ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Minister Raju: యాపిల్‌ ఎలక్ట్రానిక్స్‌ హబ్‌గా తమిళనాడు..

ABN, Publish Date - Jul 29 , 2025 | 11:38 AM

తమిళనాడు రాష్ట్రం యాపిల్‌ సప్లయర్స్‌ అండ్‌ ఎకో సిస్టమ్‌ కంపెనీ (యాపిల్‌ ఎలక్ట్రానిక్స్‌) హబ్‌గా మారనుందని రాష్ట్ర పరిశ్రమల శాఖామంత్రి టీఆర్‌బీ రాజా వెల్లడించారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా రూపొందించిన తమిళనాడు ఎలక్ట్రానిక్స్‌ కాంపోనెంట్స్‌ పథకం కింద రూ.30 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించి, 60 వేల మందికి ఉపాధి అవకాశాల రూపకల్పనే ధ్యేయంగా ముందుకుసాగుతున్నట్టు ఆయన తెలిపారు.

- రూ.30 వేల కోట్ల పెట్టుబడులు

- 60 వేల మందికి ఉపాధి అవకాశాలు

- మంత్రి టీఆర్‌బీ రాజా

చెన్నై: తమిళనాడు రాష్ట్రం యాపిల్‌ సప్లయర్స్‌ అండ్‌ ఎకో సిస్టమ్‌ కంపెనీ (యాపిల్‌ ఎలక్ట్రానిక్స్‌) హబ్‌గా మారనుందని రాష్ట్ర పరిశ్రమల శాఖామంత్రి టీఆర్‌బీ రాజా వెల్లడించారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా రూపొందించిన తమిళనాడు ఎలక్ట్రానిక్స్‌ కాంపోనెంట్స్‌ పథకం కింద రూ.30 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించి, 60 వేల మందికి ఉపాధి అవకాశాల రూపకల్పనే ధ్యేయంగా ముందుకుసాగుతున్నట్టు ఆయన తెలిపారు. సోమవారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ... యాపిల్‌ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీలు దేశంలోని ఇతర రాష్ట్రాల కంటే తమిళనాడు(Tamilnadu)లో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయన్నారు.

రాష్ట్రంలో అత్యున్నత ప్రమాణాలతో కూడిన మౌలిక సదుపాయాలు, నిరంతర విద్యుత్‌ సరఫరా, నైపుణ్యంతో కూడిన మానవ వనరులు ఇలాంటి అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారన్నారు. గత ఏప్రిల్‌లో రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన తమిళనాడు ఎలకా్ట్రనిక్స్‌ కాంపోనెంట్స్‌ పథకం గతంలో కేంద్రం ప్రకటించిన పథకంతో సమానంగా ఉందన్నారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక రాయితీలను ప్రకటిస్తూ పెట్టుబడిదారులను ఆకర్షిస్తుందన్నారు.

ఈ పథకం కింద రూ.30 వేల కోట్ల పెట్టుబడులు, 60 వేల ఉపాధి అవకాశాలను సృష్టించనున్నట్టు తెలిపారు. యాపిల్‌ కంపెనీని రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు తొలి ప్రాధాన్యత ఇచ్చామని, ఇది విజయవంతంగా పూర్తయిందన్నారు. రాష్ట్రంలోని మౌలికసదుపాయాలు, మానవవనరుల గురించి యాపిల్‌ కంపెనీ నిర్వాహకులు తెలుసుకుని, రాష్ట్రానికి తొలి ప్రాధాన్యత ఇచ్చారన్నారు. యాపిల్‌కు వరల్డ్‌ సప్లయర్‌గా ఫాక్స్‌కాన్‌ ఉందని, ఇది తమిళనాడులో ఐఫోన్లు తయారు చేసి తొలి ఫోన్లను అమెరికాకు ఎగుమతి చేసిందన్నారు.

దేశంలో తమిళనాడు రాష్ట్రం నుంచి ఎలకా్ట్రనిక్స్‌ ఉత్పత్తుల ఎగుమతులు 41.2 శాతం ఉందని, 2024-25 ఆర్థిక సంవత్సరంలో 14.65 బిలియన్‌ డాలర్ల విలువ చేసే ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తులను ఎగుమతి చేసినట్టు ఆయన వెల్లడించారు. వచ్చే మూడు లేదా నాలుగేళ్ళలో ఇది 50 బిలియన్‌ డాలర్లకు చేరుకుంటుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. కొత్త ప్లాంట్‌ ద్వారా కెమెరా, డిస్‌ప్లే మాడ్యుల్స్‌, సెన్సార్లు, హెచ్‌డీఐ, లి-ఐయాన్‌ సెల్స్‌ వంటి ఎలకా్ట్రనిక్స్‌ ఉత్పత్తులను తయారు చేస్తామని మంత్రి రాజా వెల్లడించారు.

ఈ వార్తలు కూడా చదవండి..

హైదరాబాద్‌ సహా ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు

ప్రధాని మోదీని బీసీ కాదనడం సిగ్గుచేటు

Read Latest Telangana News and National News

Updated Date - Jul 29 , 2025 | 11:38 AM