Zero Cost of Living Couple: జీరో కాస్ట్ ఆఫ్ లివింగ్.. నిజం చేసి చూపించిన జంట
ABN, Publish Date - Aug 04 , 2025 | 08:38 PM
ఈ జంట రోజువారీ అవసరాల కోసం సొంతంగా కాయగూరలు పండించుకుంటున్నారు. చిన్న చెరువులో చేపలను పెంచుతున్నారు. ధాన్యం సొంతంగా పండిస్తున్నారు. సొంత కోళ్లు, ఆవులు అందించే గుడ్లు, పాల నుంచి రోజువారీ ప్రొటీన్లు పొందుతున్నారు.
సంపాదనకూ, ఖర్చుకూ పొంతన కుదరక.. సంతృప్తికర జీవనం సాగించడం రోజురోజుకూ కష్టమవుతున్న ఈరోజుల్లో 'జీరో కాస్ట్ ఆఫ్ లివింగ్'తో ఎవరైనా జీవనం సాగిస్తుంటే ఆశ్చర్యపోవడం సహజం. ఏమాత్రం ఖర్చులేని (Zero Cost of Living) ఇంటి గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? అలాంటి జంటను చూశారా?. ఇప్పటివరకూ చూసి ఉండకపోవచ్చు. అలాంటి 'హౌస్' ఉంది. అలాంటి ఇండియన్ జంట ఉన్నారు. వారే సంగీత్, కావ్య జంట. ఇప్పుడు ఈ జంట సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకరిస్తోంది. స్థిరమైన, సంతృప్తికరమైన జీవన విధానాన్ని ఈ జంట ఎలా సుసాధ్యం చేసిందో వారి మాటాల్లోనే విందాం.
తమ అనుభవాలను మొత్తం ఒక వీడియోలో చిత్రీకరించి.. 'జీరో కాస్ట్ ఆఫ్ లివింగ్' అనే శీర్షికతో ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ జంట పోస్ట్ చేసింది. ఏమాత్రం ఖర్చుకు తావులేని విధంగా తామెలా ఆ ఇంట్లో జీవిస్తున్నామో కావ్య ఇందులో వివరించింది. 'మా కలల ఇంటిని నిర్మించడానికి పొదుపులో దాదాపు 60 శాతం పెట్టుబడి పెట్టినప్పుడు మమ్మల్ని మూర్ఖులని అంతా పిలిచారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇప్పుడు మా ఇంట్లో జీవన వ్యయం సున్నా' అంటూ కావ్య నవ్వేసింది.
ఇంటిని స్వయం సమృద్ధిగా మలచుకోవడానికి తాము ఏమేమి చేస్తున్నామో ఆమె వివరించారు. ఈ జంట రోజువారీ అవసరాల కోసం సొంతంగా కాయగూరలు పండించుకుంటున్నారు. చిన్న చెరువులో చేపలను పెంచుతున్నారు. ధాన్యం సొంతంగా పండిస్తున్నారు. సొంత కోళ్లు, ఆవులు అందించే గుడ్లు, పాల నుంచి రోజువారీ ప్రొటీన్లు పొందుతున్నారు. వ్యర్థపదార్థాలు, ఇంధన వినియోగం తగ్గించుకునేందుకు బయోగ్యాస్ ప్లాంట్, వేస్ట్ ప్రోసెసింగ్ సిస్టం ఏర్పాటు చేసుకున్నారు. సౌరఫలకాలు ఇంటికి విద్యుత్‌ను అందిస్తున్నాయి. అదనంగా ఒక గదిలో పుట్టగొడుగుల పెంపకం చేస్తున్నారు. సొంతంగా తేనెను కూడా పండిస్తున్నారు.
సేవింగ్ కూడా
'మా దగ్గర అదనంగా ఉన్న దానిని అమ్ముతున్నాం కూడా. ఇందువల్ల మా కలల ఇంటిని నిర్మిచుకునేందుకు కొంచెం ఎక్కువ డబ్బును ఆదా కూడా చేసుకోవచ్చు' అని కావ్య తెలిపింది. ఈ ఆధునిక ప్రపంచంలో ఈ విషయాలన్నీ మీకు ఆసక్తిగా అనిపిస్తే రిటైర్మెంట్ అనంతర ప్రణాళిక కోసం పని చేస్తున్న అతి కొద్ది మందిలో మీరు కూడా ఒకరు కావచ్చని కావ్య సలహా ఇచ్చారు.
మీరు వస్తే హ్యాపీ
కావ్య తమ వీడియోకు ఇచ్చిన క్యాప్షన్‌లో.. 'డబ్బు ప్రసక్తి లేకుండా ఎలాంటి ఒత్తిళ్లు, చిరాకులకు గురికాని ఇంట్లో మేల్కొనాలనే ఆలోచన మీకు ఉంటుంది. మీకు ఇష్టమైన వాళ్లతో కలిసి కూర్చుని ముచ్చటించుకునే విలువైన క్షణాలు మీకుంటాయి. ఇది కూడా అలాంటిదే. మనం సొంతంగా ఆహారాన్ని పండించుకోవడం, ప్రకృతితో మమేకం కావడం, వ్యర్థపదార్ధాలను స్థిరమైన ఏర్పాటులో నిర్వహించడం. అయితే ఇది 100 శాతం స్థిరమైనదని చెప్పలేం కానీ ప్రయత్నం చేయడం గొప్పగా ఉంటుంది. క్రికెట్ సౌండ్లతో మన కోళ్లు ఇంటికి తిరిగొచ్చినప్పుడు ఆ సంభాషణలు ఆసక్తిగా ఉంటాయి. జీవితం ప్రశాంతంగా ఉంటుంది. మరో పది రోజుల్లో మా పుట్టగొడుగులు మొలకెత్తుతాయి. వాటిలో కొన్నింటితో మీతో ఆ విశేషాలను పంచుకుంటాం. వర్షం ఆగిపోయిన తర్వాత చిన్న ట్రీ హౌస్ నిర్మించుకోవాలని మా చిన్నచిన్న ఆశ. మీరు వచ్చి మాకు కంపెనీ ఇస్తే అది మాకెంతో సరదాగా ఉంటుంది' అని చెప్పింది.
ఇవి కూడా చదవండి..
గల్వాన్ వ్యాలీ వివాదంలో రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టు వార్నింగ్
రాష్ట్రపతితో మోదీ, అమిత్‌షా సమావేశం వెనుక కారణం ఇదేనట
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Aug 04 , 2025 | 08:40 PM