Donald Trump: భారత్ పాక్ యుద్ధాన్ని ఆపినందుకు గర్విస్తున్నా
ABN, Publish Date - Jun 01 , 2025 | 05:03 AM
ట్రంప్ భారత్, పాక్ మధ్య అణ్వాయుధ యుద్ధం తలెత్తకుండా డీల్ కుదిర్చినందుకు గర్వపడుతున్నారని చెప్పారు. యుద్ధాన్ని బుల్లెట్ల కాకుండా వాణిజ్యంతో ఆపినట్టు వెల్లడించారు.
బుల్లెట్లతో కాదు బిజినె్‌సతో ఆపా..
అయినా ఎవరూ చెప్పుకోవడం లేదు
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యలు
న్యూఢిల్లీ, మే 31: భారత్-పాక్‌ల మధ్య తలెత్తిన ఘర్షణ అణ్వాయుధ యుద్ధంగా మారకుండా ‘డీల్’ కుదిర్చినందుకు గర్వపడుతున్నానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. బుల్లెట్లను కాకుండా వాణిజ్యాన్ని ఉపయోగించడం ద్వారా యుద్ధాన్ని ఆపినట్టు చెప్పారు. శుక్రవారం రెండు సందర్భాల్లో ఆయన ఈ విషయాన్ని ప్రముఖంగా చెప్పడం గమనార్హం. జాయింట్ బేస్ ఆండ్రూ్‌సలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ‘‘భారత్-పాక్‌ల మధ్య కుదిర్చిన డీల్‌కు గర్వపడుతున్నా. దీనిపై ఎవరూ మాట్లాడుకోవడం లేదు గానీ, పాకిస్థాన్- భారత్‌ల మధ్య చాలా అసహ్యకరమైన యుద్ధం నడుస్తోంది. ప్రస్తుతం అంతా బాగుందిగానీ, రెండూ అణ్వాయుధ దేశాలు. పరిస్థితి దారుణంగా ఉండేది’’ అని వ్యాఖ్యానించారు. భారత్‌తో త్వరలో వాణిజ్య ఒప్పందం కుదురుతుందని ట్రంప్ వెల్లడించారు. ‘‘ఇండియాతో త్వరలో డీల్ కుదుర్చుకుంటాం. వచ్చే వారం పాక్ ప్రతినిధులు వాషింగ్టన్ రానున్నారు. రెండు దేశాలు యుద్ధాన్ని కొనసాగించి ఉంటే డీల్ కుదర్చాలన్న ఆసక్తి నాకు ఏమాత్రం ఉండేది కాదు’’ అని చెప్పారు. అంతకుముందు శ్వేత సౌధంలోని ఓవల్ ఆఫీసులో కూడా ట్రంప్ ఇదే విషయం చెప్పారు.
ఇవి కూడా చదవండి
శ్రీకాంత్ ఫ్యామిలీకి ప్రత్యేక పూజ.. అర్చకుడిపై వేటు
కలెక్టరేట్‌లో కరోనా.. ఐసోలేషన్‌కు ఉద్యోగులు
Read Latest AP News And Telugu News
Updated Date - Jun 01 , 2025 | 05:03 AM