంది చనిపోయినట్లు ఎయిర్ ఇండియా వెల్లడించింది. విమానంలో ఉన్న అందరూ చనిపోగా.. ఒకడు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు. అతడి పేరు కుమార్ రమేష్. వయసు 38 సంవత్సరాలు. ఇక, ఈ ప్రమాదంలో చనిపోయిన వారిలో 169 మంది ఇండియన్స్ కాగా.. 53 మంది బ్రిటీష్ వ్యక్తులు.. ఏడుగురు పోర్చుగీస్ వ్యక్తులు.. ఒకరు కెనడాకు చెందిన వ్యక్తి ఉన్నారు.
ఇవి కూడా చదవండి
పసిడి ప్రియులకు షాక్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు..
Updated Date - Jun 13 , 2025 | 03:16 PM