Covid 19: కలెక్టరేట్‌లో కరోనా.. ఐసోలేషన్‌కు ఉద్యోగులు
ABN , Publish Date - May 31 , 2025 | 11:43 AM
Covid 19: ఏపీలో మరోసారి కరోనా కలకలం రేపింది. ఏలూరు కలెక్టరేట్‌లో ఐదుగురు ఉద్యోగులకు కొవిడ్ పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది.
ఏలూరు, మే 31: ఏలూరు కలెక్టరేట్‌లో (Eluru Collectorate) కరోనా (Covid 19) కలకలం రేపింది. కలెక్టరేట్‌లో పనిచేస్తున్న ఐదుగురు ఉద్యోగులకు (Employees) కోవిడ్ పాజిటివ్‌గా (Covid Positive) వైద్యులు నిర్థారించారు. దీంతో వారిని హోం ఐసోలేషన్‌కు తరలించారు. నిన్న కలెక్టరేట్ సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. ఐదుగురికి కోవిడ్ పాజిటివ్ అని తేలింది. మిగిలిన సిబ్బందికి నెగెటివ్‌గా వచ్చింది. కలెక్టరేట్‌లో ఉద్యోగులకు కరోనా పాజిటివ్ రావడంతో తోటి ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు.
కాగా.. ఇటీవల కాలంలో కరోనా తీవ్రంగా ప్రబలుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ అధికారులు, సిబ్బంది అప్రమత్తమయ్యారు. ప్రభుత్వ అధికారులు ఎక్కడికక్కడ కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా నిన్న ఏలూరు కలెక్టరేట్ సిబ్బందికి ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో మొత్తం ఐదుగురు సిబ్బందికి కరోనా పాజిటివ్ అని తేలింది. ఈరోజు ఉదయం రిజల్ట్ రాగా... కరోనా పాజిటివ్ అని వచ్చిన ఐదుగురు ఉద్యోగులను హోం ఐసోలేషన్‌కు తరలించారు. మొత్తం కలెక్టరేట్‌లోని రెండు సెక్షన్ల సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.
అయితే పశ్చిమగోదావరి జిల్లా, ఏలూరు జిల్లాలో కరోనా చాప కింద నీరులా పారుతోంది. గత కొన్ని రోజులుగా పదికి పైగానే కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ముఖ్యంగా ఏలూరులోనే దాదాపు ఐదు కేసులు నమోదు అయ్యాయి. ఇప్పుడు తాజాగా ఏలూరు కలెక్టరేట్‌లో మరో ఐదు కేసులు బయటపడటంతో జిల్లాలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో తణుకుకు సంబంధించి ఓ ఉద్యోగికి కరోనా సోకింది. చికిత్స అనంతరం తిరిగి కరోనా పరీక్షలు నిర్వహించగా నెగిటివ్ అని తేలింది. ఏలూరు కలెక్టరేట్‌లో కరోనా నిర్ధారణ అవడంతో అప్రత్తమైన అధికారులు ఎక్కడికక్కడ శానిటైజేషన్ చర్యలు చేపట్టారు. ఇక ఏపీలో తొలి కరోనా కేసు విశాఖపట్నంలో నమోదు అయ్యింది. విశాఖకు చెందిన ఓ మహిళకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అవడంతో వెంటనే చికిత్స అందేశారు. ఆమె కుటుంబం ఉంటోన్న పరిసరాల్లో శానిటైజేషన్ చేశారు. అలాగే కడప రిమ్స్‌లో 70 ఏళ్ల మహిళకు కరోనా పాజిటివ్ అని తేల్చారు వైద్యులు. జలుబు, జ్వరంతో బాధపడుతున్న మహిళకు కరోనా పరీక్షలు నిర్వహించగా కరోనాగా నిర్ధారణ అయ్యింది.
ఇవి కూడా చదవండి
విజయవాడలో యోగాంధ్ర.. పాల్గొన్న రైతులు
ఆసియా అభివృద్ధి బ్యాంకు అధ్యక్షుడితో కేంద్ర మంత్రి భేటీ
Read Latest AP News And Telugu News