GST Notices: కూరగాయలు వ్యాపారికి రూ.29 లక్షల పన్ను కట్టాలని నోటీస్
ABN, Publish Date - Jul 24 , 2025 | 03:35 AM
చాలా సులువుగా ఉండటంతో ప్రతిచోటా యూపీఐతో చెల్లింపులు చేయడం పెరిగిపోయింది. ఇలా కర్ణాటకలో భారీగా యూపీఐ లావాదేవీలు జరిగిన చిరు వ్యాపారులు, బేకరీలకు జీఎస్టీ కట్టాలంటూ వాణిజ్య పన్నుల శాఖ ఇటీవల నోటీసులు ఇవ్వడం కలకలం రేపింది.
జీఎస్టీ నోటీసుల నేపథ్యంలో చిరు వ్యాపారుల నిరసన
రూ.లక్షల్లో పన్ను కట్టాలంటూ కొందరికి నోటీసులు అందాయని ఆందోళన
సీఎం సిద్దరామయ్యతో చర్చలు
పన్నులు వసూలు చేయబోమంటూ ముఖ్యమంత్రి హామీ.. ఆందోళన విరమణ
డిజిటల్ వినియోగం చాలా ఈజీగా ఉండటంతో ప్రతిచోటా యూపీఐతో చెల్లింపులు చేయడం క్రమంగా పెరిగిపోయింది. ఇలా కర్ణాటకలో భారీగా యూపీఐ లావాదేవీలు జరిగిన చిరు వ్యాపారులు, బేకరీలకు జీఎస్టీ కట్టాలంటూ వాణిజ్య పన్నుల శాఖ ఇటీవల నోటీసులు ఇవ్వడం కలకలం రేపింది.
కొందరికైతే లక్షల్లో పన్ను కట్టాలంటూ నోటీసులు అందాయి. కూరగాయలు అమ్మే శంకర్‌గౌడ అనే వ్యాపారికి గత నాలుగేళ్లలో రూ.1.63 కోట్లు యూపీఐ చెల్లింపులు అందాయని, రూ.29 లక్షలు పన్ను కట్టాలని నోటీసు అందింది. ఇలా తమకు అందిన నోటీసులను వెనక్కి తీసుకోవాలంటూ వ్యాపారులు ఆందోళనకు దిగారు.
దీంతో యూపీఐ చెల్లింపులు స్వీకరించబోమని చాలా చోట్ల ‘నో యూపీఐ’ బోర్డులు పెట్టారు. కేవలం నగదు మాత్రమే తీసుకుంటున్నారు. ఆందోళన మరింత ఉధృతం చేస్తూ.. కర్ణాటక వ్యాప్తంగా పాలు, టీ, కాఫీ విక్రయాలను నిలిపివేశారు. బదులుగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతూ.. నల్ల బ్యాడ్జీలు ధరించి, కేవలం బ్లాక్ కాఫీ, బ్లాక్ టీలను మాత్రమే విక్రయిస్తున్నారు.
ఈ నెల 25వ తేదీన కర్ణాటకవ్యాప్తంగా బంద్‌కు కూడా పిలుపునిచ్చారు. ఆందోళన నేపథ్యంలో వ్యాపారులతో ఆ రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య బుధవారం చర్చలు జరిపారు. జీఎస్టీ నుంచి మినహాయింపు ఉన్న వస్తుసేవలు అందిస్తున్న వ్యాపారుల నుంచి పన్నులు, బకాయిలేమీ వసూలు చేయబోమని హామీ ఇచ్చారు. కాగా, సీఎం సిద్దరామయ్య హామీతో వ్యాపారులు ఈ నెల 25న నిర్వహించాలనుకున్న బంద్‌ను ఉపసంహరించుకున్నారు.
ఇవి కూడా చదవండి
పన్ను చెల్లింపుదారులకు అలర్ట్.. ఈ మోసాల గురించి హెచ్చరిక..
కోటా నియమాలు మార్చిన భారత రైల్వే.. ప్రయాణీకులు ఏం చేయాలంటే..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jul 24 , 2025 | 11:17 AM