మద్యం తాగితే స్తంభానికి కట్టేయడమే...
ABN, Publish Date - Jun 30 , 2025 | 01:33 PM
నాగపట్టినం జిల్లాలో జాలర్లు అధికంగా నివసించే ఓ కుగ్రామంలో మద్యం తాగి వచ్చే వారిని రోజంతా ఆలయ స్తంభానికి కట్టివేయడం, మహిళలను ఎగతాళి చేసే వారికి గుండు కొట్టించడం వంటి తీర్మానాలను గ్రామసభలో ఆమోదించి, అమ లు చేస్తున్నారు.
- జాలర్ల గ్రామంలో కొత్త తీర్మానాలు
చెన్నై: నాగపట్టినం(Nagapattinam) జిల్లాలో జాలర్లు అధికంగా నివసించే ఓ కుగ్రామంలో మద్యం తాగి వచ్చే వారిని రోజంతా ఆలయ స్తంభానికి కట్టివేయడం, మహిళలను ఎగతాళి చేసే వారికి గుండు కొట్టించడం వంటి తీర్మానాలను గ్రామసభలో ఆమోదించి, అమ లు చేస్తున్నారు. గ్రామసభలో చేసిన తీర్మానాలను అందరికీ తెలిసేలా బ్యానర్లు కూడా కట్టారు.
నాగపట్టినం జిల్లా వేదారణ్యం సమీపం పంచనాతికులం నడుచేది పంచాయతీ పరిధిలోని సిరుతలైకాడులో సుమారు 2,000 మంది నివసిస్తున్నారు. వీరికి చేపల వృత్తి ప్రధానమైనది. కొంతకాలంగా గ్రామానికి చెందిన యువకులు మద్యానికి బానిసలు మారడం ఆందోళనకు గురిచేసింది. ఆ సమస్య పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని గ్రామస్తులు నిర్ణయించారు. గ్రామ పెద్ద నామకోటి నేతృత్వంలో శనివారం గ్రామస్తులు సమావేశమయ్యారు.
మద్యం తాగి గ్రామంలో ప్రవేశించి ఘర్షణలకు పాల్పడే వారిని మారియమ్మన్ ఆలయ స్తంభానికి రోజంతా కట్టిపడేయాలని, వారి వాహనాలు స్వాధీనం చేసుకోవాలని మొదటి తీర్మానం చేశారు. ఇక మహిళలను ఎగతాళి చేయడం, ప్రేమ పేరుతో యువతుల వెంటపడడం తదితర ఘటనలకు పాల్పడే వారిని గుర్తించి ఆలయం ముందు గుండు గీయించాలని రెండో తీర్మానం చేశారు. ఈ తీర్మానాలు అందరూ తెలుసుకునేలా గ్రామంలోని పలు ప్రాంతాల్లో బ్యానర్లు ఏర్పాటుచేశారు.
ఈ వార్తలు కూడా చదవండి.
గుడ్ న్యూస్.. రూ.98 వేల దిగువకు బంగారం.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..
ఎంపీ రఘునందన్‌కు మళ్లీ బెదిరింపు కాల్
Read Latest Telangana News and National News
Updated Date - Jun 30 , 2025 | 01:49 PM