Supreme Court: కర్నల్ సోఫియాకు క్షమాపణలు కోరండి
ABN, Publish Date - May 16 , 2025 | 05:28 AM
ఆపరేషన్ సిందూర్‌లో కీలకంగా వ్యవహరించిన కర్నల్ సోఫియా ఖరేషీ పట్ల అవమానకర వ్యాఖ్యలు చేసిన మధ్యప్రదేశ్ మంత్రి విజయ్ షా (బీజేపీ) పట్ల గురువారం సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఎంపీ మంత్రి విజయ్ షాకు సుప్రీంకోర్టు ఆదేశం
న్యూఢిల్లీ, మే 15: ఆపరేషన్ సిందూర్‌లో కీలకంగా వ్యవహరించిన కర్నల్ సోఫియా ఖరేషీ పట్ల అవమానకర వ్యాఖ్యలు చేసిన మధ్యప్రదేశ్ మంత్రి విజయ్ షా (బీజేపీ) పట్ల గురువారం సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమెకు క్షమాపణలు చెప్పాలని ఆదేశించింది. హైకోర్టుకు స్వయంగా వెళ్లి క్షమాపణలు అందజేయాలని సూచించింది.
కర్నల్ సోఫియాను ‘ఉగ్రవాదుల సోదరి’ అని మంత్రి అభివర్ణించడంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్.గవాయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయ్ షాపై మధ్యప్రదేశ్‌లో క్రిమినల్ కేసు నమోదు కాగా, దానిపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. అరెస్టు చేయకుండా అడ్డుకోవాలని కోరుతూ సుప్రీంకోర్టులో అప్పీలు చేయగా ‘ఒక్క రోజులో ఏమీ జరిగిపోదు, మీరెవరో మీకు తెలుసు’ అని సీజేఐ వ్యాఖ్యానించారు.
Updated Date - May 16 , 2025 | 05:28 AM